Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: LOK SABHA ELECTION 2024

Suresh Gopi కేర‌ళ కమ్యూనిస్టు కంచుకోటలో చ‌రిత్ర సృష్టించిన సురేష్ గోపి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయం..
Elections, National

Suresh Gopi కేర‌ళ కమ్యూనిస్టు కంచుకోటలో చ‌రిత్ర సృష్టించిన సురేష్ గోపి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయం..

BJP MP Suresh Gopi | మ‌ల‌యాళ న‌టుడు సురేష్ గోపి (Suresh Gopi) కేరళ రాజకీయాల్లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు.ఇటీవల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో (Lok Sabha election) ఘన విజ‌యం సాధించి మొట్టమొద‌టి సారిగా కేర‌ళ రాష్ట్రం నుంచి బీజేపీ (BJP) అభ్య‌ర్థిగా పార్ట‌మెంట్‌లో అడుగు పెట్ట‌బోతున్నారు. 2016లో మొదటిసారి రాష్ట్ర‌ప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన సురేష్ గోపి.. ఆ త‌ర్వాత బీజేపీలో చేరి 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మిపాలయ్యారు. ఆ వెంట‌నే 2021లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోను పోటీ చేయగా విజయం వరించలేదు. ముచ్చ‌ట‌గా మూడోసారి త్రిషూర్ నుంచి బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నో ఆటుపోట్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని చివ‌ర‌కు ఘన‌ విజయం సాధించారుమ‌ళ‌యాల సురేష్ గోపి. మలయాళ చిత్ర‌సీమ‌తో పాటు రాజకీయాల్లో ఆయ‌న‌ది సుదీర్ఘమైన క‌ష్ట‌త‌ర‌మైన కథ. తన 39 ఏళ్ల సుదీర్ఘ సినీ జీవితంలో 65 ఏళ్ల...
Lok Sabha Exit polls | లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు..  తేల్చి చెప్పిన‌ సర్వే సంస్థలు..!
Elections

Lok Sabha Exit polls | లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు.. తేల్చి చెప్పిన‌ సర్వే సంస్థలు..!

Lok Sabha Exit polls : లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకే మూడో సారి ప్రజలు పట్టంకట్టినట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎగ్జిట్ పోల్‌ సర్వేలన్నీ బీజేపీదే విజయమని తేల్చి చెబుతున్నాయి. ఈసారి బీజేపీ గ‌తంలో కంటే ఏకంగా 350కి పైగా సీట్లలో గెలుపొందుతుంద‌ని దాదాపు అన్ని సర్వేలు వెల్ల‌డించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి కేవ‌లం 150 కంటే తక్కువ సీట్లకే పరిమితమవుతుందని సర్వేలు చెప్పాయి. వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.రిపబ్లిక్‌ భారత్‌-మాట్రిజ్‌ ఎన్డీఏ – 353-368 ఇండియా కూటమి – 118-133 ఇతరులు – 43-48ఇండియా న్యూస్‌ డీ డైనమిక్స్‌ ఎన్‌డీఏ – 371 ఇండియా కూటమి – 125 ఇతరులు – 47రిపబ్లిక్‌ టీవీ-పీ మార్క్‌ ఎన్డీఏ – 359 ఇండియా కూటమి – 154 ఇతరులు – 30జన్‌కీ బాత్‌ ఎన్డీఏ – 377 ఇండియా – 151 ఇతరులు – 15న్యూస్‌ నేషన్‌ ఎన్డీఏ – 342-378 ఇండియా కూటమి – 153-169 ఇతరులు – 21-23 ...
లోక్‌సభ ఎన్నికల్లో  121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 647 మంది 8వ తరగతి ఉత్తీర్ణులు.. నివేదికలో ఆసక్తికర అంశాలు
Elections

లోక్‌సభ ఎన్నికల్లో 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 647 మంది 8వ తరగతి ఉత్తీర్ణులు.. నివేదికలో ఆసక్తికర అంశాలు

2024 Lok Sabha Election | న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 121 మంది అభ్యర్థులు తాము నిరక్షరాస్యులని ప్రకటించుకోగా, 359 మంది 5వ తరగతి వరకు చదువుకున్నారని ఏడీఆర్ నివేదికలు (ADR Election Data) వెల్ల‌డిస్తున్నాయి. ఇంకా 647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చ‌దివిన‌ట్లు డేటా సూచిస్తోంది. దాదాపు 1,303 మంది అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారని, 1,502 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారని ప్రకటించారు. ఇదే విశ్లేషణ ప్రకారం డాక్టరేట్ పొందిన అభ్యర్థులు 198 మంది ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది విద్యార్హతలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మొదటి దశలో.. 26 మంది నిరక్షరాస్యులు.. మొదటి దశ ఎన్నికలలో, 639 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5వ నుంచి 12వ తరగతుల మధ్య ఉన్నారని నివేదిం...
Madhya Pradesh | పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు, దెబ్బ‌తిన్న ఈవీఎంలు..
Elections

Madhya Pradesh | పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు, దెబ్బ‌తిన్న ఈవీఎంలు..

