Thursday, July 31Thank you for visiting

Tag: Jammu and Kashmir

‘Naya Kashmir’ Bills | పీవోకే ముమ్మాటికీ మనదే.. 24 సీట్లు రిజర్వ్‌ చేశాం : అమిత్‌ షా

‘Naya Kashmir’ Bills | పీవోకే ముమ్మాటికీ మనదే.. 24 సీట్లు రిజర్వ్‌ చేశాం : అమిత్‌ షా

National
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ముమ్మాటికీ మనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు . భారత్‌లో అతర్భాగమైన పీవోకేలో 24 సీట్లు రిజర్వ్‌ చేసినట్లు వెల్లడించారు.  తాజాగా రెండు ‘నయా కశ్మీర్’ బిల్లులను (‘Naya Kashmir’ Bills) కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.Naya Kashmir Bills జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్ము కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు- 2023పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో ప్రసంగించారు. జమ్ముకశ్మీర్‌లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లులు తగిన న్యాయం చేస్తాయన్నారు. కశ్మీర్‌లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47 కు పెంచినట్లు చెప్పారు.  అదేవిధంగా జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43 కు పెంచినట్లు వివరించారు.. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) కూడా మనదేనని.. అందుకే ఆ ప్రాంతంలో 24 సీట్లు రిజర్వ్‌ చే...
నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపిన చిరుత..

నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపిన చిరుత..

National
Jammu And Kashmir : జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. చిరుతపులి(leopard) నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపేసింది. ఉధంపూర్ జిల్లా (Udhampur District) లో శనివారం రాత్రి 7-8 గంటల మధ్య జరిగిన ఈ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.సమాచారం అందుకున్న ఉధంపూర్ కంట్రోల్ రూమ్‌.. వెంటనే, బాలికను రక్షించడానికి ఒక బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించింది. ఉదంపూర్‌లోని జమ్మూ కాశ్మీర్ వన్యప్రాణి విభాగం రేంజ్ అధికారి రాకేష్ శర్మ మాట్లాడుతూ.. “రాత్రి 7-8 గంటల మధ్య, 4 ఏళ్ల బాలికను చిరుతపులి ఎత్తుకెళ్లింది. మాకు సమాచారం అందడంతో ఉదంపూర్ కంట్రోల్ రూమ్ నుంచి బృందాలను పంపించాం. "ఇది చాలా దురదృష్టకర సంఘటన, బాలిక కుటుంబానికి మేము అన్ని సహాయం చేస్తాము," అన్నారాయన. జిల్లాలోని పంచారీ తహసీల్‌లోని అప్పర్ బంజలా గ్రామంలోని బాలిక ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో స్థానికులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని శర్మ త...
కాశ్మీర్ లోయలో అడుగుపెట్టిన అత్యాధునిక WhAP వాహనం

కాశ్మీర్ లోయలో అడుగుపెట్టిన అత్యాధునిక WhAP వాహనం

National
WHAP Vehicle : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కోసం భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక WHAP Vehicle ను రంగంలోకి దించింది. ఈ WHAP వాహనానికి (Wheeled Armored Amphibious Platform ) భూమి, నీరు, అలాగే చిత్తడి నేలలు, సరస్సులు, మడుగులపై  నుంచి కూడా ప్రయాణించే సత్తా కలిగి ఉంటుంది. ఈ వాహనాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), TATA సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇందులో డ్రైవర్‌తో సహా 12 మంది సైనికులను తీసుకెళ్లవచ్చు. బాంబు పేలుళ్లు, బులెట్ల వర్షాన్ని తట్టుకునే సత్తా.. 'వీల్డ్ ఆర్మర్డ్ యాంఫిబియస్ ప్లాట్‌ఫాం' (WHAP) బుల్లెట్ల వర్షం, బాంబు పేలుళ్లు, రాకెట్‌లను సైతం తట్టుకోగల ఒక బలిష్టమైన యంత్రం. ఇది శక్తివంతమైన 600-హార్స్పవర్ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, అలాగే ఖచ్చితమైన షూటింగ్ కోసం 7.62 mm రిమోట్ కంట్రోల్డ్ వెపన్ స్టేషన్ (RCWS...
ఉగ్రవాద సంస్థలతో J&K బ్యాంక్ చీఫ్ మేనేజర్ కు సంబంధాలు.. విధుల నుంచి తొలగింపు

ఉగ్రవాద సంస్థలతో J&K బ్యాంక్ చీఫ్ మేనేజర్ కు సంబంధాలు.. విధుల నుంచి తొలగింపు

Crime
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ తన చీఫ్ మేనేజర్ సజాద్ అహ్మద్ బజాజ్‌కు పాకిస్తాన్ కు చెందిన ISI, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని J&K క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) దర్యాప్తులో వెల్లయింది. దీంతో అతడిని విధుల నుంచి తొలగించింది. రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లుతుందని బజాజ్‌ను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.బజాజ్ "ISI తరపున పనిచేస్తున్న తీవ్రవాద-వేర్పాటువాద నెట్‌వర్క్‌ల పొందుపరిచిన ఆస్తి" అని J&K CID వర్గాలు ఆంగ్ల మీడియాకు తెలిపాయి. స్థానిక దినపత్రిక అయిన గ్రేటర్ కాశ్మీర్ యజమాని, ఎడిటర్ అయిన ఫయాజ్ కలూ ద్వారా ISI సాయంతో 1990లో J&K బ్యాంక్‌లో అతను చేరాడని పేర్కొంది.సజాద్ అహ్మద్ బజాజ్ (Sajad Ahmad Bazaz)1990లో క్యాషియర్-కమ్-క్లార్క్‌గా  నియమితులయ్యారు. తర్వాత 2004లో J&K బ్యాంక్‌లో ఇంటర్నల్ కమ్యూనికేషన్ హెడ్‌గా పదోన్నతి పొందారు. ఆయన కోసం ప్రత్యేక...