శ్రీశైలానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ
బస్సుల ఫ్రీక్వెన్సీ పెంపు
హైదరాబాద్: పర్యాటకుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టిఎస్‌ఆర్‌టిసి సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి ప్రత్యేక వారాంతపు టూర్ ప్యాకేజీని ప్రకటించింది.రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రతీ శనివారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి బస్సు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు తిరిగి జేబీఎస్‌కు వస్తుందని టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు వెల్లడించారు.సుప్రసిద్ధ శ్రీశైలం ఆలయాన్ని సందర్శించడమే కాకుండా, పాతాళగంగ, పాలధార, పంచధార, శ్రీశైలం ఆనకట్ట, శిఖరం మొదలైన సమీప పర్యాటక ప్రదేశాల సందర్శనలను కూడా ప్యాకేజీలో చేర్చడం జరిగింది. కాగా ఈ స్పెషల్ శ్రీశైలం ప్యాకేజీ టిక్కెట్ ధర పెద్దలకు రూ. 2,700, పిల్లలకు రూ.1,570.ఈ ప్యాకేజీలోనే నాన్...