TGSRTC | ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
TGSRTC | కరీంనగర్: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆర్టీసీ (TGSRTC) లో 3000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఆదివారం కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో నుంచి 33 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Parbhakar) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమది ప్రజాపాలన అని, అన్నారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలను అమలు చేస్తామని తెలిపారు.కాగా విద్యుత్ బస్సుల (Electric Buses) కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి ...