Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: Uttar Pardesh

CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..
National, Special Stories

CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..

8 Years of UP CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం (Yogi Government) అధికారంలోకి వచ్చి విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌ను సమూలంగా మార్చారు. గూండాల రాష్ట్రంగా పిలిచే ఉత్తరప్రదేశ్ నేడు యోగి పాలనలో నేరస్థులు, గూండాలపై పోలీసు లాఠీలు, బుల్డోజర్లు (bulldozer) తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. యోగి ప్రభుత్వ పోలీసులు ఎన్‌కౌంటర్లలో 222 మంది పేరుమోసిన నేరస్థులు హతమయ్యారు. సుమారు 8,118 మంది గాయపడ్డారు.మోస్ట్ వాంటెండ్ నేరస్తులుయుపి పోలీసులు (Uttarpradesh Police) 20,221 మంది వాంటెడ్ నేరస్థులను అరెస్టు చేయగా, 79,984 మందిపై గ్యాంగ్‌స్టర్ చర్యలు తీసుకున్నారు. 930 మందిపై NSA చర్యతో, రూ.142 బిలియన్లకు పైగా విలువైన ఆస్తులు జప్తు చేశారు. దీనితో పాటు, జూలై 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆపరేషన్ కన్విక్షన్ కింద, 51 మంది న...
Sambhal Case : షాహీ జామా మసీదు కేసుపై అలహాబాద్ హైకోర్టులో నేడు విచారణ
Trending News

Sambhal Case : షాహీ జామా మసీదు కేసుపై అలహాబాద్ హైకోర్టులో నేడు విచారణ

Sambhal Case : సంభాల్‌లోని షాహి జామా మసీదుకు సంబంధించిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) మంగళవారం విచారించనుంది. దేశ వాప్తంగా అంద‌రి దృష్టిని ఆకర్షించిన ఈ కేసును జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఉదయం 10 గంటలకు విచారించనుంది.కొన్ని నెల‌లుగా తీవ్ర చర్చకు దారితీసిన సంభాల్ మ‌సీదు (Jama Masjid) ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి అనుమతి కోరుతూ మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు జరిగే విచారణ సందర్భంగా, భారత పురావస్తు సర్వే (ASI) బృందం మసీదు పరిశుభ్రతపై నివేదికను సమర్పిస్తుంది. మసీదును పరిశీలించి దాని పరిశుభ్రతను నిర్ధారించాలని కోర్టు గతంలో ASIని ఆదేశించింది. ASI నివేదికకు ప్రతిస్పందనగా మసీదు కమిటీ ప్రతినిధులు సమాధాన‌విమ‌వ్వ‌నున్నారు.మసీదు నిర్వహణ కమిటీ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, శుక్రవారం కోర్టు (Allahabad High Court) షాహి జామా మసీదు ప్రాంగణాన్...
Kumbh Mela 2025 : మహా కుంభమేళా గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు
National

Kumbh Mela 2025 : మహా కుంభమేళా గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు

Kumbh Mela 2025 : ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ప్ర‌పంచంలోనే అతిపెద్ద జాత‌ర ప్రారంభ‌మైంది. మహా కుంభం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మూడు పవిత్ర నదులైన గంగా, యమునా, సరస్వతి న‌దులు ప్ర‌యాగ్ రాజ్ (Prayag Raj) లో క‌లుస్తాయి అందుకే దీనిని త్రివేణి సంగ‌మం (Triveni Sangam) అని పిలుస్తారు..మహా కుంభ్‌లో మూడు రాజ స్నానాలు (అమృత్ స్నాన్), మూడు ఇతర స్నానాలతో సహా ఆరు పుణ్య‌స్నానాలను ఆచ‌రిస్తారు.జనవరి 13, 2025: పౌష్ పూర్ణిమ,జనవరి 14, 2025: మకర సంక్రాంతి (మొదటి అమృత స్నాన్),జనవరి 26, 2025: మహా శివరాత్రి (చివరి స్నాన్),జనవరి 29, 2025: మౌని అమావాస్య (రెండవ అమృత స్నాన్).ఫిబ్రవరి 3, 2025: బసంత్ పంచమి (మూడవ అమృత స్నాన్),ఫిబ్రవరి 12, 2025: మాఘి పూర్ణిమ,ప్రయాగ్ రాజ్ కు 40 కోట్ల మంది భక్తులు?మహా కుంభమేళా, కుంభమేళా మధ్య ప్రధాన వ్యత్...
మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ ను కాంగ్రెస్‌ ఎందుకు టార్గెట్ చేసింది?
Trending News

మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ ను కాంగ్రెస్‌ ఎందుకు టార్గెట్ చేసింది?

