ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఆందోళన – West Bengal Politics
రేపటి నుంచి భారీ ర్యాలీ చేపడతామని ప్రకటనWest Bengal Politics | కోల్‌కతా : ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలనే నిర్ణయంపై పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా, అధికార తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ SIR ప్రక్రియను బహిరంగంగా వ్యతిరేకించారు. తన అభ్యంతరాన్ని తెలియజేసేందుకు మంగళవారం (నవంబర్ 4) కోల్‌కతాలో భారీ నిరసన ప్రదర్శన చేపడతామని ముఖ్యమంత్రి మమతా ప్రకటించారు.SIR ఏమిటి?వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌తో సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించి రెండో దశను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించింది. SIR ప్రక్రియ నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు కొనసాగుతుంది. ముసాయిదా ఓటరు జాబితా డిసెంబర్ 9న ప్రచురించనున్నారు. ఇక తుది జాబితా ఫిబ్రవరి 7న విడుదల చ...

