Ratan Tata | దివికేగిన వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా కన్నమూత
Ratan Tata | టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్, భారతదేశపు అత్యంత గౌరవనీయమైన వ్యాపారవేత్తలలో ఒకరైన రతన్ టాటా బుధవారం (అక్టోబర్ 9) 86 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు.
డిసెంబర్ 28, 1937న జన్మించిన రతన్ నావల్ టాటా 1991 నుంచి 2012 వరకు భారతదేశంలోని అతిపెద్ద, విభిన్న వ్యాపార విభాగాలు కలిగిన టాటా గ్రూప్‌కు పగ్గాలు చేపట్టారు. ఆయన అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. టాటా ఛారిటబుల్ ట్రస్ట్‌లకు సైతం రతన్ టాటా నాయకత్వం వహించారు. టాటా గ్రూప్ దాతృత్వ కార్యకలాపాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.తన 22 ఏళ్ల ఛైర్మన్‌గా ఉన్న కాలంలో, టాటా సంస్థ విస్తరణను గ్లోబల్ పవర్‌హౌస్‌గా పర్యవేక్షించారు. రతన్ టాటా (Ratan Tata) నాయకత్వంలో, టాటా గ్రూప్ గణనీయమైన అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందింది. ముఖ్యంగా బ్రిటిష్ సంస్థ టెట్లీ టీని టాటా టీ 2000లో $450 మిలియన్లకు కొనుగోల...