EX CJI DY Chandrachud : మాజీ సీజేఐ డీవై చంద్ర‌చూడ్ పై కాంగ్రెస్ తోపాటు ప‌లు ముస్లిం పార్టీలు కొన్నిరోజులుగా టార్గెట్ చేశాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని సంభాల్‌లో మ‌సీదును స‌ర్వే చేసిన నేపథ్యంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ దాఖ‌లైన‌ పిటిష‌న్‌ ను కూడా కోర్టు స్వీకరించింది. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ‌రుస ప‌రిణామాల మధ్య భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రతిపక్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టాయి. మాజీ CJI ప్రతిపక్ష పార్టీల నుంచి దాడికి గురి కావడానికి కారణం, మసీదులలో సర్వేకు ఆయ‌న దారుల‌ను సుగ‌మం చేశారు. మెహబూబా ముఫ్తీ అయినా, కాంగ్రెస్ నాయకుడు రామ్ రమేష్ అయినా అందరూ మాజీ సీజేఐపై విరుచుకుపడడానికి కారణం ఇదే.2023లో జ్ఞాన్‌వాపిలో ఏఎస్‌ఐ సర్వే నిర్వహించాలల‌ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యంతెలిసిందే..ఈ తీర్పును వెలువరించిన న్యాయ...
Sambhal Violence | సంభాల్‌ షాహీ జామా మసీదుగా సర్వే బృందంపై రాళ్ల దాడి, సెక్షన్ 144 విధింపు
Crime

Sambhal Violence | సంభాల్‌ షాహీ జామా మసీదుగా సర్వే బృందంపై రాళ్ల దాడి, సెక్షన్ 144 విధింపు

Sambhal Violence | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు సర్వేపై దుమారం రేగింది. ఆదివారం ఉదయం మ‌సీదును స‌ర్వే చేయ‌డానికి వ‌చ్చిన అధికారుల‌ సర్వే బృందంపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి రాళ్ల దాడికి పాల్ప‌డ్డారు. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌తో పాటు లాఠీచార్జికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీనియర్ పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు య‌త్నిస్తున్నారు.సంభాల్‌లోని షాహీ జామా మసీదుకు సంబంధించి వివాదం నెలకొంది. ఇక్కడ హిందూ పక్షం ఇది జామా మసీదు కాదని, హరిహర‌ దేవాలయమని వాదిస్తోంది. దీనిపై కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయగా, విచారణకు ఆదేశించింది. ఈరోజు ఆదివారం ఉదయం 7.30 గంటల నుంచి ఇక్కడ సర్వే నిర్వహించాల్సి ఉంది. అడ్వకేట్ కమీషనర్ సర్వే కోసం వచ్చారు, అయితే ఇంతలో పెద్ద సంఖ్యలో దుండ‌గులు అక్కడ గుమిగూడి రాళ్ల దాడి ప్రారంభించారు.షాహీ జామా మసీదు సర్వే సందర్భ...
యూపీలో సీఎం యోగీ మార్క్‌.. ఫలించిన ‘బాటోంగే టు కటోంగే’ నినాదం..
Elections

యూపీలో సీఎం యోగీ మార్క్‌.. ఫలించిన ‘బాటోంగే టు కటోంగే’ నినాదం..

 UP Bypolls 2024 : ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డి)తో కలిసి 9 స్థానాలకు గాను 7 స్థానాలను గెలుచుకుని అఖండ విజయాన్ని నమోదు చేసింది. మహారాష్ట్ర , జార్ఖండ్‌లలో రెండో దశతో పాటు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. యూపీ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ 6 స్థానాల్లో గెలుపొందగా, దాని మిత్రపక్షమైన‌ ఆర్‌ఎల్‌డీ పోటీ చేసిన ఏకైక సీటును గెలుచుకుంది.UP ఉపఎన్నికల విజయం ఉత్తర భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికలలో ఒకదానిలో తన బలమైన పట్టును కొససాగించింది. యూపీలో యుపి ఉపఎన్నికలలో ఎన్‌డిఎ అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఓట‌ర్లు ప్రధాని మోదీ నాయకత్వానికి, సిఎం యోగి పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అలాగే యోగీ హిందూ ఐక్యత కోసం ఇచ్చిన 'బాటేంగే తో కటేంగే (Batenge Toh Katenge) నినాదం హిందూ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించింద‌ని పోల్‌స్టర్లు, విశ్లేషకులు భావిస్తున్...
నర్సు చేసిన ఈ తప్పిదంతో పెను ప్ర‌మాదం..? 10 మంది నవజాత శిశువులు సజీవ‌ద‌హ‌నం
Crime

