Thursday, November 14Latest Telugu News
Shadow

Tag: Telugu news

TG Group 4 Results | గ్రూప్-4 తుది ఫలితాల విడుదల

TG Group 4 Results | గ్రూప్-4 తుది ఫలితాల విడుదల

Career
TG Group 4 Results |  గ్రూప్-4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్- 4కు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్‎ను నవంబర్ 14న గురువారం సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రిలీజ్ చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక https://www.tspsc.gov.in/ వెబ్‌ సైట్‌‎ను సంప్రదించాలని.. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది.8,180 గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 2023 జూలై 1న గ్రూప్ 4 పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించింది. రిటన్ టెస్ట్‎లో క్వాలిఫై అభ్యర్థులను ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్‎కు ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 8,084 మంది అభ్యర్థులను గ్రూప్ 4 ఉద్యోగానికి టీజీప...
Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా

Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా

Elections
Maharashtra Elections : నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA) గెలిస్తే ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్‌కు ‘ఏటీఎం’గా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) విమ‌ర్శించారు. రాష్ట్ర వనరులను ఉపయోగించి మహారాష్ట్ర నుంచి డబ్బు వసూలు చేస్తారు మీ డబ్బును ఢిల్లీకి పంపుతారు" అని బుధ‌వారం జల్గావ్ జిల్లాలోని చాలీస్‌గావ్‌లో జరిగిన ర్యాలీలో అమిత్‌ షా అన్నారు.బిజెపి (BJP)నేతృత్వంలోని మహాయ‌తి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంద‌ని, జార్ఖండ్‌లోనూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన అన్నారు మహారాష్ట్రలో మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందుకే కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అమిత్ షా అన్నారు.పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అదే రాజ్యాంగం న‌కిలీ కాపీని పట్టుకొని వ‌చ్చార‌ని, కొందరు జర్నలిస్...
Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

Andhrapradesh, Telangana
బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట ఈ వాయుగుండం కేంద్రీకృతమై  ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు ,తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. నేడు రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బ...
Flexible Display | LG అద్భుత సృష్టి.. టవల్ లా మెలితిరిగే  డిస్ల్పే ..

Flexible Display | LG అద్భుత సృష్టి.. టవల్ లా మెలితిరిగే డిస్ల్పే ..

Technology
Flexible Display | ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెక్ దిగ్గజం LG  ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే టెక్నాలజీని రూపొందించింది. ఈ డిస్ప్లేను  మీరు టవల్ లాగా మెలిపెట్టవచ్చు. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఈ సాంకేతికత తొలి సంస్కరణలను ఇప్పటికే ప్రదర్శించింది. ఇది స్క్రీన్‌ను వెడల్పుగా అలాగే పొడవుగా సాగదీయవచ్చు. ఇప్పటికీ ప్రోటోటైప్ దశలోనే ఉన్నప్పటికీ, ఈ ఆవిష్కరణ ఖచ్చితంగా ఫోల్డబుల్ డిస్‌ప్లే మార్కెట్‌లో అగ్రగామి నిలవనుంది.LG ప్రకారం, డిస్ప్లే దాని అసలు పరిమాణంలో 50 శాతం వరకు ఇమేజ్ నాణ్యతను రాజీ పడకుండా విస్తరించగలదు. తాజా ప్రోటోటైప్ 12-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది అంగుళానికి 100 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కొనసాగిస్తూ 18 అంగుళాల వరకు విస్తరించగలదు. LG గతంలో 2022లో స్ట్రెచబుల్ డిస్‌ప్లే టెక్నాలజీ కి సంబంధించి విభిన్న నమూనాను ఆవిష్కరించింది.ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే విలక్షణమైనది ఎల్జ...
AP Budget 2024 | ఏపీ బడ్జెట్..  శాఖల వారీగా కేటాయింపులు ఇవి :

AP Budget 2024 | ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇవి :

Andhrapradesh
Andhra Pradesh Budget 2024-25: ఏపీ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. సోమవారం ఉదయం ప్రారంభమైందిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఇదీ..వార్షిక బడ్జెట్ : రూ. 2.94. లక్షల కోట్లు వ్యవసాయ బడ్జెట్ : రూ. 43,402.33 కోట్లు రెవెన్యూ వ్యయం అంచనా : రూ.2.34 లక్షల కోట్లు. మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం. జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం.శాఖల వారీగా పూర్తి కేటాయింపులివే..రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్. రూ. 4,3...
JK Special Status Resolution | జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానంపై ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న కామెంట్స్‌..

JK Special Status Resolution | జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానంపై ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న కామెంట్స్‌..

Elections
PM Modi On Article 370  : జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టికల్ 370 (JK Special Status Resolution) పున‌రుద్ధరిచాలంటూ జమ్మూ కాశ్మీర్‌లోని ఎన్‌సి నేతృత్వంలోని అధికార‌ కూటమి తీర్మానం చేయ‌డాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తప్పుబట్టారు. ఇది కాశ్మీర్‌పై కుట్ర అని, ఆర్టికల్ 370 ఎప్పటికీ పునరుద్ధరించ‌లేర‌ని మ‌రోమారు మోదీ స్ప‌ష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నిక‌ల నేప‌థ్యం (Maharastra Elections) లో ధూలేలో జరిగిన ర్యాలీలో ప్ర‌ధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ, “జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్, ఇండి కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించిన వెంటనే, కశ్మీర్‌పై కుట్రలు ప్రారంభించాయి. రెండు రోజుల క్రితం, J&K శాసనసభలో. వారు ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించార‌ని తెలిపారు.జ‌మ్ముక‌శ్మీర్ లోని అధికార కూటమిలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ఇండియా కూటమిలోని కొన్ని ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. ఆ...
New Tata Nano | టాటా నానో మళ్లీ వస్తుందా? టాటా మోటార్స్ కొత్త నానో కారులో ఏయే ఫీచర్లు ఉంటాయో తెలుసా..?

New Tata Nano | టాటా నానో మళ్లీ వస్తుందా? టాటా మోటార్స్ కొత్త నానో కారులో ఏయే ఫీచర్లు ఉంటాయో తెలుసా..?

Automobile
New Tata Nano | రతన్ టాటాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ టాటా నానోను పునరుద్ధరించాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ నానో కారును భారత మార్కెట్లోకి మళ్లీ పరిచయం చేయనుంది. ఈ సామాన్యుడి కారు ఆధునిక అప్‌డేట్‌లు, కొత్త డిజైన్, మెరుగైన పనితీరుతో తిరిగి వస్తుంది.నివేదికలను బట్టి  టాటా నానో కాంపాక్ట్ డిజైన్ పునర్నిర్మించి.. ఆధునిక హంగులతో వస్తుందని తెలుస్తోంది. సిటీ డ్రైవింగ్ కోసం చిన్న కొలతలను కొనసాగిస్తూనే నానో ఇప్పుడు అధునాతన హెడ్‌లైట్ డిజైన్, రిఫ్రెష్ బాడీ ఆకృతులతో వస్తుంది. కారు తాజా డిజైన్ కొత్త, పాత తరం వారిని ఆకర్షించేలా  ఉండనుంది. అధిక మైలేజీ ఇచ్చేలా ఇంజిన్ కొత్త టాటా నానోలో అప్‌గ్రేడ్ చేసిన 624సీసీ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఇది ఇంధన సామర్థ్యాన్నిపెంచుతూ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ కారు 30 kmpl వరకు మైలేజీని ఇస్తుంద...
Sunil Sharma | జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ఎంపికైన బీజేపీ ప్రతిపక్ష నేత.. సునీల్ శర్మ ఎవరు?

Sunil Sharma | జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ఎంపికైన బీజేపీ ప్రతిపక్ష నేత.. సునీల్ శర్మ ఎవరు?

Elections
Jammu And Kashmir News | జమ్మూ కాశ్మీర్ బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా మాజీ మంత్రి సునీల్ శర్మ (Sunil Sharma ) ఆదివారం ఎన్నికయ్యారు జమ్మూ కాశ్మీర్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుని పాత్రను స్వీకరించడానికి ఆయ‌న‌ సిద్ధమ‌య్యారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఇటీవ‌ల‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 29 సీట్లు సాధించింది. 2015లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. అది జూన్ 2018 వరకు కొనసాగింది.సునీల్ శర్మ ఎన్నికతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన బిజెపి, జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 47 ఏళ్ల శర్మ.. కేంద్ర పాలిత ప్రాంతంలో 2022 డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత కొత్తగా సృష్టించబడిన నియోజకవర్గమైన పెద్దర్ నాగసేని నుంచి స్వల్ప తేడాతో గెలుపొంది, అసెంబ్లీకి రెండవసారి ఎన్నికయ్యార...
New Energy Policy in Telangana | రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ

New Energy Policy in Telangana | రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ

Telangana
New Energy Policy in Telangana |  తెలంగాణలో త్వరలో నూతన ఎనర్జీ పాలసీని తీసుకు వొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విద్యుత్ రంగంలో మేధావులు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti vikramarka)  పలు కీలక విషయాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రూ.35 వేల కోట్లతో చేపట్టిన వైటీపీఎస్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు సందర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కు రామగుండం నుంచి సరఫరా అయ్యే బొగ్గు గూడ్స్ వ్యాగిన్ కు జెండా ఊపి మంత్రులు ప్రారంభించారు. ప్లాంట్ ను సందర్శించిన మంత్రులు పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ ను మంత్రులు ఈ సందర్భంగా ప్రారంభించారు.ఇప్పటికే రెండో యూనిట్‌ను సెప్టెంబర్ 11న...
Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌

Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌

Telangana
Indiramma Housing Scheme | సొంతింటి కోసం ఎదురుచూస్తున్న‌ నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. మ‌రికొద్ది రోజుట్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ 15 రోజుల్లో గ్రామ క‌మిటీల ద్వారా ల‌బ్ధిదారుల‌ ఎంపిక పూర్తి చేయ‌నున్నారు. గ్రామాల్లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే తుది నిర్ణ‌య‌మ‌ని, ఇండ్లు కూడా మ‌హిళ‌ల పేరిటే మంజూరు చేస్తామ‌ని గృహ‌నిర్మాణ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి (Punguleti Srinivas Reddy) తెలిపారు. మ‌రో ముఖ్య విష‌య‌మేమిటంటే ఈసారి ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే చాన్స్ క‌ల్పిస్తున్నారు. రాజ‌కీయ జోక్యం లేకుండా నిరుపేద‌లకు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్ర‌త్యేక యాప్ దే కీల‌క‌పాత్ర‌, అందుకే ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ని వివ‌రిచారు. ఆధార్‌తో స‌హా అన్నివివరాలు కొత్త‌గా తీసుకొస్తున్న‌ యాప్ లో పొందుప‌రుస్తారు. ఎలాంటి డిజైన్లు లేవు.. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ...