Rythu runa Mafi | మూడవ విడత రుణమాఫీపై సర్కారు కీలక అప్ డేట్
వైరా సభ ద్వారా రైతులకు రుణ విముక్తి ప్రకటన
Rythu runa Mafi | ఖమ్మం : రుణమాఫీ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. రెండు లక్షల వరకు రైతు రుణ మాఫీ ఆగస్టట్ 15లోపు చేస్తామని మరోసారి స్పష్టం చేసింది. శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15లోపు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. వైరాలో భారీ రైతు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. వైరా నుంచి ఆగష్టు 15న రాష్ట్రంలో రైతులకు రుణ విముక్తి చేస్తామన్నారు. రైతుల రుణమాఫీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చాలెంజ్ చేశారని.... కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు వైరా సభలో రైతులు పండుగ లాగా పాల్గొని మన రైతాంగ సోదరులు మంచి సందేశం ఇచ్చేలా సభ జరుపు...