Election code | ‘ఓటుకు నీళ్లు’ ఇస్తామన్న కర్ణాటక డిప్యూటీ సీఎం.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు..!
Election code | బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డీకే శివకుమార్ కోడ్‌ను ఉల్లంఘించారంటూ బెంగళూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ‘ఓటుకు నీళ్లు’ ఆఫర్ చేసి శివకుమార్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. డీకే శివకుమార్ శనివారం తన సోదరుడు డీకే సురేష్ తరఫున బెంగళూరులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.డీకే సురేష్ బెంగళూరు రూరల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తరుపున ప్రచారం చేస్తూ శివకుమార్ మాట్లాడారు. తన సోదరుడు సురేష్‌ను గెలిపిస్తే కావేరీ నది నుంచి తాగు నీటిని తరలించి నగర ప్రజల దాహార్తి తీరుస్తానని హామీ ఇచ్చారు. అయితే డీకే శివకుమార్ ఇచ్చిన ఈ హామీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓటు వేస్తే నీళ్లు ఇస్తామని చెప్పడం ఓటర్లను ప్...