Monday, September 1Thank you for visiting

Tag: PM modi

Surya Mitra | ప్ర‌తీ ఇంటిపై సోల‌ర్ ప్యానెల్స్.. ఇందుకోసం  కొత్త‌గా 30వేల మంది సూర్య‌మిత్ర ఉద్యోగాల నియామ‌కం..

Surya Mitra | ప్ర‌తీ ఇంటిపై సోల‌ర్ ప్యానెల్స్.. ఇందుకోసం కొత్త‌గా 30వేల మంది సూర్య‌మిత్ర ఉద్యోగాల నియామ‌కం..

Career
Surya Mitra | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ భారీ లక్ష్యాన్ని సాధించడానికి 30,000 మంది యువకులను "సూర్య మిత్రలు (Surya Mitra )గా తీసుకోవాల‌ని భావిస్తోంది. దేశవ్యాప్తంగా కోటి సోలార్ రూఫ్‌టాప్‌లను కలిగి ఉండాలనే లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ప్రారంభించిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 25 లక్షలకు పైగా సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఇంట్లో సౌర ఫలకాలను కలిగి ఉండాలనే లక్ష్యాన్ని సాధించడానికి, సౌరశక్తి రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం చాలా ఉందని ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (UPNEDA) సీనియర్ అధికారి PTIకి తెలిపారు.ఇందుకోసం జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐలు)...
PM Modi in Wayanad | వాయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే.. బాధితులకు భరోసా.. 

PM Modi in Wayanad | వాయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే.. బాధితులకు భరోసా.. 

National
PM Modi in Wayanad | ప్ర‌కృతి విల‌యంలో విల‌విల‌లాడుతున్న వాయనాడ్‌లో పునరావాస కార్యక్రమాలపై ఆశలు రేకెత్తిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆగస్టు 10న కేర‌ళ‌లో పర్య‌టించారు. ఉదయం 11 గంటలకు కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధానమంత్రి కన్నూర్‌ పర్యటనలో కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ ప్రత్యేక విమానంలో ఆయనతో కలిసి వెళ్లారు. అక్కడి నుంచి వైమానిక దళం హెలికాప్టర్‌లో ఎక్కిన ప్రధాని వాయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు వెళ్లి విపత్తు జరిగిన ప్రదేశాన్ని సందర్శించే ముందు వయనాడ్‌లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వేలో ఆయ‌న‌ కొండచరియలను ప‌రిశీలించారు. ఇది ఇరువజింజి పూజ (నది) మూలం. వరద ప్రభావిత ప్రాంతాలైన పుంఛిరిమట్టం, ముండక్కై, చూరల్‌మల ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. ఏరియల్‌ సర్వే అనంతరం ఆయన హెలికా...
Budget 2024 – Andhrapradesh :  కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు

Budget 2024 – Andhrapradesh : కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు

Andhrapradesh, Business
Budget 2024 - Andhrapradesh | బడ్జెట్​ 2024లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీనిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్​ పూర్తిచేయ‌డానికి కూడా సాయమందిస్తామ‌ని తెలిపారు. విభజనచట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు.. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు అందిస్తామ‌ని, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామ‌ని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామ‌ని చెప్పారు. ఆంధ్ర ప్ర‌దేశ్ కు రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు మంజూరు చేయాల‌ని కేంద్రం నిర్ణయించిందని...
RSS | ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంపై కేంద్రం కీలక నిర్ణయం

RSS | ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంపై కేంద్రం కీలక నిర్ణయం

National
న్యూఢిల్లీ:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ సోమవారం (జూలై 22) స్వాగతించింది. కేంద్రం చర్యపై ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచార సారథి సునీల్ అంబేకర్ స్పందిస్తూ.. ‘గత 99 ఏళ్లుగా దేశ పునర్నిర్మాణంలోనూ, సమాజ సేవలోనూ ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం నిమగ్నమై ఉంది. దేశ భద్రతలో సంఘ్ సహకారం కారణంగా, ఐక్యత-సమగ్రత, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాజంతో మమేకమై సేవలందించడం చేశాయని తెలిపారు."తన రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా, అప్పటి ప్రభుత్వం సంఘ్ (RSS) వంటి నిర్మాణాత్మక సంస్థ కార్యకలాపాలలో పాల్గొనకుండా ప్రభుత్వ ఉద్యోగులను నిరాధారంగా నిషేధించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. కాగా "నవంబర్ 7, 1966న, పార్లమెంటు వద్ద...
Medchel | రూ.32 కోట్ల తో మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి..

Medchel | రూ.32 కోట్ల తో మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి..

Telangana
Medchel :  దేశంలో రైల్వే సేవల విస్తరణ..అభివృద్ధి కోసం  కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని రూ.2వేల కోట్లతో జంట నగరాల్లోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను మోదీ ప్రభుత్వం చేపట్టిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) తెలిపారు.  మేడ్చల్ రైల్వేస్టేషన్, ఆర్‌యూబీ పనులను గురువారం ఆయన పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఎంపీ ఈటల మాట్లాడారు. ప్రధాని మోదీ చొరవతోనే జంటనగరాల్లో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల అత్యాధునిక సౌకర్యాలతో  విమానాశ్రయాలను తలపిచేలా ఆధునీకరిస్తున్నారని తెలిపారు. మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి మేడ్చల్‌ రైల్వేస్టేషన్ లో (Medchel Railways Station) లో రూ.32 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.  గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడ రైల్...
ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భార‌త్

ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భార‌త్

National
India Aviation Market | న్యూఢిల్లీ: ఏవియేషన్ రంగంలో భార‌త్ ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోతోంది. గత దశాబ్దంలో వేగవంత‌మైన అభివృద్ధి కారణంగా ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా నిలిచింది. ఇది 10 సంవత్సరాల క్రితం భార‌త్‌ 5వ స్థానంలో ఉండేది. పది సంవత్సరాల క్రితం, భారతదేశం దాదాపు 8 మిలియన్ సీట్లతో చిన్న మార్కెట్‌గా ఉంది. ఇండోనేషియా 4వ స్థానంలో, బ్రెజిల్ 3వ స్థానంలో ఉంది. US మరియు చైనా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. నేడు, యుఎస్, చైనా అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్లుగా కొన‌సాగుతున్నాయి."అయితే, భారతదేశం బ్రెజిలియన్, ఇండోనేషియా దేశీయ మార్కెట్‌లను ప‌క్క‌కు నెట్టి ఏప్రిల్ 2024లో 15.6 మిలియన్ సీట్ల ఎయిర్‌లైన్ సామర్థ్యంతో మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్‌గా అవతరిస్తోంది" అని OAG డేటా తెలిపింది. 10-సంవత్సరాల సగటు కంటే దేశీయ విమాన‌యాన‌ సీట్ల సామర్థ్యం వృద్ధి రేటు అత్యధికంగా ఉంది....
MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు..  కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

National
MSP : కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వం రైతులకు గుడ్ న్యూన్ చెప్పింది. ప్రధాని న‌రేంద్ర‌ మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త మంత్రివ‌ర్గం వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర ( MSP) పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం జోడించి ఈ కొత్త‌ ధరలను నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్ల‌డించారు. దీని వల్ల ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఉంటుంది. గత ఏడాది కంటే రైతులకు రూ.35,000 కోట్ల లాభం చేకూర‌నుంది.#Cabinet approves Minimum Support Prices (MSP) for Kharif Crops for Marketing Season 2024-25The highest absolute increase in MSP over the previous year has been recommended for oilseeds and pulses#CabinetDecisions pic.twitter.com/zhqhXyNzut — Sheyphali ...
Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..

Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..

Special Stories
Nalanda New Campus | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో బుధవారం ఉదయం నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, 17 దేశాల రాయబారులు పాల్గొన్నారు. నూతన క్యాంపస్ ను ప్రారంభించిన అనంతరం మొక్కను నాటారు. ప్రధాని మోదీ . పురాతన నలంద విశ్వవిద్యాలయం శిథిలాలను కూడా పరిశీలించారు.అంతకుముందు X లో PM Modi తన అభిప్రాయాలను పంచుకున్నారు.  "ఇది మన విద్యా రంగానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు, రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభమవుతుంది. నలందకు ఈ అద్భుతమైన భాగంతో బలమైన అనుబంధం ఉంది. కొత్త క్యాంపస్ లో ఏమున్నాయి? క్యాంపస్ రెండు అకడమిక్ బ్లాక్‌లుగా విభజించబడింది.  ఒక్కో బ్లాక్ లో 40 తరగతి గదులు ఉన్నాయి. మొత్తం సీటింగ్ కెపాసిటీ సుమారు 1900. ఇందులో రెండు ఆడిటోరియంలు ఉన్నాయి. ఒక్కొక్కటి 300 మంది సీటింగ్ కెపాసి...
Nalanda University | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం విశిష్టతలు ఇవే..

Nalanda University | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం విశిష్టతలు ఇవే..

Special Stories
Nalanda University | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న న‌లంద యూనివ‌ర్సిటీలో కొత్త క్యాంప‌స్‌ను ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ (PM Modi) ఆవిష్క‌రించారు. అంత‌కు ముందు ప్ర‌ధాని మోదీ .. యునెస్కో వార‌స‌త్వ క‌ట్ట‌డమైన‌ న‌లంద మ‌హావీర‌ను సంద‌ర్శించారు.నలంద విశ్వ‌విద్యాలయానికి సంబంధించిన‌ పురాతన శిథిలాలకు 20 కి.మీ కంటే తక్కువ దూరంలోనే ఈ కొత్త క్యాంప‌స్‌ ఉంది. ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం. ఈ పురాతన విశ్వ‌విద్యాల‌యాన్ని 427 CEలో కుమారగుప్త చక్రవర్తి స్థాపించాడు. ఎనిమిది శతాబ్దాలకుపైగా నలంద విజ్ఞాన దీవిగా వర్ధిల్లింది. ఎంతో అనుభ‌వ‌జ్ఞ‌లైన వేద‌పండితులు ఇక్క‌డ బోధించేవారు. చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక, ఆగ్నేయాసియా వంటి సుదూర ప్రాంతాల నుండి 2,000 మంది ఉపాధ్యాయులు, 10,000 మంది విద్యార్థులతో అద్భుతమైన ఈ విద్...
PM Kisan Status Check |   9.2 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. ఎలా చెక్ చేసుకోవాలి?

PM Kisan Status Check | 9.2 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. ఎలా చెక్ చేసుకోవాలి?

Business, National
PM Kisan Status Check | దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన త‌ర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 17వ విడ‌త నిధుల‌ను విడుదల చేశారు. అలాగే కృషి సఖీలకు ప్రధాని ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ చేశారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కోట్లాది మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ. 3.24 లక్షల కోట్లు బ‌దిలీ చేశారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తెలిపారు.కాగా  ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున‌ సంవత్సరానికి రూ. 6,000 రైతుల ఖాతాల్లో జ‌మ అవుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 16 విడతలు విడుదల చేసింది. ''రైతు సం...