Friday, January 23Thank you for visiting

Tag: Telugu news

నిండైన చీరకట్టుతో ఈ మహిళ చేసిన డ్యాన్స్ అదుర్స్..

నిండైన చీరకట్టుతో ఈ మహిళ చేసిన డ్యాన్స్ అదుర్స్..

Trending News
సాధారణ ప్రజలు తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా చక్కని వేదికగా నిలుస్తోంది. చాలా మంది తమలో మరుగుపడిన నైపుణ్యాలను సోషల్ మీడియాలో చేయడం ద్వారా అవి క్షణాల్లోనే వైరల్ అయి ఊహించని విధంగా ఫేమ్ అవుతున్నారు. అయితే తాజాగా ఓ తెలుగు మహిళ చేసిన అద్భుతమైన డాన్స్, మ్యాజిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.@koteswari_kannan_official పేరుతో 49,000 మందికి పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్న మహిళ తన Instagram ఖాతాలో వీడియోను పోస్ట్ చేసింది. నిండుగా చీర ధరించి మూడు చిన్న బంతులను గాలిలో ఎగురువేస్తూ ఒక రింగ్ తో హులా హూప్ చేస్తున్న వీడియో చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీనిపై పలువురు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. "ఆమె ప్రతిభకు తనదైన రీతిలో నిర్వచనం.. ట్రెండింగ్ పాటలకు ట్రెండింగ్‌ను సృష్టిస్తోంది" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. "ఒక పుస్తకాన్ని దాని కవర్‌ని బట్టి అంచనా వేయవద్దు" అని మర...
పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

Crime, Local
Warangal : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసివున్న ఇళ్లో  చోరీలకు పాల్పడుతున్న దొంగను సీీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దొంగ నుంచి పోలీసులు రూ.10లక్షల 9 వేల విలువ గల 163 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడిండిచారు. సూర్యపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సన్నిది ఆంజనేయులు అలియాస్ అంజి చదువుకునే రోజుల్లోనే చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కగా జువైనల్ హోంకు తరలించారు. కొద్ది రోజుల అనంతరం నిందితుడు మరో మారు మిర్యాలగూడ, ఖమ్మం, హుజూర్ నగర్, గద్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో నిందితుడు ఆంజనేయులును పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిలో జైలు విడుదలయిన తర...
పదేళ్ల జైలు శిక్ష తర్వాత కూడా ఆ రేపిస్టు.. మళ్లీ మైనర్‌పై లైంగిక దాడి

పదేళ్ల జైలు శిక్ష తర్వాత కూడా ఆ రేపిస్టు.. మళ్లీ మైనర్‌పై లైంగిక దాడి

Crime
ఇలాంటి కీచకులనేంచేయాలి?మధ్యప్రదేశ్‌లో అత్యాచారం కేసులో పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఇలాంటి నేరానికి పాల్పడ్డాడు. సాత్నాలో 5 ఏళ్ల దళిత బాలికపై నిందితులు అత్యాచారానికి తెగబడ్డాడు. బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టంతో సహా సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. 10 సంవత్సరాల కారాగార శిక్ష నిందితుల్లో ఎలాంటి మార్పు రాలేదు.. ఏడాదిన్నర క్రితం జైలు నుంచి బయటకు వచ్చి మరో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాధితురాలు కనిపించకుండా పోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అమ్మమ్మ ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. కొంత దూరంలో రక్తసిక్తమైన స్థితిలో బాలిక నిపించింది. ఏం జరిగింది నిందితుడు రాకేష్ వర్మ అలియాస్ రక్కు ఆమెకు మిఠాయిలు తినిపిస్తానని మాయమాటలతో ప్రలోభపెట్టాడు. బాలి...
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆటో ఢీకొని ఆరుగురు మృతి

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆటో ఢీకొని ఆరుగురు మృతి

Crime
Warangal: వరంగల్‌ జిల్లాలో బుధవారం  తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో  ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వరంగల్‌ నుంచి ఆటో తొర్రూరు వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా.. అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.. అస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన జరిగిన యాక్సిడెంట్ జరిగిన చోటుకు చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు తేనె విక్రయించే కూలీలని  తెలిసింది. డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ  ఘటనపై కేసు నమోదు చే...
బైక్ ల చోరీల్లో ఆరితేరారు.. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు..

బైక్ ల చోరీల్లో ఆరితేరారు.. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు..

National
ఇద్దరు బైక్ దొంగలను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ (warangal police commissionerate) పరిధిలో ద్విచక్ర వాహనాలు, తాళం వేసి ఉన్న షటర్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్, మట్వాడా, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు లక్షల రూపాయల విలువైన తొమ్మిది ద్విచక్రవాహనాలు, రూ1.60లక్షల నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను  క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడించారు. మాట్వాడా పోలీసులు అరెస్టు చేసిన వరంగల్ పోచమ్మమైదాన్ కు చెందిన బరిపట్ల  సాయి( 30) మద్యంతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో వరంగల్ పోలీస్ కమికషనరప్ పాటు మహబూబాబాద్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిపై గతంలో...
ఎన్నికల నియమాలపై అవగాహన ఉండాలి 

