Tuesday, April 8Welcome to Vandebhaarath

Tag: Narendra Modi

MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు..  కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
National

MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

MSP : కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వం రైతులకు గుడ్ న్యూన్ చెప్పింది. ప్రధాని న‌రేంద్ర‌ మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త మంత్రివ‌ర్గం వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర ( MSP) పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం జోడించి ఈ కొత్త‌ ధరలను నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్ల‌డించారు. దీని వల్ల ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఉంటుంది. గత ఏడాది కంటే రైతులకు రూ.35,000 కోట్ల లాభం చేకూర‌నుంది.#Cabinet approves Minimum Support Prices (MSP) for Kharif Crops for Marketing Season 2024-25The highest absolute increase in MSP over the previous year has been recommended for oilseeds and pulses#CabinetDecisions pic.twitter.com/zhqhXyNzut — Sheyphali ...
G7 Summit | ‘నమస్తే’ అంటూ ప‌ల‌క‌రించున్న‌ ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..
World

G7 Summit | ‘నమస్తే’ అంటూ ప‌ల‌క‌రించున్న‌ ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..

G7 Summit | ఇటలీ (Italy) లో జరుగుతున్న జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)  శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) తో సమావేశమయ్యారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్‌లో G7 శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. G7లో US, UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ ఉన్నాయి. సమ్మిట్‌కు ఔట్‌రీచ్ కంట్రీగా భారత్‌ను ఆహ్వానించారు. జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం అర్థరాత్రి ఇటలీలోని అపులియా చేరుకున్నారు. వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. అయితే ప్ర‌ధానులిద్ద‌రూ న‌మ‌స్తే అంటూ ప‌ల‌క‌రించున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.కాగా ఈరోజు తెల్లవారుజామున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లతో ప్ర‌ధాని న‌రేంద్...
Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..
National, తాజా వార్తలు

Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..

Modi 3 Cabinet Ministers List | : నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019లో మాదిరిగానే రాష్ట్రపతి భవన్ ఎదుట అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. మోదీతో పాటు, కూటమి భాగస్వామ్య సభ్యులతో సహా NDA నాయకులు కూడా కేబినెట్, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 240 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, 272 పూర్తి మెజారిటీని సాధించలేకపోవ‌డంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో కలిసి 292 సీట్ల‌తో కాషాయ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. నారా చంద్రబాబు నాయుడుకు చెందిన తెలుగుదేశం పార్టీ (టిడిపి), నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్), ఏక్నాథ్ షిండే శివసేన, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (LJP), జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) ఇతర కూటమి సభ్యుల మద్దతుతో. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూపుదిద్దు...
MODI 3.0 | మోదీ క్యాబినెట్‌లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !
National, తాజా వార్తలు

MODI 3.0 | మోదీ క్యాబినెట్‌లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !

Narendra Modi oath-taking ceremony | న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్‌డిఎ (NDA) కూటమిలో భాగంగా పోటీ చేసిన మొత్తం ఐదుకు ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకుని అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్న యువ నేత, ఎల్‌జెపి (రామ్ విలాస్) పార్టీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్ (chirag paswan) , మూడవ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌నున్నారు. ఈ సాయంత్రం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు పాశ్వాన్‌కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నుంచి కాల్ వచ్చినట్లు తెలిసింది.మొదటి, రెండవ విడ‌త‌ నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వాలలో సైతం మంత్రివ‌ర్గంలో చిరాగ్ పాశ్వాన్‌కు చోటు ద‌క్కింది. పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ స్థానం నుంచి ఎన్నికయ్యారు, ఆయ‌న తండ్రి రికార్డుస్థాయిలో 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. రాజ‌కీయాల్లో తన తండ్రి బాట‌లో న‌డిచిన‌ చిరాగ్ పాశ్వాన్.. త‌న ప్రయాణంలో ఈ ఎన్నికలు కీలక మైలురాయిగా నిలిచాయి. ఎల్‌జేపీ లో చిరాగ్...
Modi Oath Ceremony : ప్రధాని మోదీ తోపాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే నేతల జాబితా ఇదే..
National, తాజా వార్తలు

Modi Oath Ceremony : ప్రధాని మోదీ తోపాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే నేతల జాబితా ఇదే..

Modi Oath Ceremony Live : నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు,బీజేపీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలను దేశ రాజధానిలోని ప్రధానమంత్రి ఇంటికి  తేనీటి విందుకు ఆహ్వానం అందింది. వీరిలో ఎక్కువ మంది సభ్యులు ప్రధానమంత్రి మంత్రివర్గంలో చేరి ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, రాజ్‌నాథ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, జేడీ(ఎస్) నేతలు హెచ్‌డీ కుమారస్వామి వంటి సీనియర్ నేతలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న ఎంపీల జాబితానితిన్ గడ్కరీ (మ‌హారాష్ట్ర ) రాజ్‌నాథ్ సింగ్ (ఉత్త‌ర‌ప్ర‌దేశ్) పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా కిరణ్ రిజిజు హెచ్‌డి కుమారస్వామి (క‌ర్నాట‌క‌) చిరాగ్ పాశ్వాన్ (బిహార్‌) రామ్ నాథ్ ఠాకూర్ జితన్ రామ్ మాంజీ జయంత్ చౌదరి అనుప్రియా పటేల్ ప్రతాప్ రావ్ జాదవ్ (SS)...
Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?
National, తాజా వార్తలు

Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?

