Saturday, August 30Thank you for visiting

Tag: TGSRTC

ప్ర‌యాణికుల‌కు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. హైద‌రాబాద్ శివార్ల‌లో..

ప్ర‌యాణికుల‌కు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. హైద‌రాబాద్ శివార్ల‌లో..

Telangana
Special Buses for Dasara హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) 6,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు అక్టోబరు 1 నుంచి 15 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, వాటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని తెలిపింది. న‌గ‌ర కీల‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక బ‌స్సులు పండుగల సమయంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది . MGBS , JBS, LB నగర్ , ఉప్పల్, ఆరామ్‌ఘర్, సంతోష్‌నగర్, KPHB, ఇతర ప్రాంతాల నుంచి వారి స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక బ‌స్సులు అందుబాటులో ఉంచబడతాయి . ఐటీ కారిడార్‌ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ మీదుగా విజయవాడ , బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్స...
ప్ర‌యాణికుల‌కు TGSRTC గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో 70 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు

ప్ర‌యాణికుల‌కు TGSRTC గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో 70 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు

Telangana
TGSRTC Metro Delux Bus | హైదరాబాద్: ప్ర‌జ‌ల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న 55 ఫ్లీట్‌కు మరో మెట్రో డీలక్స్ బస్సులను ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఉప్పల్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, జగద్గిరిగుట్ట, ఎల్‌బీ నగర్ వంటి కీలక మార్గాల్లో 70 కొత్త బస్సులు సేవలందించ‌నున్నాయి. కొత్త మెట్రో డీలక్స్ బస్సులను హైదరాబాద్ అంతటా అధిక డిమాండ్ ఉన్న రూట్లలో న‌డిపించ‌నున్నారు. ఇక్కడ ఫ్రీక్వెన్సీని మెరుగుపరచడానికి బస్సులు 15-20 నిమిషాల వ్యవధిలో నడుస్తాయి. ప్రస్తుతం, ఈ RTC బస్సులు ఉప్పల్-మెహదీపట్నం, సికింద్రాబాద్-ECIL, కోఠి, అబ్దుల్లాపూర్‌మెట్‌లతో సహా ప్రధాన మార్గాలను కవర్ చేస్తాయి ఇవి నగర ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని అందించ‌నున్నాయి. మహిళా ప్రయాణికులు టికెట్ చెల్లించాల్సిందే.. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్‌లో క...
TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్

TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్

Telangana
TGSRTC Bus Hire Discount | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిజిఎస్‌ఆర్‌టిసి ) వివాహాలు, కుటుంబ వేడుకలు, పార్టీలు మొదలైన వాటి కోసం అద్దెకు తీసుకున్న లేదా బుక్ చేసుకునే బస్సులపై ప్రత్యేక 10 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు డిసెంబర్ 31 వరకు అద్దె బస్సులపై మాత్రమే వర్తిస్తుంది.గతంలో కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప యాత్ర‌ల‌, సమయంలో అద్దె లేదా కాంట్రాక్ట్ బస్సులకు ఆర్టీసీ రాయితీలు కల్పించింది . అయితే రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయి అధికారులు 10శాతం రాయితీ కల్పించాలని నిర్ణ‌యించిన‌ట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుభకార్యక్రమాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ రాయితీని అందించినట్లు TGSRTC తెలిపింది.ప్రైవేట్ వాహనాల కంటే చాలా తక్కువ ధరలకు కార్పొరేషన్ బస్సులను అద్దెకు ఇస్తోంది. ముందస్తుగా నగదు జమ చేయకుండా...
TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోలు

TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోలు

Telangana
Hyderabad | తెలంగాణ‌లో ప్ర‌జల డిమాండ్ కు త‌గిన‌ట్లుగా కొత్త బ‌స్సుల కొనుగోలు (TGSRTC New Buses) కు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. పెరిగిన ర‌వాణా అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ప్ర‌తిపాదికగా బ‌స్సుల కొనుగోలుపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని చెప్పారు. రాష్ట్ర స‌చివాల‌యంలో టీజీ ఆర్టీసీపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. మ‌హిళ‌లు మ‌హాల‌క్ష్మి ప‌థకాన్ని వినియోగించుకుంటున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతంగా అమ‌లవుతోంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేశార‌ని తెలిపారు. దీనిని బ‌ట్టి మ‌హిళా ప్ర‌యాణికుల‌కు రూ.2,840.71 కోట్లు ఆదా అయింద‌ని రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ‌ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్‌ తెలిపారు.టిజి ఆర్టీసీలో 7,29...
TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌

TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌

Andhrapradesh, Telangana
TGSRTC Discount | హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అవ‌స్థ‌లుప‌డుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ స్వ‌ల్ప ఊర‌ట క‌ల్పించింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌ (Hyderabad to Vijayawada buses )లో రాజధాని AC సూపర్ లగ్జరీ బస్సులతో స‌హా అన్నింటిలో ప్ర‌యాణించేవారికి 10 శాతం రాయితీని అందించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్‌ఆర్‌టీసీ ) నిర్ణయించింది.హైదరాబాద్-విజయవాడ మార్గంలో ముఖ్యంగా వారాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్థిక భారాన్ని తగ్గించాల‌నే ఉద్దేశంతో కొన్ని హైఎండ్ సర్వీసులపై రాయితీలు (TGSRTC Discount) కల్పించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రాయితీ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మార్గంలో వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలనుకుంటే, విజయవాడ వరకు టిక్కెట్‌పై 10 శ...
TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు

TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు

Telangana
New Electric Buses | రాష్ట్రంలో హరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు, కాలుష్య భూతాన్ని క‌ట్ట‌డి చేసే దిశ‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ముందుకు సాగుతోంది. తాజాగా 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కించాల‌ని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం, RTC కింద ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) మోడల్‌లో నడుస్తున్నాయి.1000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌లోనే నడిపే అవకాశం ఉంది. ఇతర ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అత్య‌ధిక ట్రాఫిక్ రూట్లలో న‌డవ‌నున్నాయి. హెచ్‌సియు, హయత్‌నగర్‌తో సహా డిపోలలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కొన్ని ఎలక్ట్రిక్, డీజిల్ బస్సులను డిమాండ్ ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నారు.మరోవైపు ఎంజీబీఎస్‌...
Charlapalli railway station | విమానాశ్ర‌యాన్ని త‌ల‌పించేలా.. చర్లపల్లి రైల్వేస్టేషన్.. కానీ ఇక్క‌డికి చేరుకునేదెలా?

Charlapalli railway station | విమానాశ్ర‌యాన్ని త‌ల‌పించేలా.. చర్లపల్లి రైల్వేస్టేషన్.. కానీ ఇక్క‌డికి చేరుకునేదెలా?

Telangana
Charlapalli railway station | హైదరాబాద్: అత్యుత్తమ విమానాశ్రయాలను త‌ల‌పించేలా రూ.430 కోట్లతో అభివృద్ధి చేసిన చ‌ర్లపల్లి రైల్వే స్టేషన్ దేశంలోని స‌క‌ల స‌దుపాయాల‌తో హైటెక్ హంగుల‌తో అల్ట్రామోడర్న్ ప్యాసింజర్ ఫెసిలిటీగా రెడీ అయింది. కొత్త స్టేషన్ వచ్చే నెలలో ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. అయితే ప్రయాణికులకు సులువుగా ఈ స్టేష‌న్ కు చేరుకోవ‌డానికి సమర్థవంతమైన కనెక్టివిటీని అందించే సౌక‌ర్యాలు ఇప్ప‌టివ‌ర‌కు పూర్తిచేయ‌లేదు.రాష్ట్ర ప్రభుత్వం చర్లపల్లి స్టేషన్‌కు వెళ్లేందుకు రెండు వైపులా రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. అయితే సమన్వయ లోపంతో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులు అర్ధంత‌రంగా నిలిచిపోయాయి. ఫలితంగా, ప్రయాణికులు ఈ స్టేష‌న్ కు చేరుకోవ‌డం క‌ష్టంగా మారింది. మ‌రోవైపు కొత్త స్టేషన్ వైపు ఉన్న వివిధ రోడ్లను ప‌లు కార‌ణాల ద్వారా ప్రారంభించ‌లేదు. ఇటీవల పూర్తయిన మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సి...
TGSRTC | రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ బస్సులలో ఇకపై సరికొత్త టెక్నాలజీ..!

TGSRTC | రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ బస్సులలో ఇకపై సరికొత్త టెక్నాలజీ..!

Telangana
AI-powered alert ADAS | హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఆధునిక‌ టెక్నాల‌జీ వైపు ముందుకుసాగుతోంది. ప్రమాదాలను నివారించేందుకు అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ఏడీఏఎస్‌) డివైజ్‌ను ఇన్ స్టాల్ చేయాల‌ని నిర్ణ‌యించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ఈ కాన్సెప్ట్‌ను తమ బస్సుల్లో పెద్ద ఎత్తున అమర్చాలని యోచిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 200 రాష్ట్ర రవాణా బస్సుల్లో ఏర్పాటు చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-పవర్డ్ అలర్ట్ సిస్టమ్ గత ఏడాదిలో హైవేలపై ప్రమాదాలను 40 శాతం వరకు తగ్గించడంలో సహాయపడింది.హైవేలపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ముందస్తుగా 2022 సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని మూడు జాతీయ రహదారులైన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-నాగ్‌పూర్‌లో ప్రయాణించే బస్సుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. మార్చి 2023, ఏప్రిల్ 2024 మ...
తెలంగాణ రోడ్ల‌పై కొత్త‌గా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ బ‌స్సులు.. ఇక మహిళలూ టికెట్‌ కొనాల్సిందే..

తెలంగాణ రోడ్ల‌పై కొత్త‌గా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ బ‌స్సులు.. ఇక మహిళలూ టికెట్‌ కొనాల్సిందే..

Telangana
TGSRTC Semi Deluxe Bus | తెలంగాణ‌ ఆర్టీసీలో కొత్తగా సెమీడీల‌క్స్‌, మెట్రో డీల‌క్స్ బ‌స్సులు రోడ్లెక్క‌నున్నాయి. పట్టణాలు, న‌గ‌రాల మధ్య సెమీ డీలక్స్‌ బస్సులు, నగరంలో మెట్రో డీలక్స్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే డిపోల‌కు కొన్ని బస్సులు వ‌చ్చాయి. వీటిని త్వరలో వాటిని ప్రారంభించన్నారు. మహాలక్ష్మి పథకం కార‌ణంగా   ఆర్టీసీ (TGSRTC) ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం క‌ల్పించ‌డంతో ఆయా బ‌స్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగినా కూడా ఆదాయం మాత్రం భారీగా ప‌డిపోయింది. దీంతో కావాల్సిన ఆదాయాన్ని స‌మ‌కూర్చుకునేందుకు కొత్త‌గా రెండు కేటగిరీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించ‌నుంది. మ‌హిళ‌లూ టికెట్ తీసుకోవాల్సిందే.. ప్రస్తుతం ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల‌కు మ‌హిళ‌లు టికెట్ లేకుండా ఫ్రీగా ప్ర‌యాణించ‌వ‌చ్చు. మిగ‌తా డీలక్స్, సూపర్‌ లగ్జ...
Free Bus For Woman | ఫ్రీ బస్సుల్లో మ‌హిళ‌ల లీల‌లు.. ఎంచక్కా పళ్లు తోముతూ.. ఎల్లిపాయ పొట్టు తీస్తూ.. (వీడియో)

Free Bus For Woman | ఫ్రీ బస్సుల్లో మ‌హిళ‌ల లీల‌లు.. ఎంచక్కా పళ్లు తోముతూ.. ఎల్లిపాయ పొట్టు తీస్తూ.. (వీడియో)

Viral
హైదరాబాద్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప‌థ‌కం ((Free Bus For Woman) ) .. చాలా మందికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా మారింది. బ‌స్సుల్లో మ‌హిళా ప్ర‌యాణికుల సంఖ్య భారీగా పెగిరిపోయింది. 100 శాతం కంటే ఎక్కువ‌ ఆక్యుపెన్సీతో టిజి ఆర్టీసీ బ‌స్సులు కిక్కిరిసిపోతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఉచిత బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న కొంద‌రు మ‌హిళ‌లు చేస్తున్న పిచ్చిప‌నులు ప్ర‌జ‌ల‌కు తీవ్ర అసౌక‌ర్యానికి గుర్తిచేస్తున్నాయి. సీటు కోసం మ‌హిళ‌లు కొట్టుకోవ‌డం త‌ర‌చూ చూస్తున్నాం. అసలే అరకొరగా ఉన్న బస్సుల్లో మహిళలే అధికంగా ప్రయాణిస్తుండటంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పండుగ వేళల్లో అయితే మ‌హిళ‌ల‌తోపాటు పురుషులు ప‌డుతున్న క‌ష్టాలు అన్నీఇన్నీ కావుFree Bus For Woman అయితే ఎలాగూ టికెట్‌ లేకుండా ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని కొద‌రు మహిళలు.. అవసరం ఉన్నా లేకున్నా బస్సులు...