Saturday, August 30Thank you for visiting

Tag: hyderabad

ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

Telangana
 హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనానికి బ్రేక్ పడింది. విలీనానికి అన్ని చట్టపరమైన సమస్యలను పరిశీలించిన తర్వాతే బిల్లుపై సంతకం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేయడంతో దానికి ఆమోదముద్ర పడలేదు. దీనికి మరికొంత సమయం అవసరమని గవర్నర్ పేర్కొన్నారు. పర్యవసానంగా, ఆదివారంతో ముగియనున్న శాసనసభ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ యోచనలు బెడిసికొట్టాయి.కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నందున, ఎన్నికలకు ముందు చివరి సెషన్‌లో టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు దాదాపు లేనట్టే.. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం సభలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని భావించినా.. దానికి గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. తర్వాత తేదీలోగానీ, ఎన్నికల కోడ్ అమల్లోకి ...
తెలంగాణ కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు

తెలంగాణ కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు

Telangana
హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు(Vande Bharat Express)ను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ నుంచి తరచుగా బెంగళూరుకు ప్రయాణించే వారి కోసం కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య కొత్తగా వందే భారత్ (VB) ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) రంగం సిద్ధం చేస్తోంది .ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఈ నెలాఖరులో వర్చువల్ మోడ్‌లో తాజా VB ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అయితే SCR అధికారులు ఇంకా లాంచ్ ఈవెంట్ గురించి అధికారికంగా వివరాలను వెల్లడించలేదు.కాగా కాచిగూడ - యశ్వంత్‌పూర్ మధ్య VB ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి ప్రవేశపెట్టబడిన మూడవ రైలు అవుతుంది. గతంలో ప్రారంభించిన మొదటి రెండు VB ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం తిరుపతికి ప్రవేశపెట్టారు..కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు జరు...
శ్రీశైలానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ

శ్రీశైలానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ

Andhrapradesh, Telangana
బస్సుల ఫ్రీక్వెన్సీ పెంపు హైదరాబాద్: పర్యాటకుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టిఎస్‌ఆర్‌టిసి సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి ప్రత్యేక వారాంతపు టూర్ ప్యాకేజీని ప్రకటించింది.రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రతీ శనివారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి బస్సు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు తిరిగి జేబీఎస్‌కు వస్తుందని టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు వెల్లడించారు.సుప్రసిద్ధ శ్రీశైలం ఆలయాన్ని సందర్శించడమే కాకుండా, పాతాళగంగ, పాలధార, పంచధార, శ్రీశైలం ఆనకట్ట, శిఖరం మొదలైన సమీప పర్యాటక ప్రదేశాల సందర్శనలను కూడా ప్యాకేజీలో చేర్చడం జరిగింది. కాగా ఈ స్పెషల్ శ్రీశైలం ప్యాకేజీ టిక్కెట్ ధర పెద్దలకు రూ. 2,700, పిల్లలకు రూ.1,570.ఈ ప్యాకేజీలోనే నాన్...
రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

Telangana
52 వంతెనలు ధ్వంసం.. నేలకూలిన  5,557 విద్యుత్ స్తంభాలు పంటనష్టం, పరిహారంపై సోమవారం మంత్రి వర్గ సమావేశంహైదరాబాద్ : తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 52 వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో వివరాలు పేర్కొన్నారు.వర్షాలు, వరద నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించగా, 16 లక్షల ఎకరాల్లో వేసిన వరి, పత్తి తదితర పంటలు ముంపునకు గురయ్యాయని ప్రాథమికంగా అంచనా వేశారు.30,000 ఎకరాల్లో కూరగాయల పంటలు కొట్టుకుపోయాయని, గ్రామాల్లో 700 కిలోమీటర్లకు పైగా పంచాయతీ రోడ్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 100 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, పట్టణాలు, నగరాల్లో 23,000 ఇళ్లు పూర్తిగా లేదా ...
ఆగస్టు 1న 466 కొత్త 108 అంబులెన్స్‌లు, 102 అమ్మ ఒడి వాహనాలు ప్రారంభం

ఆగస్టు 1న 466 కొత్త 108 అంబులెన్స్‌లు, 102 అమ్మ ఒడి వాహనాలు ప్రారంభం

Telangana
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 108 ఎమర్జెన్సీ వాహనాలు, అమ్మ ఒడి 102 వాహనాలు, హీర్స్ వెహికల్స్‌(Hearse Vehicles) ను ఆగస్టు 1న 466 సరికొత్త వాహనాలను ప్రారంభించనున్నారు.వీటిలో 204 వాహనాలు 108 అంబులెన్స్‌లు, 228 అమ్మ ఒడి వాహనాలు, 34 హియర్స్ వాహనాలు, మరణించిన వారి మృతదేహాలను వారి స్వస్థలానికి ఉచితంగా తరలించడానికి ప్రత్యేక సేవలను అందిస్తున్నాయి.ప్రస్తుతం 108 ఎమర్జెన్సీ కోసం 426 వాహనాలు ఉన్నాయి. వాటిలో 175 వాహనాలను కొత్త వాటితో భర్తీ చేస్తున్నారు. 29 కొత్త అంబులెన్స్‌లు కొత్త రూట్లలో సేవలు అందించనున్నాయి. ఆగస్టు 1 నుంచి 108 ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో మొత్తం 455 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.ప్రస్తుతం అమ్మ ఒడిలో 300 నాన్ ఎమర్జెన్సీ వాహనాలు ఉండగా, అందులో 228 వాహనాలను భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా, ప్రస్తుతం ఉన్న 34 పాత హార్స్ వాహనాల స్థానంలో అదే సంఖ్యలో కొత్త వాహనాలు వస్తున్...
వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు

వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు

Telangana
రిజర్వాయర్లలో గతేడాది కంటే భారీగా తగ్గిన నీటిమట్టాలు వర్షాల కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. సాగు విస్తీర్ణం 2022తో పోలిస్తే అన్ని పంటల సాగు తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.జూన్-సెప్టెంబర్ కాలాన్ని ఖరీఫ్ సీజన్‌గా పరిగణిస్తారు, సాధారణంగా రుతుపవనాలు వచ్చే జూన్ మొదటి వారంలో నాట్లు వేగవంతమవుతాయి. కానీ ఈ సంవత్సరం అలా జరగలేదు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 10 శాతం, మొక్కజొన్న 4 శాతం, పత్తి 7 శాతం తగ్గినట్లు వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.సుదీర్ఘ వేసవి కారణంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా తగ్గిపోయాయి. అలాగే సాగుబడికోసం సాగునీటి ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం నీటిని అందించలేకపోయింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు నమోదవుతున్నందున, మిషన్ భగీరథ ద్వారా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంపైనే దృష్టి సా...
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Telangana
Telangana Martyrs Memorial : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నిత్యం నివాళులర్పించేందుకు నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక అమరజ్యోతిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన ఈ తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి రాష్ట్ర ప్రజలకు, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరజ్యోతి స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసిన వారందరికీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చివరి రోజు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమ ఛాయాచిత్రాలతో కూడిన భారీ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం మొదటి, రెండో దశకు దారితీసిన సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైన కేసీఆర్.. వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులు, ...
నేడే అమరుల అఖండ జ్యోతి ప్రారంభం

నేడే అమరుల అఖండ జ్యోతి ప్రారంభం

Telangana
ఉద్యమ స్ఫూర్తి చాటేలా బృహత్తర నిర్మాణం telangana martyrs memorial : తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని తరాలవారు స్మరించుకునేలా బ‌ృహత్తర నిర్మాణం చేపట్టింది. రూ.177.50కోట్లు వెచ్చించిన నిర్మించిన అమరుల అఖండ జ్యోతిని గురువారం సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఓ వైపు హుస్సేన్ సాగర్‌, మరోవైపు డాక్టర్‌ అంబేద్కర్‌ సెక్రటేరియట్‌ మధ్య దీనిని నిర్మించారు.రూ.177.50 కోట్లు వెచ్చించి జూన్ 22న ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్ లెస్ స్టీల్ మెటీరియల్ తో రూపొందించడం దీని ప్రత్యేకత.. 3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో మ్యూజియం, 100 మంది సీటింగ్ సామర్థ్యంతో ఆడియో విజువల్ హాల్, 650 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, టూరిస్టులకు రెస్టారెంట్, ఇతర సౌకర్యాలు, 350 మందికి పార్కింగ్ సదు...
జూన్ 20న జగన్నాథ రథయాత్ర

జూన్ 20న జగన్నాథ రథయాత్ర

Telangana
ఏర్పాట్లు చేసిన జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ Secunderabad's Shree Jagannath Rath Yatra :  హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని జగన్నాథ రథయాత్ర జూన్ 20న నిర్వహించనున్నట్లు జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ శుక్రవారం ప్రకటించింది. జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం జగన్నాథ పురి వద్ద జరిగే రథయాత్రతో పాటుగా జగన్నాథుడు, బలభద్రుడు- సుభద్ర దేవి కోసం రథయాత్రను నిర్వహిస్తోంది . ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి క్రమం తప్పకుండా రథయాత్రను నిర్వహిస్తోంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా అమ్మవారి రథయాత్రలో భాగంగా, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయ ద్వారాలు ఉదయం 6.15 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దర్శనం కోసం తెరచి ఉంచుతారు. అనంతరం Jagannath Rath Yatra సాయంత్రం 4 గంటలకు ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభమై జనరల్ బజార్, ఎంజీ రోడ్డు మీదుగా సాయంత్రం...
ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..

ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..

Telangana
కమ్ముకుంటున్న కరువు భయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ BRSలో కలవరంహైదరాబాద్ : ఎన్నికల సంవత్సరంలో తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడడం అధికార బీఆర్‌ఎస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. నీటిపారుదల, తాగునీరు, పశుగ్రాసంపై కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోసే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.2014 నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున కరువు పరిస్థితులు రాలేదు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి ఏర్పడితే, BRS ప్రభుత్వం అనావృష్టిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అవుతుంది. వెంటనే వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని నాయకత్వం ఆశాభావంతో ఉంది. 2015 జూన్ జులైలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నా ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలు కొంతమేర నష్టాన్ని పూరించాయని గుర్తుచేశారు.రాష్ట్ర జనా...