Madhya Pradesh Loksabha Elections | మధ్యప్రదేశ్‌లోని బేతుల్ (BETUL) జిల్లాలో పోలింగ్ అధికారులతోపాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను తీసుకువెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో అనేక EVMలు దెబ్బతిన్నాయని సీనియర్ అధికారి ధ్రువీకరించారు. అయితే ఈ ఘటనలో పోలింగ్ సిబ్బందికి, బస్సు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. మే 7వ తేదీ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జిల్లాలోని గోలా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగిందని బేతుల్ కలెక్టర్ నరేంద్ర సూర్యవంశీ తెలిపారు. ఈవీఎంలకు మంటలు బస్సులోని నిప్పు రవ్వ కారణంగా మంటలు చెలరేగాయ తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదంలో బూత్ నంబర్లు 275, 276, 277, 278, 279, 280 సహా నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలు (EVM) దెబ్బతిన్నాయని కలెక్టర్‌ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఆరు పోలింగ్ పార్టీలు, సమాన సంఖ్యలో ఈవీఎంలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఈవీఎంలు చె...
Third Phase Voting : ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. బరిలో నిలిచిన అగ్ర నేతల జాబితా..
Elections

Third Phase Voting : ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. బరిలో నిలిచిన అగ్ర నేతల జాబితా..

LOK SABHA ELECTION 2024 : లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా మూడో ద‌శ పోలింగ్ (Third Phase Voting ) మంగ‌ళ‌వారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక‌లు జరుగుతున్నాయి. ఈ దశలో గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లు, గోవాలోని 2 సీట్లు, దాద్రాలోని 2 సీట్లు, నగర్ హవేలీ & డామన్ - డయ్యూ, అస్సాంలో 4 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 4 సీట్లు, బీహార్‌లో 5 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 7 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 9 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 10 సీట్లు, మహారాష్ట్రలో 11 సీట్లు, కర్ణాటకలో 14 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది.కాగా మూడో దశ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, ఎన్సీపీ-శరద్ చంద్ర పవార్, సుప్రియా సూలే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సతీమణి డి...
lok sabha elections 2024 | అమేథీలో 26 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్
Elections

lok sabha elections 2024 | అమేథీలో 26 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్

Amethi | ఉత్తరప్రదేశ్‌లోని 2019లో బీజేపీ చేతతో ఓడిపోయే వ‌ర‌కు గాంధీ కుటుంబానికి బలమైన కంచుకోటగా అమేథీ ఉండేది. చేజారిపోయిన అమేథీని తిరిగి పొందేందుకు రాహుల్ గాంధీ మ‌రోసారి పోటీ చేస్తార‌ని ఆయన మద్దతుదారులు ఊహించగా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం గాంధీయేతర వ్య‌క్తిని ఎంచుకుంది.గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన కిషోర్‌ లాల్ శర్మ ఈసారి అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మూడు దశాబ్దాలలో కనీసం నలుగురు గాంధీ కుటుంబ సభ్యులు వేర్వేరు సమయాల్లో పోటీ చేయ‌గా 26 సంవత్స‌రాల తర్వాత రెండవ గాంధీయేతర కాంగ్రెస్ అభ్యర్థిగా కిశోర్ లాల్ శ‌ర్మ నిలిచారు. ఈ స్థానం నుంచి గాంధీయేతర అభ్యర్థి సతీష్ శర్మ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఖాళీ అయిన తర్వాత రెండుసార్లు విజయం సాధించారు. కానీ 1998 ఎన్నికల్లో ఓటమి చ‌విచూశారు. కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మక పోరు అమేథీ (Amethi) కాంగ్రెస్‌కు లోక్‌సభ నియోజకవర్గం ఎంతో ప...
Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు
Elections

Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Third Phase Voting : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో 1,352 మంది అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. వీరిలో 29 శాతం అంటే 392 మంది 'కోటీశ్వరులే..! ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ. 5.66 కోట్లు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), షనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్ర‌కారం.. మూడవ దశలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి ముగ్గురు అభ్యర్థులు, వారి ప్రకటించిన ఆస్తుల ఆధారంగా, వందల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. అత్యధికంగా ప్రకటించిన ఆస్తులు రూ. 1,361 కోట్లు దాటాయి. కాగా మే 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి . ADR నివేదిక ప్రకారం.. మూడవ దశ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థులలో కేవ‌లం 123 మంది (9 శాతం ) మాత్రమే మహిళలు ఉన్నారు. 18 శాతం మందిపై క్రిమినల్ కేసులు లోక్‌సభ ఎన్నికల మూడో విడత (Third Phase Voting ) లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటిం...
Elections 2024 | లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజ‌యం..
Elections

Elections 2024 | లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజ‌యం..

