పార్లమెంట్‌లో విపక్షాల్లో చీలికలు మొదలు..
Opposition Protests in Parliament : అదానీ కేసుకు సంబంధించి గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విపక్షాలు నిరసన తెలిపాయి. ఈ ప్రదర్శనలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు నల్ల కోటు ధరించి నినాదాలు చేశారు. ఈ జాకెట్‌పై 'అదానీ, మోదీ ఒక్కటే' అని రాసి ఉంది. అదానీపై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ దర్యాప్తు చేయబోరని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ పేర్కొన్నారు. అయితే పార్లమెంట్‌లో నిరసనల విషయంలో ప్రతిపక్షంలో కూడా చీలిక వచ్చింది. ఈ నిరసనకు మమ్మల్ని ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ అన్నారు. అదానీ ఇష్యూ కంటే సంభాల్ ఇష్యూ పెద్దది. సంభాల్ విషయంలో ఎస్పీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు.
మోదీ-అదానీ ఒక్కటే: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎస్పీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా పాల్గొనలేదు. పా...