Friday, January 23Thank you for visiting

Tag: Rashtravad

సాంకేతికతపై మానవుల‌కు నియంత్ర‌ణ ఉండాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్

సాంకేతికతపై మానవుల‌కు నియంత్ర‌ణ ఉండాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్

National, తాజా వార్తలు
నాగ్‌పూర్ పుస్తక ప్రదర్శనలో RSS చీఫ్ కీలక ప్రసంగంనాగ్‌పూర్ : సాంకేతికతపై మానవులకు పూర్తి నియంత్రణ ఉండాలని, భారతీయ నైతికత క‌లిగిన‌ నిజమైన జాతీయవాదమే ప్రపంచానికి శాంతిని అందిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. శనివారం నాగ్‌పూర్ పుస్తక ప్రదర్శనలో రచయితలు, హాజరైన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచ మార్పుల నేపథ్యంలో సాంస్కృతిక పరిరక్షణ, సమతుల్య జీవితం యొక్క ఆవశ్యకతను ఆయన వివ‌రించారు.AI కి మానవుడే మాస్టర్ కావాలిఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెరుగుదలతో మానవులు కేవలం 'యంత్రాలుగా' మారిపోకూడదని మోహన్ భగవత్ హెచ్చరించారు. "సాంకేతికతను ఆపలేం, కానీ అది తప్పనిసరిగా మానవాళి శ్రేయస్సుకు సేవ చేయాలి, మనం దాని యజమానులుగా ఉండాలి, దాని పరిమితులను నిర్దేశించాలి. మొబైల్ ఫోన్‌లను సాధనాలుగా ఉపయోగించాలి, అవి మనల్ని ఉపయోగించుకోనివ్వకూడదు," అని ఆయన అన్నారు.నిజ...