ఓ వ్యక్తికి రెండేళ్లుగా కడుపునొప్పి, ఎక్స్ రే చూసి బిత్తరపోయిన డాక్టర్లు.. కడుపులో నుంచి ఏకంగా వంద వస్తువులు
పంజాబ్ లో ఓ ఊహించని ఘటన జరిగింది. పంజాబ్‌లోని మోగాలోని ఓ ఆసుపత్రి వైద్యులు గురువారం ఓ రోగికి ఆపరేషన్ చేస్తుండగా కడుపులో నుంచి వచ్చిన వస్తువులను చూసి షాక్ కు గురయ్యారు. అతడి కడుపులో ఇయర్‌ఫోన్‌లు, లాకెట్‌లు, స్క్రూ, రాఖీలను బయటకు తీశారు. . 40 ఏళ్ల వ్యక్తి రెండు రోజులుగా వికారం, వాంతులు, తీవ్ర జ్వరం కడుపు నొప్పి(Stomach Pain)తో బాధపడుతూ.. మోగాలోని మెడిసిటీ ఆసుపత్రిలో చేరాడు. అతని కడుపు నొప్పి తగ్గకపోవడంతో, అతని నొప్పికి కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యులు అతని కడుపుపై ఎక్స్-రే స్కాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్స్ రే రిపోర్ట్ చూసిన వైద్యులు బిత్తరపోయారు.
స్కాన్‌లో మనిషి కడుపులో అనేక లోహ వస్తువులు ఉన్నట్లు తేలింది. మూడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన శస్త్ర చికిత్స అనంతరం అతడి శరీరంలోని నుంచి సుమారు 100కు పైగా వస్తువులను వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు.అతని కడుపులోంచి బయటకు తీసిన దాదాపు వ...