West Bengal | జూనియర్ డాక్టర్ రేప్ కేసులో ఆగని నిరసన జ్వాలలు.. 50మంది సీనియర్ వైద్యుల రాజీనామా
Rg Kar Medical College Case | పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో (RG Kar Medical College ) వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య ఘటనలో షాకింగ్ పరిణామాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్ వైద్యులు కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు సీనియర్ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు సైతం మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం 15 మంది సీనియర్ వైద్యులు జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోని 50 మంది సీనియర్ వైద్యులు, బోధనా సిబ్బంది ఒక్కసారిగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వీరు రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ కళాశాల హాస్పిటల్ లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్ ...