Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: Mumbai

‘లవ్ జిహాద్’ కు వ్యతిరేకంగా చట్టాలు? మ‌హారాష్ట్ర‌లో ఏడుగురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు
Trending News

‘లవ్ జిహాద్’ కు వ్యతిరేకంగా చట్టాలు? మ‌హారాష్ట్ర‌లో ఏడుగురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు

Mumbai: మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లోని మ‌హాయుతి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులు, "లవ్ జిహాద్ (Love Jihad)" కేసులకు వ్యతిరేకంగా చట్టపరమైన చట్రాన్ని పరిశీలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సంజయ్ వర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో స్త్రీ, శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, న్యాయవ్యవస్థ (law and judiciary), సామాజిక న్యాయం (సోష‌ల్ జ‌స్టిస్‌), హోం శాఖ‌ వంటి కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ క‌మిటీలో ఉంటారు.శుక్రవారం ఆలస్యంగా జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం ప్రకారం, ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. "లవ్ జిహాద్‌", బలవంతపు మతమార్పిడుల ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలను సూచిస్తుంది. ఈ కమిటీ చట్టపరమైన అంశాలను, ఇతర రాష్ట్రాల్లో రూపొందించిన చట్టాలను కూడా...
local trains | స‌రికొత్త‌ ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్‌లు
National

local trains | స‌రికొత్త‌ ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్‌లు

Mumbai local trains : భార‌త‌దేశంలో అత్య‌ధిక జ‌నాభా గ‌ల న‌గ‌ర‌మైన ముంబైలో లోకల్ రైళ్లు నిత్యం కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎన్ని లోకల్ రైళ్లు వేసినా ప్రయాణికులకు ఏమాత్రం స‌రిపోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ముంబై ప్రయాణికులకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై నగ‌రంలో రద్దీని తగ్గించడంతోపాటు మెరుగైన లక్షణాలతో కూడిన కొత్త-డిజైన్ రైళ్లను ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ(Mumbai suburban railway system ) లో త్వరలో చేర్చ‌నున్న‌ట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) ప్రకటించారు. ముంబైలోని సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే లైన్లలో ప్రస్తుతం రూ.16,400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని వైష్ణవ్ పేర్కొన్నారు.రెండు స్థానిక రైళ్ల మధ్య సమయ అంతరాన్ని ప్రస్తుతం 180 సెకన్లుగా తగ్గించే ప్రణాళికలు ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. ప్రయాణికుల‌ రద్దీని తగ్గించడానికి సేవల ఫ్రీక్వెన్సీని పెంచడా...
Mumbai-Ahmedabad Bullet Train : భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు చూసి షాక్ అవ్వాల్సిందే..
Trending News

Mumbai-Ahmedabad Bullet Train : భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు చూసి షాక్ అవ్వాల్సిందే..

Mumbai-Ahmedabad Bullet Train | భారతదేశంలో మొట్టమొదటి బులెట్ ట్రైన్ పరుగులుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఈ హై-స్పీడ్ రైలు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లులో ప్రయాణీకులకు హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.ముంబై - అహ్మదాబాద్ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉంటాయి: ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ మరియు సబర్మతి. ప్యాసింజర్-సెంట్రిక్ డిజైన్ స్టేషన్లలో ఇంటీరియర్స్, వెయిటింగ్ ఏరియాలలో విశాల‌మైన సీటింగ్, సులభంగా స్పష్టంగా క‌నిపించే సైన్ బోర్డులు ఉంటాయి. నగర పరిధిలో ఉన్న స్టేషన్లతో స్థానిక రైల్వేలు, బస్సులు, మెట్రో లైన్లు, పార్కింగ్ సౌకర్యాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఇది ప్రయాణీకులకు హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. ప్ర...
Baba Siddique Murder Case : ఒక్క‌ హత్యతో దేశాన్ని గడగడలాడించిన నేరగాళ్లు, నిందితుల కుటుంబసభ్యులు ఏం చెప్పారు?
Crime, తాజా వార్తలు

Baba Siddique Murder Case : ఒక్క‌ హత్యతో దేశాన్ని గడగడలాడించిన నేరగాళ్లు, నిందితుల కుటుంబసభ్యులు ఏం చెప్పారు?

