India-Sri Lanka | భారత్ కు తిరుగులేని మద్దతు ప్రకటించిన శ్రీలంక
New Delhi : శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే ( Anura Kumara Dissanayake ) సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో విస్తృత చర్చల సందర్భంగా భారత్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. భారత ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి ఎవరికీ అనుమతించమని హామీ ఇచ్చారు. సంయుక్త పత్రికా ప్రకటనలో, శ్రీలంక అధ్యక్షుడు, "భారత ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా మా భూమిని ఉపయోగించడాన్ని మేము అనుమతించబోమని నేను భారత ప్రధానికి హామీ ఇచ్చాను. భారతదేశంతో తమ సహకారం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని అన్నారు.India-Sri Lanka bilateral ties : సెప్టెంబరులో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి అంతర్జాతీయ పర్యటన కోసం శ్రీలంక ప్రెసిడెంట్ దిసానాయక ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. చర్చలకు ముందు, రాష్ట్రపతి భవన్‌లో డిసానాయక్‌కు లాంఛనంగా స్వాగతం పలికారు. "వాణిజ్యం, పెట్టుబడులు, ...