Surat Lok Sabha | 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. సూర‌త్ లోక్‌స‌భ (Surat Lok sabha) నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి ముఖేశ్ ద‌లాళ్‌ ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు పోలింగ్ అధికారి ప్ర‌క‌టించారు. ముఖేశ్ కుమార్ చంద్ర‌కాంత్ ద‌లాళ్ బీజేపీ నుంచి బ‌రిలో నిలిచారు. అయితే సూర‌త్ లోక్ స‌భ స్థానం నుంచి ఆయ‌న‌ విజ‌యం సాధించార‌ని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్, ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ సౌర‌భ్ పార్ది తెలిపారు. ఈమేర‌కు ద‌లాళ్‌కు ధ్రువీక‌ర‌ణ ప్ర‌త్రాన్ని కూడా అంద‌జేశారు.కాగా సూర‌త్ లోక్ స‌భ స్థానం నుంచి నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థులద‌రూ పోటీ నుంచి త‌ప్పుకున్నట్లు గుజ‌రాత్ పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ తెలిపారు. నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకునేందుకు మంగ‌ళ‌వారమే చివ‌రి తేదీ. సూర‌త్ స్థానం నుంచి ఎనిమిది మంది ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇందులో బీ...
Wayanad : వాయనాడ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ: పార్టీని వీడిన జిల్లా ప్రధాన కార్యదర్శి
Elections

Wayanad : వాయనాడ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ: పార్టీని వీడిన జిల్లా ప్రధాన కార్యదర్శి

Wayanad : వామపక్షాలు ఎంత వ్యతిరేకించినా రాహుల్ గాంధీ రెండోసారి వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. వామపక్షాలు, కాంగ్రెస్‌లు భారత కూటమిలో భాగమే, అయినా కూడా ఈ రెండు పార్టీలు కేరళ రాష్ట్రంలో పరస్పరం పోటీ పడుతున్నాయి. అయితే కీలకమైన లోక్‌సభ పోటీకి ముందు కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ తగిలింది. వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) ప్రధాన కార్యదర్శి పిఎం సుధాకరన్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. కాషాయ పార్టీలో చేరిన తర్వాత సుధాకరన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎంపీ, వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ..  ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి  పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారని  అన్నారు. " అయనకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. మరొమారు గెలిపిస్కతే వాయనాడ్ అభివృద్ధి అవకాశాలను నాశనం చేస్తారనిసుధాకరన్ విమర్శించారు.ఇదిలా ఉండగా, 2019లో అమేథీ నుంచి ఓడిపోయినట్లే, ఈసారి వాయనాడ్‌  పార్లమెంట్‌ సీటు (...
Lok Sabha Elections 2024: పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లొచ్చా? ఎన్నారైల‌కు ఓటు హ‌క్కు ఉంటుందా?
Elections

Lok Sabha Elections 2024: పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లొచ్చా? ఎన్నారైల‌కు ఓటు హ‌క్కు ఉంటుందా?

Lok Sabha Elections : లోక్‌సభ మొద‌టి ద‌శ‌ ఎన్నికలు రేపు ప్రారంభం కానుండగా, ప్రజల నుంచి అనేక సందేహాలు త‌లెత్తుతున్నాయి. పోలింగ్ బూత్‌లోకి తమ మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లవచ్చా లేదా అనేది చాలా మంది ఓటర్ల కు డౌట్ వ‌స్తుంటుంది. ఒక ఫోన్ల గురించే కాకుండా ప‌లు కీలకమైన ప్రశ్నల‌కు ఈ క‌థ‌నంలో స‌మాధానాలను తెలుసుకోవ‌చ్చు.. పోలింగ్ బూత్‌లలోకి మొబైల్ ఫోన్‌లను అనుమతిస్తారా? ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, సమగ్రతను కాపాడేందుకు ఎన్నికల సమయంలో ఓటర్లు తమ మొబైల్ ఫోన్‌లను పోలింగ్ స్టేషన్‌ల లోపలికి తీసుకెళ్లడానికి ఎలాంటి అనుమ‌తి లేదు. ఎలక్ట్రానిక్ పరికరాలను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్ల‌డానికి వీలు లేదు. ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వేసే వాతావరణాన్ని సృష్టించేందుకు ఎన్నికల సంఘం అనేక నిబంధ‌న‌లు రూపొందించింది.భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకారం, ఓటర్లు పోలింగ్ స్టేషన్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ...