
Indian Railways | మూడు రాష్ట్రాల్లో ₹6,405 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం
కార్బన్ ఉద్గారాల తగ్గింపు – డీజిల్ ఆదా – గ్రామీణ కనెక్టివిటీకి ఊతంRailway Infrastructure | రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం బుధవారం రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అవి జార్ఖండ్‌లోని కోడెర్మా-బర్కకానా డబ్లింగ్, కర్ణాటక - ఆంధ్రప్రదేశ్‌లోని బల్లారి-చిక్జాజూర్ డబ్లింగ్ (Ballari–Chikjajur doubling ) ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తవుతాయిని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మొత్తం అంచనా వ్యయం రూ. 6,405 కోట్లు, దీంతో భారత రైల్వే నెట్‌వర్క్‌ను 318 కి.మీ.ల మేర విస్తరిస్తుంది.ఈ రెండు లైన్లు ప్రయాణీకులకు రైల్వే సేవలతోపాటు, సరుకు రవాణాకు కీలకంగా మారనున్నాయి. అలాగే కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తాయి. "కనెక్టివిటీని మెరుగుపరచడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి రెండు ప్రాజెక్టులు ...