Nagpur-Secunderabad Vande Bharat Schedule | తెలుగు రాష్ట్రాలకు రేపు రెండు కొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే..ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న సోమావరం వీడియో రిమోట్ లింక్ ద్వారా నాగ్‌పుర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్, తోపాటు భుజ్-విశాఖపట్నం వందేభారత్ రైళ్లను ప్రారంభించున్నారు. అయితే నాగ్ పూర్ – సికింద్రాబాద్ రైలులో మొత్తం 20 కోచ్ లు, 1,440 సీట్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మహారాష్ట్రకు తెలంగాణకు కనెక్ట్ చేసే తొలి తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇది. గతంలో తీసుకువచ్చిన సికింద్రాబాద్- బెంగళూరు వందేభారత్‌లో 8 కోచ్‌లు ఉన్నాయి. విశాఖపట్నం, తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో 16 కోచ్ లు ఉండగా, నాగ్‌పుర్-సికింద్రాబాద్ వందే భారత్‌లో 20 కోచ్‌లు ఉంటాయని.. దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడుస్తున్న వందేభారత్ రైళ్లలో ఇదే అతి పెద్దదిగా చెప్పవచ్చు. ఇందులో రెండు ఎగ్జిక్యూటివ్, 18 ఛైర్ 20 కార్ కోచ్‌లు ఉంటాయి. అయితే ఛార్జీల వివరాలను ఇంకా ప్రకటించలేదు. మెరుగైన భద్రత కోసం ఇందులో ‘కవచ్ వ్యవస్థను ఇన్ స్టాల్ చేశారు. అలాగే వై-ఫై, ఎల్‌ఈడీ లైటింగ్ బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు వంటి సౌకర్యాలు ఉంటాయి.
180 కి.మీ.ల స్పీడ్
మొదట ప్రవేశపెట్టిన ‘వందేభారత్ రైలు బరువు 430 టన్నులు ఉండేది..దీని గరిష్ఠ వేగం గంటకు 160 కి.మీ. మాత్రమే పరిమితమైంది. కాగా రెండోవిడతలో ప్రవేశపెడుతున్న రైలు రైలు బరువు 392 టన్నులకు తగ్గించారు. దీంతో దీని గరిష్ఠ వేగం 180 కిలోమీటర్లకు పెరిగింది. ఫలితంగా యాక్సిలరేషన్ కూడా పెరిగింది. గతంలో రైలు వేగం 100 కిలోమీటర్‌కు అందుకోవడానికి 54.6 సెకన్ల సమయం పట్టగా ఇప్పుడు కేవలం 52 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట- బల్లార్షా సెక్షన్లో 130 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించనునుందది. మల్కాజిగిరి- మౌలాలి సెక్షన్లలో కేవలం 30.కి.మీ వేగంతోనే వెళ్తుంది.
నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ షెడ్యూల్
Nagpur-Secunderabad Vande Bharat Schedule : నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ రైలును ఈ నెల 16న రైలు అందుబాటులోకి రానుంది. ఈ రెండు నగరాల మధ్యన ఉన్న 578 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 15 నిమిషాల్లోనే చేరుకునే అవకాశమున్నట్టు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు నాగూర్ లో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్ లో బయలుదేరి రాత్రి 8 గంటల 20 నిమిషాలకు నాగ్ పూర్ జంక్షన్ కు చేరుకుంటుంది. తెలంగాణలో కాజీపేట, రామగుండం, బల్లార్షా.. అలాగే మహారాష్ట్రలో చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..