Baba Siddique Murder Case : 1990లలో జరిగిన రాజకీయ ప్రేరేపిత హత్యలు మ‌ళ్లీ క‌ల‌క‌లం సృష్టించాయి. దశాబ్దాల తర్వాత ముంబైలో జరిగిన బాబా సిద్ధిక్ హత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. బాబా సిద్ధిఖీపై 19 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు షూటర్లు కాల్పులు జరిపారు. సిద్ధిఖీ NCP అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకుడు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. దాదాపు 48 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్న సిద్ధిఖీ కొంతకాలం క్రితం ఎన్సీపీలో చేరారు. అయితే, మాజీ మంత్రి హత్యకు సంబంధ‌మున్న నిందితుల కుటుంబాలు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.ఈ హత్య కేసులో నిందితులు ముగ్గురూ సాధారణ కుటుంబాలకు చెందినవారే. ఇద్దరు నిందితులు శివకుమార్ అలియాస్ శివగౌతమ్. ధరమ్‌రాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులు కాగా, గుర్మైల్ బల్జీత్ సింగ్ అనే వ్యక్తి హర్యానాలోని కైతాల్ జిల్లా వాసి. ఈ ముగ్గురు యువకులు బాబా సిద్ధ...
Mumbai to Kazipet Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్ ముంబై నుంచి కాజీపేట‌కు 26 ప్ర‌త్యేక రైళ్లు..
Telangana

Mumbai to Kazipet Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్ ముంబై నుంచి కాజీపేట‌కు 26 ప్ర‌త్యేక రైళ్లు..

Mumbai to Kazipet Trains | దసరా, దీపావళి, ఛత్ పండు గల సమయంలో ప్రయాణికులకు సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా అదనపు ప్రత్యేక రైలు స‌ర్వీస్ ల‌ను ప్రవేశపెడుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ పీక్ సీజన్‌లో ప్రయాణికుల ర‌ద్దీని తగ్గించి వారికి సౌక‌ర్య‌వంత‌మైన ప్రయాణాలను అందించేందుకు ఈ ప్ర‌త్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు పేర్కొంది.సెంట్రల్ రైల్వే.. ముంబై నుంచి కాజీపేటకు 26 అదనపు ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహిస్తోంది. రాబోయే పండుగలను జరుపుకోవడానికి ప్రయాణించే ప్రయాణీకులకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. రైలు షెడ్యూల్: 07196 / 07195 దాదర్-కాజీపేట వీక్లీ స్పెషల్ (10 సర్వీసులు)దాదర్ నుంచి కాజిపేట‌ : అక్టోబర్ 17, 2024 నుంచి నవంబర్ 28, 2024 వరకు ప్రతీ గురువారం మధ్యాహ్నం 3:25 గంటలకు, మరుసటి రోజు మధ్యాహ్నం 12:50 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. కాజీపేట నుంచి దాద‌ర్‌ : అక్టోబర్...
Trains Cancelled |రక్షా బంధన్‌కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమ‌ళ్లింపు | పూర్తి వివరాలు
National

Trains Cancelled |రక్షా బంధన్‌కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమ‌ళ్లింపు | పూర్తి వివరాలు

Indian Railways | భారతీయ రైల్వే.. మహారాష్ట్రలోని రాజ్‌నంద్‌గావ్ నాగ్‌పూర్ (Nagpur) రైల్వే స్టేషన్‌ల మధ్య మూడవ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్న కార‌ణంగా వాటి మధ్య ప్రయాణించే 72 రైళ్లను రద్దు చేసింది. ఈ లైన్ నిర్మాణం కోసం రాజ్‌నంద్‌గావ్-కలమ్నా స్టేషన్ మధ్య పెద్ద ఎత్తున ప్రీ-ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో రక్షా బంధన్ (Raksha Bandhan) పండుగ‌కు ముందు 100 రైళ్లు ప్ర‌భావిత‌మ‌వుతున్నాయి. వీటిలో దాదాపు 72 రైళ్లు రద్దు ( Trains Cancelled )కాగా, 22 రైళ్ల‌ను దారిమళ్లించింది. మ‌రో 6 రైళ్ల మార్గాన్ని కుదించింది.ఆగస్టు 4 నుంచి 20 మధ్య రైల్వే యంత్రాంగం ఈ రైళ్లను రద్దు చేసింది. ఆగస్ట్ 19న రక్షాబంధన్ పండుగ ఉన్నందున, ప్ర‌జ‌లు తమ రైళ్ల వివ‌రాల‌ను ముందుగా తెలుసుకోవ‌డం ఉత్త‌మం. రాజ్‌నంద్‌గావ్ - నాగ్‌పూర్ స్టేషన్‌ల మధ్య 228 కి.మీ మూడో లైన్ కనెక్టివిటీ కోసం రైల్వే సుమార...
Mumbai-Ahmedabad Bullet Train | వ‌డివ‌డిగా బుల్లెట్ ట్రైన్ ప‌నులు.. 508 కి.మీ ప‌రిధిలో 12 స్టేష‌న్లు..
National

Mumbai-Ahmedabad Bullet Train | వ‌డివ‌డిగా బుల్లెట్ ట్రైన్ ప‌నులు.. 508 కి.మీ ప‌రిధిలో 12 స్టేష‌న్లు..