Modi 3 cabinet | బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధినేత నరేంద్ర మోదీ ( Narendra Modi) ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రెండో వ్యక్తిగా మోదీ నిలిచారు.అయితే మొత్తం మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేయనప్పటికీ. మొద‌ట దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి మండలి మొత్తం బలం 78 నుంచి 81 మంది సభ్యుల మధ్య ఉండవచ్చని అంచనా.ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ఎన్నికైన నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి చెందిన పలువురు కీలక మిత్రపక్షాలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త మంత్రివ‌ర్గంలో మిత్ర‌ప‌క్షాల‌కు కూడా పెద్ద‌పీట వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలుగుద...
PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు
Elections, National

PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

PM Modi 3.0 |  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిద్వారా భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలోని మొదటి ( ఏకైక) మూడు పర్యాయాలు ప్రధాని అయిన వ్యక్తి గా మోదీ (PM Modi 3.0) నిలవనున్నారు. కాగాప్రధాని మోదీ తన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అలాగే తన పదవికి రాజీనామాను అందజేశారు. జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు.2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది.  272 మెజారిటీ మార్కుకు 32 తక్కువ. ఇది ఇప్పుడు మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు గెలుచుకున్న 53 స్థానాలపై ఆధారపడుతుంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో త...
Lok Sabha Exit polls | లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు..  తేల్చి చెప్పిన‌ సర్వే సంస్థలు..!
Elections

Lok Sabha Exit polls | లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు.. తేల్చి చెప్పిన‌ సర్వే సంస్థలు..!

Lok Sabha Exit polls : లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకే మూడో సారి ప్రజలు పట్టంకట్టినట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎగ్జిట్ పోల్‌ సర్వేలన్నీ బీజేపీదే విజయమని తేల్చి చెబుతున్నాయి. ఈసారి బీజేపీ గ‌తంలో కంటే ఏకంగా 350కి పైగా సీట్లలో గెలుపొందుతుంద‌ని దాదాపు అన్ని సర్వేలు వెల్ల‌డించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి కేవ‌లం 150 కంటే తక్కువ సీట్లకే పరిమితమవుతుందని సర్వేలు చెప్పాయి. వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.రిపబ్లిక్‌ భారత్‌-మాట్రిజ్‌ ఎన్డీఏ – 353-368 ఇండియా కూటమి – 118-133 ఇతరులు – 43-48ఇండియా న్యూస్‌ డీ డైనమిక్స్‌ ఎన్‌డీఏ – 371 ఇండియా కూటమి – 125 ఇతరులు – 47రిపబ్లిక్‌ టీవీ-పీ మార్క్‌ ఎన్డీఏ – 359 ఇండియా కూటమి – 154 ఇతరులు – 30జన్‌కీ బాత్‌ ఎన్డీఏ – 377 ఇండియా – 151 ఇతరులు – 15న్యూస్‌ నేషన్‌ ఎన్డీఏ – 342-378 ఇండియా కూటమి – 153-169 ఇతరులు – 21-23 ...
Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..
Elections

Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..

Lok Sabha Election 2024 (Key candidates) :  లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడవ, చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, చండీగఢ్ కేంద్ర పాలిత నియోజకవర్గాలు ఏడో దశ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఏడవ దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1) బీహార్: 40 సీట్లలో 8 2) హిమాచల్ ప్రదేశ్: 4 3) జార్ఖండ్: 14 నియోజకవర్గాలలో 3 4) ఒడిశా: 21 స్థానాలకు 6 5) పంజాబ్: 13 సీట్లలో 13 6) ఉత్తరప్రదేశ్: 80 నియోజకవర్గాలలో 13 7) పశ్చిమ బెంగాల్: 42 స్థానాలకు 9 8) చండీగఢ్: 1 రాష్ట్రాల వారీగా ఏడో దశ నియోజకవర్గాల జాబితా: 1) బీహార్ నలంద (జ‌న‌ర‌ల్ ) పాట్నా సాహిబ్(జ‌న‌ర‌ల్ ) పాటలీపుత్ర (జ‌న‌ర‌ల్) అర్రా (జ‌న‌ర‌ల్)బక్సర్ (జ‌న‌ర‌ల్) ససారం (SC) కరకత్ (జ‌న‌ర‌ల్) జహనాబాద్ (జ‌న‌ర‌ల...
Muslims reservations | నేను ముస్లిం వ్యతిరేకిని కాదు.. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Elections, National

Muslims reservations | నేను ముస్లిం వ్యతిరేకిని కాదు.. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Lok Sabha Elections : తాను ఇస్లాం మతాన్ని లేదా ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్ప‌ష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేసేట‌పుడు ప్ర‌తీఒక్క‌రూ వారి భవిష్యత్తు, ఎదుగుదల గురించి స‌మాజం గురించి ఆలోచించాలని ఆయ‌న పిలుపునిచ్చారు. టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ప్రతిపక్షాలు మోదీతోపాటు బీజేపీ (BJP)పై ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. ఇటీవలి ప్రసంగంలో మోడీ ‘ఎక్కువ మంది పిల్లలు’ ‘చొరబాటుదారులు’ అనే ప‌దాల‌ను వాడ‌డంతో ఆయ‌న‌పై ఇండి కూట‌మి నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు.ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వారు నెహ్రూ కాలం నుంచి ఈ కథనాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ వండి వార్చుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని ముస్లిం వ్యతిరేకులుగా దూషిస్తూనే ఉన్నారు. రెండవది వారు ముస్లింల స్నేహితులమని చెప్పుకుంటారు. ద...