Sunday, December 22Thank you for visiting
Shadow

Tag: telangana news

తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం..  మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు

తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు

Crime, Telangana
 తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.  మార్చురీలో భద్రపరిచిన   ఓ వ్యక్తి మృతదేహంలోని భాగాలను ఎలుకలు కొరికివేశాయి. వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్‌ (38) కుటుంబంతో సహా 2016వ సంవత్సరంలో భువనగిరికి వలస వచ్చాడు. రవికుమార్‌కు వివాహం జరుగగా.. వారికి ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలానికి రవికుమార్‌ భార్య మృతి చెందింది. కొన్నాళ్లకు రవి రెండో వివాహం చేసుకోగా వీరికి కుమారుడు జన్మించాడు. అయితేతే రెండో భార్య ఏడాది క్రితం రవికుమార్‌ను వదిలి వెళ్లిపోయింది. దీంతో రవికుమార్‌ తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ప్రగతినగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రవికుమార్‌ క్రమంగా మద్యాన...
రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

Telangana
52 వంతెనలు ధ్వంసం.. నేలకూలిన  5,557 విద్యుత్ స్తంభాలు పంటనష్టం, పరిహారంపై సోమవారం మంత్రి వర్గ సమావేశంహైదరాబాద్ : తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 52 వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో వివరాలు పేర్కొన్నారు.వర్షాలు, వరద నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించగా, 16 లక్షల ఎకరాల్లో వేసిన వరి, పత్తి తదితర పంటలు ముంపునకు గురయ్యాయని ప్రాథమికంగా అంచనా వేశారు.30,000 ఎకరాల్లో కూరగాయల పంటలు కొట్టుకుపోయాయని, గ్రామాల్లో 700 కిలోమీటర్లకు పైగా పంచాయతీ రోడ్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 100 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, పట్టణాలు, నగరాల్లో 23,000 ఇళ్లు పూర్తిగా లేదా ...
వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు

వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు

Telangana
రిజర్వాయర్లలో గతేడాది కంటే భారీగా తగ్గిన నీటిమట్టాలు వర్షాల కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. సాగు విస్తీర్ణం 2022తో పోలిస్తే అన్ని పంటల సాగు తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.జూన్-సెప్టెంబర్ కాలాన్ని ఖరీఫ్ సీజన్‌గా పరిగణిస్తారు, సాధారణంగా రుతుపవనాలు వచ్చే జూన్ మొదటి వారంలో నాట్లు వేగవంతమవుతాయి. కానీ ఈ సంవత్సరం అలా జరగలేదు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 10 శాతం, మొక్కజొన్న 4 శాతం, పత్తి 7 శాతం తగ్గినట్లు వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.సుదీర్ఘ వేసవి కారణంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా తగ్గిపోయాయి. అలాగే సాగుబడికోసం సాగునీటి ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం నీటిని అందించలేకపోయింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు నమోదవుతున్నందున, మిషన్ భగీరథ ద్వారా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంపైనే దృష్టి సా...
ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..

ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..

Telangana
కమ్ముకుంటున్న కరువు భయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ BRSలో కలవరంహైదరాబాద్ : ఎన్నికల సంవత్సరంలో తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడడం అధికార బీఆర్‌ఎస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. నీటిపారుదల, తాగునీరు, పశుగ్రాసంపై కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోసే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.2014 నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున కరువు పరిస్థితులు రాలేదు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి ఏర్పడితే, BRS ప్రభుత్వం అనావృష్టిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అవుతుంది. వెంటనే వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని నాయకత్వం ఆశాభావంతో ఉంది. 2015 జూన్ జులైలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నా ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలు కొంతమేర నష్టాన్ని పూరించాయని గుర్తుచేశారు.రాష్ట్ర జనా...
పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే న్యూస్

పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే న్యూస్

Telangana
ఇకపై ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డే.... వివరాలు ఇవీ.. Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల(Telangana Schools)కు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా.. ముందుగా ఊహిచినట్లే.. జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి వర్కింగ్ డేగా నిర్ణయించింది. ఇక నుంచి తెలంగాణలో పాఠశాల పిల్లలకు ప్రతి నెలలో నాలుగవ శనివారం నో బ్యాగ్‌ డే అని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు అంటే ఆరోజు పిల్లలకు పుస్తకాల నుంచి విముక్తి కలుగుతుంది. రోజంతా ఆటపాటలు ఉత్సాహంగా గడపనున్నారు. మరోవైపు వారానికి 3 నుంచి 5 పీరియడ్లు ఆటలను తప్పనిసరి చేశారు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు పుస్తకాలు చదివించడంతోపాటు 5 నిమిషాల పాటు పిల్లలతో యోగా, ధ్యానం చేయించాలని నిర్ణయించారు. ఇక పదో తరగతి సిలబస...