
దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నేడు ప్రధాన మోదీ శంకుస్థాపన
తెలంగాణలో 21 స్టేషన్ల ఎంపిక
దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 24,470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది.
"ఇంత భారీ సంఖ్యలో స్టేషన్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని, కాబట్టి ఇది చారిత్రాత్మక ఘట్టం అవుతుంది" అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. 2025 నాటికి ఈ స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు ప్రాజెక్ట్ పురోగతిని ప్రధాని పర్యవేక్షిస్తున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. “ఈ స్టేషన్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రధాన దృష్టి కేంద్రీకరిచింది. ఈ రైల్వే స్టేషన్ల పురోగతిని ప్రధాని వ్యక్తిగతంగా ప...