Saturday, August 30Thank you for visiting

Tag: Telugu news

KCR | ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా? కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్ ..

KCR | ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా? కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్ ..

Telangana
KCR | కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొత్త‌గా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయ‌డంపై మాజీ సీఎం, బిఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల‌చంద్ర‌శేఖ‌ర్ రావు ఫైర్ అయ్యారు. ఇది ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నులు ఇవేనా అని ప్ర‌శ్నించారు. ఇది కాంగ్రెస్ మూర్ఖ‌త్వ‌మ‌ని కేసీఆర్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేప‌టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ‌మ‌వుతున్న‌ నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ (KCR) తీవ్ర అభ్యంత్రం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అంటూ ప్ర‌శ్నించారు. ప్రభుత్వం ముందుగా ప్ర‌జ‌ల‌ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల...
Earthquake in Telangana | తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం, ములుగు కేంద్రంగా ప్ర‌కంప‌ణ‌లు

Earthquake in Telangana | తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం, ములుగు కేంద్రంగా ప్ర‌కంప‌ణ‌లు

Auto, Telangana
Earthquake in Telangana | తెలుగు రాష్ట్రాల్లో బుధ‌వారం ఉద‌యం భూ ప్ర‌కంప‌ణ‌లు సంభ‌వించాయి. దీంతో ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) ప్రకారం బుధవారం ఉదయం తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. NCS ప్రకారం ఉదయం 7:27 గంటలకు ప్రకంపనలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో NCS పోస్ట్ చేసిన వివ‌రాల ప్ర‌కారం.. "EQ ఆఫ్ M: 5.3, ఆన్: 04/12/2024 07:27:02 IST, చివరి: 18.44 N, పొడవు: 80.24 E, లోతు: 40 కి.మీ, స్థానం: ములుగు, తెలంగాణ.ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, చర్ల, చింతకాని, నాగులవంచ, మణుగూరు, భద్రాచ...
Bank Holidays December 2024 : డిసెంబరులో 17 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు!

Bank Holidays December 2024 : డిసెంబరులో 17 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు!

National
Bank Holidays December 2024 : డిసెంబర్ 2024 లో ఏకంగా ప‌లు రాష్ట్రాల్లో పండుగలు, ప్రాంతీయ, జాతీయ సెలవుల కార‌ణంగా 17 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు రానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో మొత్తం 2 శనివారాలు, 5 ఆదివారం సెలవులు కూడా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ లో బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. వీటిలో రాష్ట్ర సెలవులు, జాతీయ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాల్లో సాధారణంగా బ్యాంకులు మూసివుంటాయి. కాబట్టి, మీ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను ప్లాన్ చేయడానికి ముందు, సెలవుల జాబితాను చెక్ చేసుకోండి.డిసెంబర్ 2024లో బ్యాంక్ సెలవులు: డిసెంబర్‌లో బ్యాంక్ సెలవులు ప్రాంతీయ సెలవులు కాకుండా, అన్ని బ్యాంకులు ఆదివారం, రెండ‌వ, నాల్గవ శనివారాలు RBI ఆదేశాల ప్రకారం మూసివేస్తారు. RBI వెబ్‌సైట్ ప్రకారం, అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారం ప్రభుత...
రైతులకు గుడ్ న్యూస్..  మరో 3 లక్షల మందికి రుణమాఫీ… 30వ తేదీన ఖాతాల్లోకి డబ్బులు

రైతులకు గుడ్ న్యూస్.. మరో 3 లక్షల మందికి రుణమాఫీ… 30వ తేదీన ఖాతాల్లోకి డబ్బులు

Telangana
Rythu Runa Mafi : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే.. అయితే పలు సాంకేతిక కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో ప్రభుత్వం.. రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించింది. ఇక త్వరలోనే వీరికి రుణమాఫీ స్కీమ్ ను వర్తింపజేయనుంది.రుణమాఫీ కాని రైతుల విషయమై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) కీలక ప్రకటన చేశారు. బుధవారం షాద్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పలు కారణాలతో రుణమాఫీ జరగని 3 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని  మంత్రి తుమ్మల పేర్కొన్నారు. నవంబర్ 30న మహబూబ్ నగర్ లో జరగనున్న రైతు పండగ సందర్భంగా డబ్బులు జమ చేయనున్నామని  ప్రకటన చేశారు.కాగా రైతు రుణమాఫీ (Rythu Runa Mafi ) కి రూ.18 వేల కోట్లు ఖర్చు చేశామని.. రాష్ట్రంలోని మిగతా రైతులకు కూడా అందజేస...
HYD Metro | రెండో దశ మెట్రో ప్రాజెక్టు డీపీఅర్ సిద్ధం!

HYD Metro | రెండో దశ మెట్రో ప్రాజెక్టు డీపీఅర్ సిద్ధం!

