
Vande Bharat Sleeper Trains | ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వే.. తన ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి నిరంతరం అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే త్వరలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేలు రెడీ అయ్యాయి. రెండు నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి అన్ని సాంకేతిక పనులు తుది దశలో ఉన్నాయని, ఈ రైళ్లు ప్రయాణికులకు మెరుగైన వసతులను అందజేస్తాయని వైష్ణవ్ తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైలు సెట్ పూర్తి చేసే పని శరవేగంగా జరుగుతుంది. మొదటి రైలు రెండు నెలల్లో ట్రాక్ పైకి వస్తుంది. సాంకేతిక పనులన్నీ చివరి దశలో ఉన్నాయి. రైలు సెట్‌ను బెంగుళూరులోని దాని రైలు యూనిట్‌లో BEML లిమిటెడ్ తయారు చేసింది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ వెర్షన్ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వివిధ సౌకర్యాలను అందిస్తుంది” అని మంత్రి వైష్ణవ్ చెప్పారు.
వందే భారత్ స్లీపర్ రైలు బాడీ హై-గ్రేడ్ ఆస్టెనిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడిందని మంత్రి చెప్పారు. “కారు బాడీ స్ట్రక్చర్ హై-గ్రేడ్ ఆస్టెనిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందించబడింది. కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కోచ్ లను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వందే భారత్ స్లీపర్ రైలు: డిజైన్
BEML వందే భారత్ స్లీపర్ రైళ్లను ఆకర్షణీయంగా డిజైన్ చేసింది.వందే భారత్ స్లీపర్ రైళ్లు వాటి ఇంటీరియర్స్, స్లీపర్ బెర్త్‌లు, ఎక్స్‌టీరియర్స్ ఆకట్టుకునే కలర్ కాంబినేషన్ లో ఇటు అందంతోపాటు మన్నికకు రెండింటికీ ప్రాధాన్యతనిస్తాయి. ఇంటీరియర్ ప్యానెల్‌లు, సీట్లు, బెర్త్‌లు, ఇంటీరియర్ లైట్లు, కప్లర్‌లు, గ్యాంగ్‌వేలు ఇలా ప్రతీ అంశం ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిందని మంత్రి చెప్పారు.
ముఖ్యంగా, పూర్తిగా స్వదేశీ పరిజఒానంతో తయారైన భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైళ్లు ప్రయాణీకుల అనుభవాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఈ ఆధునిక రైలు విజయవంతమైన తర్వాత, భారతీయ రైల్వేలు ఇప్పుడు స్వదేశీ హై-స్పీడ్ రైళ్లను వందే స్లీపర్ వెర్షన్ ను ప్రారంభించబోతున్నాయి. గంటకు 200 కిమీ వేగంతో ప్రయాణించేలా రూపొందించబడిన వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రస్తుత రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలవనుంది.
Vande Bharat Sleeper Trains : ఫీచర్లు
ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్ల నుంచి కొత్తగా స్లీపర్ కోచ్ లు వస్తున్నాయి. ఈ రైళ్లు రాత్రిపూట ప్రయాణాల కోసం స్లీపర్ బెర్త్‌లను కలిగి ఉంటాయి. రైలులో GFRP ప్యానెల్‌లతో కూడిన బెస్ట్-ఇన్-క్లాస్ ఇంటీరియర్స్, ఆటోమేటిక్ ప్లగ్ స్లైడింగ్ ప్యాసింజర్ డోర్లు, 1వ AC కారులో వేడినీటితో కూడిన షవర్, ఎర్గోనామిక్‌గా రూపొందించబడిన టాయిలెట్ సిస్టమ్, ప్రత్యేక బెర్త్‌లు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా టాయిలెట్‌లు ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, 1 AC ఫస్ట్ క్లాస్, 4 AC టూ-టైర్, 11 AC త్రీ-టైర్ కంపార్ట్‌మెంట్లు 16 బోగీల కార్ సెట్‌గా ఈ రైలు ఉంటుంది.
ఉన్న రైలు అనేక ఉత్తేజకరమైన అప్‌గ్రేడ్‌లతో వస్తున్నట్లు భారతీయ రైల్వే చెప్పింది. వాటిలో మెరుగైన సౌండ్‌ఫ్రూఫింగ్, కుదుపులులోని స్టార్ట్‌లు, స్టాప్‌లు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన రెస్ట్‌రూములు ఉన్నాయి. దీని డిజైన్ ఏరోడైనమిక్ ఎక్ట్సీరియర్, కాంపాక్ట్ వంటగదిని కలిగి ఉంది. పబ్లిక్ అడ్రస్, విజువల్ డిస్‌ప్లే సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నింటికంటే ఉత్తమమైనది. ఈ రైలులో వివిధ తరగతుల్లో 823 మంది ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణించవచ్చు.
Vande Bharat Express స్లీపర్ రైలు ఫీచర్లు:
- రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన కుషనింగ్‌తో కూడిన సౌకర్యవంతమైన బెర్త్‌లు
- ఎగువ బెర్త్‌లకు సులభంగా ఎక్కడానికి మెరుగ్గా డిజైన్ చేయబడిన నిచ్చెనలు
- మెరుగైన కప్లర్‌లతో కుదుపులు లేని సుఖవంతమైన ప్రయాణం
- ఆకర్షణీయంగా కనిపించేలా లోపలి భాగంలో క్రీమ్, పసుపు, కలప రంగులు ఉపయోగించారు.
- కామన్ ఏరియాలో సెన్సార్ ఆధారిత లైటింగ్.
- కోచ్‌ల మధ్య ప్రాంతంలో సులభంగా కదలిక కోసం స్ట్రిప్స్ ద్వారా నేలపై మెరుగైన నైట్ లైటింగ్
- పవర్ఫుల్ ఓవర్ హెడ్ లైటింగ్
- యాంటీ-స్పిల్ ఫీచర్స్ కలిగిన వాష్ బేసిన్లు..
పైన పేర్కొన్నవే కాకుండా, కొత్త వందే భారత్ స్లీపర్ రైలులో కొన్ని ఇతర ముఖ్య లక్షణాలు:
- రైలు హెడ్‌లైట్‌ల కోసం డేగ పక్షి కళ్ల నుండి స్ఫూర్తితో ఏరోడైనమిక్ ఎక్స్టెరియల్
- GFRP ప్యానెల్‌లతో కూడిన బెస్ట్ క్లాస్ ఇంటీరియర్స్
- సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్స్
- ఆటోమేటిక్ ఔటర్ పాసింజెర్స్ డోర్స్.
- దివ్యాంగుల కోసం ప్రత్యేక బెర్త్‌లు, మరుగుదొడ్లు
- ఫస్ట్ ఏసీ కార్ లో వేడి నీళ్లతో స్నానం చేయవచ్చు.
- పబ్లిక్ అనౌన్స్మెంట్స్ దృశ్య సమాచార వ్యవస్థ
- విశాలమైన లగేజీ గది
- ఎర్గోనామిక్‌గా రూపొందించబడిన టాయిలెట్ సిస్టమ్
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..