Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: warangal police commissionerate

వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ పోలీస్ స్టేషన్
National

వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ పోలీస్ స్టేషన్

వరంగల్: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ (warangal cyber police station) ను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో అదే స్థాయిలో సైబర్ నేరాలు (cyber crime) కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలకు సంబంధంచిన ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు వరంగల్ సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవసరమైన ప్రదేశాన్ని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ...
బహిరంగంగా.. తల్వార్ తిప్పితే ఇక జైలుకే..
Local

బహిరంగంగా.. తల్వార్ తిప్పితే ఇక జైలుకే..

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ Warangal : బహిరంగంగా తల్వార్(కత్తి)ను తిప్పుతూ ప్రదర్శనలు ఇచ్చేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల కాలం లో వరంగల్ కమిషనరేట్ పరిధి (warangal police commissionerate) లో తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోతోంది. కొందరు వ్యక్తులు తల్వార్లు, కత్తులతో యథేచ్ఛగా తిరుగుతూ ఫొటోలకు ఫోజులిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై ఎవరైనా వ్యక్తులు పుట్టిన రోజుల వేడుకల్లో గానీ ఇతర కార్యక్రమాల సమయాల్లో గానీ తల్వార్లను బహిరంగంగా ఎత్తిచూపడం, వాటిని తిప్పతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్వార్లు లేదా కత్తులతో కేకులను కట్ చేస్తున్నట్లుగా దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా పోస్టులు చేయొద్దని హెచ్చరించారు. అలాగే తల్వార్లు పట...
ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..
Local

ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..

Warangal : ఆటోలో మర్చిపోయిన సూమారు రూ.12 లక్షల విలువ గల 240 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును నిమిషాల వ్యవధిలోనే గుర్తించి తిరిగి బాధిత మహిళకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అప్పగించారు.ఈ సంఘటన సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు వివరాలను వెల్లడించారు. శనివారం రాత్రి కాశిబుగ్గ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందగట్ల జోత్స్న వరంగల్ చౌరస్తా బట్టలతో పాటు తన ఇంటిలోని బంగారు ఆభరణాలకు మెరుగు పెట్టించుకొని ఆటోలో కాశిబుగ్గ చౌరస్తాలోదిగి ఇంటికి వెళ్లింది. కాగా బంగారు ఆభరణాల బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది. ఆ విషయాన్ని గ్రహించిన సదరు మహిళ వెంటనే కాశిబుగ్గ చౌరస్తాలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎర్ర రవికి సమాచారం ఇచ్చింది. ఆయన తక్షణమే అప్రమత్తమైన హోంగార్డు తన మ్యాన్ ప్యాక్ ద్వారా ఇన్ స్పెక్టర్ వెంకన్నతో పాటు, మిగతా ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వరంగల్ ల...
బైక్ ల చోరీల్లో ఆరితేరారు.. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు..
National

బైక్ ల చోరీల్లో ఆరితేరారు.. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు..

ఇద్దరు బైక్ దొంగలను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ (warangal police commissionerate) పరిధిలో ద్విచక్ర వాహనాలు, తాళం వేసి ఉన్న షటర్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్, మట్వాడా, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు లక్షల రూపాయల విలువైన తొమ్మిది ద్విచక్రవాహనాలు, రూ1.60లక్షల నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను  క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడించారు. మాట్వాడా పోలీసులు అరెస్టు చేసిన వరంగల్ పోచమ్మమైదాన్ కు చెందిన బరిపట్ల  సాయి( 30) మద్యంతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో వరంగల్ పోలీస్ కమికషనరప్ పాటు మహబూబాబాద్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిపై గతంలో...