Telangana
HYD Metro | హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశ పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన ప‌నుల‌ను ఆరు కారిడార్లుగా విభజించగా.. ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు రెడీ అయ్యాయ‌ని మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ - ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ విస్తరణకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, దేశంలోనే మూడో అతి పెద్ద మెట్రో నెట్ వ‌ర్క్ గా హైదరాబాద్‌ మెట్రో అవతరిస్తుందని ఆయ‌న తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్‌ మెట్రో రైలు స‌క్సెస్ ఫుల్‌గా నడుస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంద‌ని, ప్రపంచంలోనే ఏడేళ్లు పూర్తి చేసుకున్న అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్‌గా అరుదైన ఘ‌న‌త‌ను సంపాదించుకుందని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.ముం...
Jharkhand Exit poll | ఎన్‌డీఏకే జైకొట్టిన జార్ఖండ్‌.. సర్వే ఫలితాల వివరాలు ఇవీ..

Jharkhand Exit poll | ఎన్‌డీఏకే జైకొట్టిన జార్ఖండ్‌.. సర్వే ఫలితాల వివరాలు ఇవీ..

Elections
Jharkhand Exit poll | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గెలుస్తుందని పలు ఎగ్జిట్‌పోల్ స‌ర్వేలు అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా అధికార కూటమికి భారీ విజయం సాధిస్తుంద‌ని అంచనా వేసింది. చాలా ఎగ్జిట్ పోల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ జార్ఖండ్లో అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు 41. పీపుల్స్ పల్స్NDA: 44-53 ఇండియా : 25-37 ఇతరులు: 5-9దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ఎన్డీఏ: 37-40 ఇండియా: 36-39 ఇతరులు: 0-2చాణక్య స్ట్రాట‌జీస్ స‌ర్వేఎన్డీఏ: 45-50 ఇండియా: 35-38 OTH: 3-5యాక్సిస్ మై ఇండియా అంచనా:-NDA: 25 ఇండియా కూటమి: 53 ఇతరులు: 3మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్: NDA - 42-47 భారతదేశం - 25-30 ఇతరులు - 1-4 PMARQ ఎగ...
Maharashtra Exit Poll : మహారాష్ట్రలో మళ్లీ మహాయుతికే పట్టం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..

Maharashtra Exit Poll : మహారాష్ట్రలో మళ్లీ మహాయుతికే పట్టం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..

Elections
Maharashtra Exit Poll : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 137-157 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 126-146 సీట్లు రావచ్చు. ఇతరులు 2-8 సీట్లు సాధించ‌వ‌చ్చ‌ని అంచ‌నావేసింది.MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహాయుతి మరోసారి మెజారిటీతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 150-170 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 110-130 సీట్లు రావచ్చు. ఇతరులకు 8-10 సీట్లు రావచ్చు. పీపుల్స్ పల్స్:మహాయుతి (BJP+): 182 మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్+): 97 ఇతరులు: 9 మెట్రిజ్:మహాయుతి (BJP+): 150-170 ...
TG Group 4 Results | గ్రూప్-4 తుది ఫలితాల విడుదల

TG Group 4 Results | గ్రూప్-4 తుది ఫలితాల విడుదల

Career
TG Group 4 Results |  గ్రూప్-4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్- 4కు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్‎ను నవంబర్ 14న గురువారం సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రిలీజ్ చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక https://www.tspsc.gov.in/ వెబ్‌ సైట్‌‎ను సంప్రదించాలని.. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది.8,180 గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 2023 జూలై 1న గ్రూప్ 4 పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించింది. రిటన్ టెస్ట్‎లో క్వాలిఫై అభ్యర్థులను ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్‎కు ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 8,084 మంది అభ్యర్థులను గ్రూప్ 4 ఉద్యోగానికి టీజీప...
Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా

Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా

Elections
Maharashtra Elections : నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA) గెలిస్తే ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్‌కు ‘ఏటీఎం’గా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) విమ‌ర్శించారు. రాష్ట్ర వనరులను ఉపయోగించి మహారాష్ట్ర నుంచి డబ్బు వసూలు చేస్తారు మీ డబ్బును ఢిల్లీకి పంపుతారు" అని బుధ‌వారం జల్గావ్ జిల్లాలోని చాలీస్‌గావ్‌లో జరిగిన ర్యాలీలో అమిత్‌ షా అన్నారు.బిజెపి (BJP)నేతృత్వంలోని మహాయ‌తి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంద‌ని, జార్ఖండ్‌లోనూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన అన్నారు మహారాష్ట్రలో మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందుకే కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అమిత్ షా అన్నారు.పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అదే రాజ్యాంగం న‌కిలీ కాపీని పట్టుకొని వ‌చ్చార‌ని, కొందరు జర్నలిస్...
Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

Andhrapradesh, Telangana
బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట ఈ వాయుగుండం కేంద్రీకృతమై  ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు ,తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. నేడు రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బ...