Kolkata rape-murder case live : ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మమతా బెనర్జీ
Kolkata rape-murder case live updates | లైవ్ టెలికాస్ట్ చేయడానికి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అంగీకరిచకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో జూనియర్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ కేసుపై చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) అన్నారు. సుప్రీంకోర్టు అనుమతితో ప్రభుత్వం రికార్డు చేసిన ఫుటేజీని నిరసన తెలిపిన వైద్యులతో పంచుకోవచ్చని బెనర్జీ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను ధిక్కరిస్తూ, జూనియర్ డాక్టర్లు కోల్‌కతాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్థ్య భవన్ వెలుపల సిట్ నిరసనలు కొనసాగిస్తున్నారు.ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, అయితే "రాజకీయ శక్తులు" నిరసనలను ప్రభావితం ...