Bengaluru-Ernakulam | జూలై 31 నుంచి బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ప్రారంభం.. ఈ స్టేషన్లలో హాల్టింగ్
Bengaluru | ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బెంగుళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Bengaluru-Ernakulam Vande Bharat) ఎట్టకేలకు జూలై 31న ప్రారంభం కానుంది. పలు నివేదికల ప్రకారం, ఈ కొత్త రైలు వారానికి మూడు సార్లు నడుస్తుంది. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కేరళలో ఇది మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.
టైమింగ్స్ ఇవీ..
ఎనిమిది కోచ్‌లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు బయలుదేరి, రాత్రి 10 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది, ఎర్నాకులం నుంచి - బుధ, శుక్ర, ఆదివారాల్లో మూడు వారాల్లో సేవలు అందజేస్తుంది.మరోవైపు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు కంటోన్మెంట్ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది, గురు, శని, సోమవారాల్లో నడుస్తుంది. రైలు మార్గంలో త్రిస్సూర్, పాలక్కాడ్, పోడన్న...