నర్సు చేసిన ఈ తప్పిదంతో పెను ప్ర‌మాదం..? 10 మంది నవజాత శిశువులు సజీవ‌ద‌హ‌నం

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ (ఎన్‌ఐఎస్‌యు)లోని పిల్లల వార్డులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కొద్ది క్ష‌ణాల్లోనే ఎన్‌ఐఎస్‌యూ వార్డులో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందగా, మ‌రో 16 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అయితే అగ్నిప్రమాదానికి ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎన్‌ఐఎస్‌యులోని ఓ భాగంలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటన రాత్రి 10:30 నుంచి 10:45 గంటల మధ్య జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే చైల్డ్ వార్డు కిటికీని పగులగొట్టి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా 35 మందికి పైగా చిన్నారులను సురక్షితంగా రక్షించార...
Ayodhya Deepotsav 2024 | దేదీప్యమానంగా అయోధ్య .. 28 లక్షల దీపాల‌తో గిన్నిస్ రికార్డ్..
National

Ayodhya Deepotsav 2024 | దేదీప్యమానంగా అయోధ్య .. 28 లక్షల దీపాల‌తో గిన్నిస్ రికార్డ్..

Ayodhya Deepotsav 2024 | దీపావళి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని యూపీలోని టెంపుల్ సిటీ అయోధ్యలో ఏర్పాటు చేసిన భవ్య దిపోత్సవ్ కార్యక్రమం అంగ‌రంగ వైభ‌వంగా సాగింది. భవ్య దిపోత్సవ్ వేడుకల సందర్భంగా అయోధ్య రామ మందిరంలో 28 లక్షల దీపాల‌ను వెలిగించారు. సరయూ నది ఘాట్ లో 1,100 మంది భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో హారతులు ఇచ్చారు. 28 లక్షల దివ్వెల వెలుగులతో భవ్య దిపోత్సవ్ గిన్సిస్ వరల్డ్ రికార్డ్ ను కైవ‌సం చేసుకుంది. లక్షలాది మంది భక్తుల నడుమ అయోధ్య వీధుల్లో రామలక్ష్మణుల శోభాయాత్ర జ‌రిగింది. ఈ రామలక్ష్మణుల రథాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ లాగారు.In Uttar Pradesh, lakhs of diyas lit up the banks of the Saryu River in Ayodhya as part of the grand #Deepotsav celebration. This vibrant display marks a significant cultural event, showcasing the spirit of Diwali. #Ayodhya #FestivalOfLights #Diwali2024 pic.twitter.c...
Uttar Pardesh | తమ ఆస్తి వివరాలను వెల్ల‌డించ‌ని 2.5 లక్షల మంది ఉద్యోగులు .. వేత‌నాల నిలిపివేత‌
National

Uttar Pardesh | తమ ఆస్తి వివరాలను వెల్ల‌డించ‌ని 2.5 లక్షల మంది ఉద్యోగులు .. వేత‌నాల నిలిపివేత‌

Uttar Pardesh | ఆన్‌లైన్‌లో తమ ఆస్తి వివరాలను వెల్లడించని 2.5 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్య‌వ‌హ‌రించింది. ఆన్‌లైన్‌లో తమ ఆస్తి వివరాలను వెల్లడించని కార‌ణంగా వారి వేత‌నాల‌ను నిలిపివేసింది. ఈ వ్యవ‌హారంలో 2,44,565 మంది ఉద్యోగులు ఆగస్టు నెలకు సంబంధించిన‌ వేతనాలు అందుకోలేదు. శాఖల నివేదికల ఆధారంగా ఈ ఉద్యోగులందరికీ ఆగస్టు నెల జీతాలు నిలిపివేశారు. ప్ర‌భుత్వ‌ ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 31 లోపు రాష్ట్ర ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను మానవ సంపద పోర్టల్ (Manav Sampada Portal )లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, సమాచారం ప్రకారం, 71 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఈ సమాచారాన్ని అప్‌లోడ్ చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, పీపీఎస్‌, పీసీఎస్‌ అధికారుల తరహాలో రాష్ట్ర ఉద్యోగులు ఆన్‌లైన్‌లో ఆస్తుల వివరాలను తెలియజేయడం తప్పనిసరి చేశారు. జీతం ఎందుకు ఆగిపోయింది? ఉత్తరప్రదేశ్‌ (Uttar Pardesh)లో...