Sunday, August 31Thank you for visiting

Tag: hyderabad

Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..

Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..

Telangana
Double Bedroom House : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్న నిరు పేదలకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో నిర్వాసితుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు లేదా ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా అండ‌గా ఉంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అర్హులైన పేదలను రోడ్డున పడే పరిస్థితుల‌ను తీసుకురావొద్ద‌ని సూచించారు. పేద‌ల‌కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చూడాల‌ని సూచించారు. ...
ప్ర‌యాణికుల‌కు TGSRTC గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో 70 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు

ప్ర‌యాణికుల‌కు TGSRTC గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో 70 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు

Telangana
TGSRTC Metro Delux Bus | హైదరాబాద్: ప్ర‌జ‌ల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న 55 ఫ్లీట్‌కు మరో మెట్రో డీలక్స్ బస్సులను ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఉప్పల్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, జగద్గిరిగుట్ట, ఎల్‌బీ నగర్ వంటి కీలక మార్గాల్లో 70 కొత్త బస్సులు సేవలందించ‌నున్నాయి. కొత్త మెట్రో డీలక్స్ బస్సులను హైదరాబాద్ అంతటా అధిక డిమాండ్ ఉన్న రూట్లలో న‌డిపించ‌నున్నారు. ఇక్కడ ఫ్రీక్వెన్సీని మెరుగుపరచడానికి బస్సులు 15-20 నిమిషాల వ్యవధిలో నడుస్తాయి. ప్రస్తుతం, ఈ RTC బస్సులు ఉప్పల్-మెహదీపట్నం, సికింద్రాబాద్-ECIL, కోఠి, అబ్దుల్లాపూర్‌మెట్‌లతో సహా ప్రధాన మార్గాలను కవర్ చేస్తాయి ఇవి నగర ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని అందించ‌నున్నాయి. మహిళా ప్రయాణికులు టికెట్ చెల్లించాల్సిందే.. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్‌లో క...
Cabinet Meeting | మరింత పవర్ ఫుల్ గా హైడ్రా.. భారీగా సిబ్బంది కేటాయించిన  సర్కారు..  

Cabinet Meeting | మరింత పవర్ ఫుల్ గా హైడ్రా.. భారీగా సిబ్బంది కేటాయించిన సర్కారు..  

Telangana
Telangana Cabinet Meeting | తెలంగాణ కేబినేట్ తీసుకున్న నిర్ణయాలతో  హైడ్రా (Hydra) మరింత పవర్ ఫుల్ గా మారింది. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.  169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్‌ ‌సిబ్బంది అప్పగించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ లో తీసుకున్న నిర్ణయాలను  మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి,  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విలేఖరులకు వెల్లడించారు.చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా హైడ్రా (Hydra)కు విస్త్రత అధికారాలు ఇచ్చారు. రైతులకు గుడ్ న్యూస్.. మరోవైపు ఎన్నికల హామీ మేరకు రైతులకు సన్న వడ్లపై రూ.500 బోనస్‌ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం నుంచే  సన్న వడ్లపై బోనస్‌ ఇవ్వను...
Hydra Updates | ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రాకు ఎదురు లేదు..

Hydra Updates | ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రాకు ఎదురు లేదు..

Telangana
Hydra Updates |  హైదరాబాద్ నిరంతరం పరిశుభ్రమైన నగరంగా ఉండాలని అందుకే హైడ్రాను తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పర్యావరణ పునరుజ్జీవనం జరగాలనే  ఉద్దేశంతోనే. హైడ్రాను ఏర్పాటు చేశామని,  ఒకప్పుడు లేక్‌ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌.. ఫ్లడ్స్‌ సిటీగా దిగజారిపోవడానికి గత పదేళ్ళ పాలకులే కారణమని విమర్శించారు. అక్రమ నిర్మాణాల ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవంలో  ఆయన హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు.చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.  ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం ఎంతో మందిని బలిగొంది. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు ఎప్పుడు కూడా రావొద్దు. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ కోణం, స్వార్థం లేదు. ఇదొక పవిత్ర కార్యం.... ప్రకృతిని కాపాడుకునే మహా యజ్ఞం. దీనికి అందరూ ప్రతి ఒ...
Indian Railways | నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ లో 20 కోచ్ లు, 1,440 సీట్లు

Indian Railways | నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ లో 20 కోచ్ లు, 1,440 సీట్లు

National
Nagpur-Secunderabad Vande Bharat Schedule | తెలుగు రాష్ట్రాల‌కు రేపు రెండు కొత్త వందేభార‌త్ రైళ్లు అందుబాటులోకి వ‌స్తున్న విష‌యం తెలిసిందే..ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న సోమావ‌రం వీడియో రిమోట్‌ లింక్‌ ద్వారా నాగ్‌పుర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, తోపాటు భుజ్‌-విశాఖ‌ప‌ట్నం వందేభార‌త్ రైళ్ల‌ను ప్రారంభించున్నారు. అయితే నాగ్ పూర్ - సికింద్రాబాద్ రైలులో మొత్తం 20 కోచ్ లు, 1,440 సీట్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మహారాష్ట్రకు తెలంగాణకు క‌నెక్ట్ చేసే తొలి తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఇది. గ‌తంలో తీసుకువ‌చ్చిన సికింద్రాబాద్‌- బెంగళూరు వందేభారత్‌లో 8 కోచ్‌లు ఉన్నాయి. విశాఖపట్నం, తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో 16 కోచ్ లు ఉండ‌గా, నాగ్‌పుర్‌-సికింద్రాబాద్‌ వందే భారత్‌లో 20 కోచ్‌లు ఉంటాయని.. దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే ప‌రిధిలో న‌డుస్తున్న వందేభ...
Hyderabad traffic police | సెప్టెంబరు 17న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్ష‌లు

Hyderabad traffic police | సెప్టెంబరు 17న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్ష‌లు

Telangana
Hyderabad Traffic Police Issue Advisory | గణేష్ నిమజ్జనోత్స‌వాల సంద‌ర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహ‌న‌దారులు, ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్‌ ఆంక్ష‌లు విధించారు. ఈనెల 17న‌ మంగళవారం ఉదయం నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, కొన్ని ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు వెల్ల‌డించారు.కేశవగిరి, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్, ఇంజన్ బౌలి, షంషీర్‌గంజ్, నాగుల్ చింతా, హిమ్మత్‌పురా, హరి బౌలి, ఆస్రా హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్ కోటే, పంచ్ మొహలా, పారిస్ కేఫ్, గుల్జార్ హౌస్, మిట్టి కమాన్ షేర్ వద్ద హైదరాబాద్ పోలీస్ పరిమితుల్లో ఆంక్షలు ఉంటాయి. ఉస్మాన్ బజార్, షెరాన్ హోటల్, మదీనా క్రాస్‌రోడ్స్, నయాపుల్, SJ రోటరీ, అర్మాన్ హోటల్, MJ బ్రిడ్జ్, దారుల్‌షిఫా క్రాస్‌రోడ్స్, సిటీ కాలేజ్, శివాజీ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్, పుత్లీబౌలి క్రాస్‌రోడ్స్, ట్రూప్ బజార్, జంబాగ్ క్రాస్‌రోడ్స్, ఆంధ్రా బ్యాంక్...
TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్

TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్

Telangana
TGSRTC Bus Hire Discount | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిజిఎస్‌ఆర్‌టిసి ) వివాహాలు, కుటుంబ వేడుకలు, పార్టీలు మొదలైన వాటి కోసం అద్దెకు తీసుకున్న లేదా బుక్ చేసుకునే బస్సులపై ప్రత్యేక 10 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు డిసెంబర్ 31 వరకు అద్దె బస్సులపై మాత్రమే వర్తిస్తుంది.గతంలో కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప యాత్ర‌ల‌, సమయంలో అద్దె లేదా కాంట్రాక్ట్ బస్సులకు ఆర్టీసీ రాయితీలు కల్పించింది . అయితే రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయి అధికారులు 10శాతం రాయితీ కల్పించాలని నిర్ణ‌యించిన‌ట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుభకార్యక్రమాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ రాయితీని అందించినట్లు TGSRTC తెలిపింది.ప్రైవేట్ వాహనాల కంటే చాలా తక్కువ ధరలకు కార్పొరేషన్ బస్సులను అద్దెకు ఇస్తోంది. ముందస్తుగా నగదు జమ చేయకుండా...
TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోలు

TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోలు

Telangana
Hyderabad | తెలంగాణ‌లో ప్ర‌జల డిమాండ్ కు త‌గిన‌ట్లుగా కొత్త బ‌స్సుల కొనుగోలు (TGSRTC New Buses) కు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. పెరిగిన ర‌వాణా అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ప్ర‌తిపాదికగా బ‌స్సుల కొనుగోలుపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని చెప్పారు. రాష్ట్ర స‌చివాల‌యంలో టీజీ ఆర్టీసీపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. మ‌హిళ‌లు మ‌హాల‌క్ష్మి ప‌థకాన్ని వినియోగించుకుంటున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతంగా అమ‌లవుతోంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేశార‌ని తెలిపారు. దీనిని బ‌ట్టి మ‌హిళా ప్ర‌యాణికుల‌కు రూ.2,840.71 కోట్లు ఆదా అయింద‌ని రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ‌ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్‌ తెలిపారు.టిజి ఆర్టీసీలో 7,29...
TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌

TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌

Andhrapradesh, Telangana
TGSRTC Discount | హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అవ‌స్థ‌లుప‌డుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ స్వ‌ల్ప ఊర‌ట క‌ల్పించింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌ (Hyderabad to Vijayawada buses )లో రాజధాని AC సూపర్ లగ్జరీ బస్సులతో స‌హా అన్నింటిలో ప్ర‌యాణించేవారికి 10 శాతం రాయితీని అందించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్‌ఆర్‌టీసీ ) నిర్ణయించింది.హైదరాబాద్-విజయవాడ మార్గంలో ముఖ్యంగా వారాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్థిక భారాన్ని తగ్గించాల‌నే ఉద్దేశంతో కొన్ని హైఎండ్ సర్వీసులపై రాయితీలు (TGSRTC Discount) కల్పించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రాయితీ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మార్గంలో వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలనుకుంటే, విజయవాడ వరకు టిక్కెట్‌పై 10 శ...
TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు

TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు

Telangana
New Electric Buses | రాష్ట్రంలో హరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు, కాలుష్య భూతాన్ని క‌ట్ట‌డి చేసే దిశ‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ముందుకు సాగుతోంది. తాజాగా 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కించాల‌ని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం, RTC కింద ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) మోడల్‌లో నడుస్తున్నాయి.1000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌లోనే నడిపే అవకాశం ఉంది. ఇతర ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అత్య‌ధిక ట్రాఫిక్ రూట్లలో న‌డవ‌నున్నాయి. హెచ్‌సియు, హయత్‌నగర్‌తో సహా డిపోలలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కొన్ని ఎలక్ట్రిక్, డీజిల్ బస్సులను డిమాండ్ ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నారు.మరోవైపు ఎంజీబీఎస్‌...