ఎన్నికల నియమాలపై అవగాహన ఉండాలి 

Local
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య వరంగల్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన నోడల్‌ అధికారులు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన ఉండాలని వరంగల్ జిల్లా పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హా లో రిటర్నింగ్ అధికారులు, నోడల్‌ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న సాధారణ ఎన్నికలకు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్ బాషా, వర్ధన్నపేటకు సంబంధించి అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, నర్సంపేట నియోజకవర్గానికి ఆర్డీవో క్రిష్ణవేణి రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ బాధ్యతల నిర్వహణ కోసం నియమించిన నోడల్‌ అధికారులకు వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, విధి విధానాలపై కలెక్టర్ వివిధ అంశాల వారీగా వివరించారు. జిల్లాలో ఎన్నికల విధుల ని...
రేపటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన

రేపటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన

Local
హనుమకొండ : భారత స్వతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హన్మకొండ జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మా గాంధీ చలనచిత్రాన్ని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. 2022లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని నింపేందుకు గాంధీ చిత్రాన్ని (Gandhi movie) ప్రదర్శించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకెళ్లి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఉచితంగా సినిమా ప్రదర్శనను నిర్వహించనున్నారు. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా చిత్రాన్ని చూసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు14వ తేదీ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని 15వ తేదీ ఇండిపెండెన్స్ డే, 20వ తేదీ ఆదివారం కారణంగా చిత్ర ప్రదర్శన ఉండ...
International Left-Handers Day 2023 : ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ’

International Left-Handers Day 2023 : ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ’

Special Stories
International Left-Handers Day 2023: ప్రతీ విషయంలో మంచి, చెడు ఉంటాయి. మంచినీ, చెడునీ.. పవిత్రతనూ, అపవిత్రతనూ ఈ కుడి, ఎడమలతోనే పోల్చితే కుడి వైపు మంచిదని, ఎడమవైపు చెడుదని అంటుంటారు. మొదటిసారి ఇంట్లో అడుపెట్టాలనుకుంటే కుడికాలే పెట్టమంటారు. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కుడి చేతినే అందిస్తుంటాం.. సాధారణ వ్యక్తులు ఏపని చేసినా కుడిచేయితోనే చేస్తుంటారు. కానీ వీరికి భిన్నంగా ఎడమ చేతివాటమున్న వ్యక్తులు చేసే పనులు చాలా విచిత్రంగా, ఇన్ ట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎన్నో సవాళ్లు.. ఎడమ చేతివాటం ఉన్నవారు (Left-Handers) నిత్యజీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుంది. శుభకార్యాల్లో పాల్గొన్నపుడు వీరు ఎడమ చేతిలో అన్ని పనులు చేస్తున్నపుడు ఎదుటివారి నుంచి కామెంట్లు వస్తుంటాయి. ఎడమచేతితో షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఎడమ చేతితో భోజనం తింటున్నా, ఎదుటివారికి వడ్డించినా కొంతమంది వీరిని సరిగ్గా అర్థం చేసుకోలేరు. చివరికి కం...
నిజాయితీగా వ్యాపారం చేసుకోండి లేదంటే చర్యలు తప్పవు

నిజాయితీగా వ్యాపారం చేసుకోండి లేదంటే చర్యలు తప్పవు

Local
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ. రంగనాథ్ హన్మకొండ: ‘నిజాయితీగా వ్యాపారం చేయండి లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్.. పాత ఇనుప సామాను కొనుగోలు వ్యాపారస్తులకు, ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యానికి సూచించారు.వరంగల్, హన్మొకండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలోని పాత సామగ్రి కొనుగోలు చేసే వ్యాపారులతో పాటు ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకులతో గురువారం హన్మకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో పోలీసు కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా నగరంలో చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కలిగే నష్టంతో పాటు, తద్వారా దేశానికి ఏవిధంగా నష్టం వాటిల్లుతుందో పోలీస్ కమిషనర్ రంగనాథ్ వ్యాపారస్తులకు వివరించి చెప్పారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా చోరీకి గురైన వాహనాల కొనుగోలు చేయడం సరికాదన్నారు. నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ము...
Honey Adulteration Test “తేనె స్వచ్ఛమైనదా లేదా కల్తీనా అని ఎలా కనిపెట్టాలి?”

Honey Adulteration Test “తేనె స్వచ్ఛమైనదా లేదా కల్తీనా అని ఎలా కనిపెట్టాలి?”

Life Style
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) పరిశోధనలో కొన్ని ప్రధాన బ్రాండ్‌లు విక్రయించే తేనెలో కల్తీ ఉందని తేలింది. Centre for Science and Environment ప్రకారం, ఈ బ్రాండ్‌ లు తయారు చేసే తేనెలో చైనా నుండి దిగుమతి చేసుకున్న చక్కెర సిరప్‌ కలుపుతున్నట్లు తేలింది.స్వచ్ఛమైన తేనె.. కొవ్వులు కొలెస్ట్రాల్ లేకుండా అనేక పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అయితే కల్తీ తేనె మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఊబకాయం పెరిగేలా చేస్తుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది, పరిశోధనలో తేలింది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాకరం. ఈ నేపథ్యంలో తేనె స్వచ్ఛత పరీక్షా పద్ధతుల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.తేనెను కొనుగోలు చేస్తే, అందులో చక్కెరతో కల్తీ ఉందో లేదో ఎలా తనిఖీ చేయవచ్చు? ఫుడ్ సేఫ్టీ అ...