
7 ఏళ్ల క్రితం గుడిలో చోరీ అయిన మీ బూట్లను గుర్తించడానికి స్టేషన్ కు రండి.. ఫిర్యాదుదారుడికి పోలీసుల ఫోన్
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఒక అసాధారణ సంఘటన జరిగింది. ఏడేళ్ల క్రితం గుడి బయట చోరీకి గురయిన బూట్ల జతను గుర్తించడానికి పోలీసులు ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసి పిలిచారు.
ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన మహేంద్ర కుమార్ దూబే దాదాపు ఏడేళ్ల క్రితం రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలోని సన్వారియా సేఠ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో అతని బూట్లు చోరీకి గురయ్యాయి. దీంతో జనవరి 14, 2017న మన్సఫియా పోలీస్ స్టేషన్ లో అతను లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని అలాగే వదిలేశారు.అయితే, కొద్ది రోజుల క్రితం, మహేంద్ర దూబేకి పోలీసు స్టేషన్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఆలయంలో చోరీ అయిన కొన్ని జతల బూట్లు స్వాధీనం చేసుకున్నట్లు కానిస్టేబుల్ ఖుబ్‌చంద్ అతనికి కాల్ చేసి చెప్పాడు. వారిలో తన బూట్లను గుర్తించాలని కోరారు.
ఈ కాల్ వెనుక కారణం ఏమిటంట...