తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. నాగ్ పూర్ లో రైలు నిలిపివేత
ముంబై: సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని నాగ్ పూర్ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు (Telangana Express) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఎస్-2 బోగీలో మంటలు చెలరేగగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును నాగ్ పూర్ సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరుగులుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ముంబై-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ లో మంటలుముంబై-బె...