Hyderabad Metro Rail
Hyderabad Metro Rail : ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లు..
Hyderabad Metro Rail : మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. బుధవారం ఇక్కడి JBS మెట్రో స్టేషన్‌లో ‘Me Time On My Metro’ పేరుతో జరిగిన మూడు రోజుల వినూత్న ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో ఆయన మాట్లాడారు. ఆర్డర్ ఇచ్చిన 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయని చెప్పారు. అయితే, ప్రయాణికులు మరింత క్రమశిక్షణను పాటిస్తే, […]
Hyderabad Metro : న్యూ ఇయర్ జోష్.. మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
Hyderabad Metro : హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల (New year 2025) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు కీలక ప్రకటన చేసింది. రేపు, డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో సేవలను పొడిగించినట్లు పేర్కొంది. చివరి రైలు స్టేషన్ నుంచి 12:30 AMకి బయలుదేరుతుంది, అర్ధరాత్రి 1:15 AM వరకు రైలు చివరి గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపింది. కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునే వారికి సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ […]
హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్..
Hyderabad Metro Rail Second Phase Update | హైదరాబాద్‌లో కొత్త మెట్రో మార్గాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు పరిపాలన పరమైన అనుమలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రూట్ల మేర 76.4 కిలోమీటర్ల పొడవుతో ఈ మెట్రో లైన్ ను నిర్మించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలో మీటర్ల మేర మెట్రో లైన్ నిర్మాణం […]
Hyderabad Metro Phase II | హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం కారిడార్ల వారీగా డీపీఆర్‌లు సిద్ధం
Hyderabad Metro Phase II : హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధమయ్యాయి. మొదటి దశను అనుసంధానం చేస్తూ రూ.24,042 కోట్ల అంచనా వ్యయంతో 78.4 కి.మీ మేర విస్తరించేలా 5 కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకు ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ సిస్ట్రాకు డీపీఆర్ రూపకల్పన బాధ్యతలు అప్పగించగా ఆ సంస్థ ప్రతినిధులు బేగంపేటలోని మెట్రో రైలు భవన్‌లో డీపీఆర్‌ను రెడీ చేస్తున్నారు. రెండో దశలో ప్రతిపాదించిన 5 […]
Old City Metro Corridor | పాత బస్తీ మెట్రో లైన్ అలైన్ మెంట్ లో మార్పులు.. మరో 7.5 కిలోమీటర్లు పొడిగింపు
Old City Metro Corridor | హైదరాబాద్ పాతబస్తీ మెట్రో లైన్ నిర్మాణంలో మరిన్ని మార్పులు చేయనున్నారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్‌నుమా వరకు నిర్మించాల్సి ఉండగా తాజాగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇప్పటి వరకు 5.5 కి.మీ మేర నిర్మించాల్సిన ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో లైన్ ను మరో రెండు కిలోమీటర్లు పొడిగిస్తూ కొత్త డీపీఆర్‌ను సిద్ధం చేశారు. మొత్తం 7.5 కి.మీ దూరంతో నిర్మించనున్న […]
Regional Ring Road | హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎక్స్ ప్రెస్ హైవే తరహాలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం..
Regional Ring Road | తెలంగాణ రూపురేఖలను మార్చేందుకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు చేపట్టినట్లు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. బడ్జెట్ లో రీజనల్ రింగ్ ప్రాజెక్టుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కూడా భారీగా నిధులు కేటాయించారు. నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ప్రధానమైనది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రజా రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ఒక మార్గమని, ప్రజా రవాణాలో మెట్రో రైలు […]
Hyderabad New Metro Stations | హైదరాబాద్ లో మరో 13 కొత్త మెట్రో స్టేషన్లు.. ఎక్కడెక్కడో తెలుసా.. ?
Hyderabad New Metro Stations | హైదరాబాద్: కొత్త ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్, స్టేషన్ స్థానాలను ఖరారు చేసేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HMAL ) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి శనివారం నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మేర కాలినడకన పరిశీలించారు. కొత్త నాగోల్ ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్ ప్రస్తుత నాగోల్ మెట్రో స్టేషన్‌కు సమీపంలోనే ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల ప్రయాణీకుల సౌకర్యార్థం కాన్కోర్స్ స్థాయిలో స్కైవాక్‌తో అనుసంధానించనున్నారు. భారీ […]
Old City Metro Project : త్వరలో ఓల్డ్ సిటీలో మెట్రో పరుగులు.. మారనున్న రూపురేఖలు
Old City Metro Project : హైదరాబాద్‌లోని పాత బస్తీ మెట్రో రైలు (Pathabasthi Metro Rail) మార్గానికి శుక్రవారం ఫరూక్ నగర్ డిపో వద్ద సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మొత్తం 5.5 కిలోటర్ల పొడవున 4 మెట్రో స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది. ఈ సందర్భంగా […]