Mumbai-Ahmedabad Bullet Train | ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ ప‌నులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 508 కిలోమీటర్ల విస్తీర్ణంలో 12 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్‌లో ఎనిమిది, మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉంటాయి. గుజరాత్ ప‌రిధిలోసబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, బరూచ్, సూరత్, బిలిమోరా వాపి స్టేష‌న్ల‌ను నిర్మిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో బోయిసర్, విరార్, థానే, ముంబై లో స్టేష‌న్లు ఉన్నాయి.ఇటీవలి నివేదిక‌లు గుజరాత్‌లో బుల్లెట్ రైలు స్టేషన్ల నిర్మాణంలో వేగ‌వంత‌మైన‌ పురోగతి క‌నిపిస్తోంది. మొత్తం ఎనిమిది స్టేషన్లకు పునాది నిర్మాణ‌ పనులు పూర్తయ్యాయి, సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఐదు స్టేషన్లు-వాపి, బిలిమోరా, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్- వాటి రైలు స్థాయి స్లాబ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశాయి.వాపి, బిలిమోరా, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లలో కాంకోర్స్ స్థాయి...
Indian Railways | రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 29 రైళ్లకు 92 అదనపు జనరల్ కోచ్ లు..
National

Indian Railways | రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 29 రైళ్లకు 92 అదనపు జనరల్ కోచ్ లు..

Indian Railways News | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా 46 సుదూర రైళ్లకు 92 జనరల్ కోచ్‌లను జోడించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవ‌ల కాలంలో రైళ్ల‌లో ప్ర‌యాణించేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో టికెట్లు, సీట్లు దొర‌క‌క ప్ర‌జ‌లు అనేక‌ ఇబ్బందులు ప‌డుతున్నారు. రైళ్ల‌న్నీ కిక్కిరిపోతున్నాయి. దీనిపై రైల్వే శాఖ‌కు ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయ రైల్వే తాజా నిర్ణ‌యం తీసుకుంది. అదనపు కోచ్‌లు జ‌త‌చేసిన రైళ్ల జాబితా.. 17421/17422 తిరుపతి కొల్లాం ఎక్స్‌ప్రెస్ 12703/12704 హౌరా సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 15634/15633 గౌహతి బికనీర్ ఎక్స్‌ప్రెస్ 15631/15632 గౌహతి బార్మర్ ఎక్స్‌ప్రెస్ 15630/15629 సిల్‌ఘాట్ టౌన్ తాంబరం నాగావ్ ఎక్స్‌ప్రెస్ 15647/15648 గౌహతి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ 15651/15652 గౌహతి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ 15653...
IIT-Bombay | సీతారాముల‌ను అవమానించేలా నాట‌క ప్రదర్శన.. విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షల జరిమానా
National

IIT-Bombay | సీతారాముల‌ను అవమానించేలా నాట‌క ప్రదర్శన.. విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షల జరిమానా

Ramayana skit | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  బొంబాయి (IIT-Bombay) లో గ‌త‌ మార్చిలో ఇన్‌స్టిట్యూట్ లో జ‌రిగిన‌ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్ సందర్భంగా 'రాహోవన్ (Raahovan) ' అనే నాటకంలో పాల్గొన్న గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షల జరిమానా విధించింది.IIT-Bombay విద్యార్థులు ప్ర‌ద‌ర్శించిన నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌ (Ramayana skit) .. హిందువుల ఆరాధ్యదైవం రాముడు సీత పట్ల అగౌరవంగా, అవమానకరంగా ఉందని ఆరోపిస్తూ కొంద‌రు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అలాగే పెద్ద ఎత్తున విద్యార్థులు నిర‌స‌న‌లకుదిగారు. దీంతో ఇన్ స్టిట్యూట్ యాజ‌మాన్యం విచార‌ణ అనంత‌రం నలుగురు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్ రూ.1.20 లక్షల చొప్పున జరిమానా విధించింది. అండర్ గ్రాడ్యుయేట్ అయిన మరో నలుగురు విద్యార్థులు ఒక్కొక్కరికి రూ. 40,000 జరిమానా చెల్లించాలని కోరారు. దీంతోపాటు నిందితులందరూ హాస్టల్ ను క...
water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు
National

water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు

water crisis in indian cities | వేసవి వచ్చీరాగానే ఎండలు తీవ్రమై  అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నీటి కొరత బెంగళూరులోనే  కాదు.. ఇది భారతదేశంలోని  అనేక ప్రధాన నగరాలను వేధిస్తోంది. సమీప భవిష్యత్తులో పలు నగరాలు, పట్టణాల్లో  తీవ్రమైన నీటి కొరతతో ప్రజలు సతమతం కానున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యంగా దేశంలోని ఐదు నగరాల్లో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది.. ఆ నగరాలేంటో ఇప్పుడు చూద్దాం.. ముంబై: పెరుగుతున్న నీటి డిమాండ్, అస్థిరమైన వర్షపాతం, తగ్గుతున్న నీటి వనరులతో, నగరం తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వేగవంతమైన పట్టణీకరణ, సరిపడని మౌలిక సదుపాయాలు,  అసమర్థమైన నీటి నిర్వహణ విధానాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో నీటి నిల్వలు తగ్గిపోవడం..  ప్రత్యామ్నాయ నీటి వనరుల కొరత కారణంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BM...