Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..
Jammu And Kashmir : 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో సమూలమైన మార్పులు వచ్చాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ కాశ్మీర్ లోయ అత్యధిక ఓటింగ్‌తో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే లోయలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది.
రికార్డు స్థాయి పోలింగ్..
జమ్మూ కాశ్మీర్‌లో బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్-రాజౌరీ, ఉధంపూర్, జమ్మూతో సహా ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 25 వరకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. ముఖ్యంగా, ఉధంపూర్, జమ్మూలో ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉధంపూర్ 2019లో 70.15%తో పోలిస్తే 2024లో 68.27% నమోదైంది , జమ్మూ 2024లో 72.22% వద్ద ఉండగా, 2019లో 72.5% ఉంది.అయితే మిగతా మూడు స్థానాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2024...