Indiramma Housing Scheme | ఇండ్లు లేని పేదలకు శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం..
Telangana Budget | తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ఇండ్లు లేని నిరుపేదలకు తీపి కబురు చెప్పింది. నిరుపేదలకు గూడు సమకూర్చడమే తమ ప్రభుత్వ కర్తవ్యమని బడ్జెట్ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో పేదలను ముంచిందని విమర్శించారు. నిరుపేదలకు ఎన్నో ఆశలు కల్పించి.. ఇళ్లు కేటాయించలేదని ఆరోపించారు. అయితే పేద ప్రజల సొంతింటి కళను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని (Indiramma Housing Scheme) ప్రారంభించామని చెప్పారు. పేద ప్రజలు ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల సాయం అందించనున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల 50 వేల గృహాల నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగ...