Thursday, December 19Thank you for visiting
Shadow

Tag: health

fenugreek seeds : మెంతి గింజల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

fenugreek seeds : మెంతి గింజల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

Life Style
Benefits of drinking fenugreek seeds water : శీతాకాలంలో ఆరోగ్యంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే వేడి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు చలికాలంలో తప్పనిసరిగా మెంతి గింజలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.నిజానికి, ఇనుము, కాల్షియం, సోడియం, జింక్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ఖనిజాలతో పాటు, విటమిన్లు A, B C కూడా మెంతి గింజలలో ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. దాని ప్రయోజనాలు మరియు మీరు మెంతి నీటిని ఎలా సేవించవచ్చో ముందుగా తెలుసుకుందాం.మెంతి గింజలను ఎలా తీసుకోవాలి?మెంతి గింజలను తినడానికి, మీరు ప్రతిరోజూ రాత్రి ఒక గ్లాసు నీటిలో మెంతి గింజలను నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవాలి. దీన్ని రోజూ తాగడం వల్ల ఎన్నో...
Winter Season | చలికాలంలో జలుబు బారిన పడకుండా ఈ ఫుడ్ తీసుకోవడం మర్చిపోవద్దు..

Winter Season | చలికాలంలో జలుబు బారిన పడకుండా ఈ ఫుడ్ తీసుకోవడం మర్చిపోవద్దు..

Life Style
Winter Season | చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు అంద‌రూ జలుబు బారిన ప‌డి ఇబ్బందులు ప‌డుతుంటారు. తక్కువ ఉష్ణోగ్రతలు, త‌డి వాతావ‌ర‌ణం, ఎండ త‌క్కువ‌గా ఉండ‌డం, ఇంటి లోపల ఎక్కువ సమయం వంటి కార‌ణాల‌తో వైరస్‌లు వ్యాప్తి చెందడానికి అవ‌కాశాలు ఎక్కువ‌.ఇదే స‌మయంలో మీరు సరైన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్లమీ శరీరంలో వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచ‌వ‌చ్చు. ఇది అంటువ్యాధులతో పోరాడడానికి శ‌క్తి ఇస్తుంది. చల్లని వాతావ‌ర‌ణంలోనూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఈ శీతాకాలంలో మీరు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవ‌డం చాలా ముఖ్యం. సిట్రస్ పండ్లు: విటమిన్ సి పవర్‌హౌస్‌లు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల విషయానికి వస్తే, సిట్రస్ పండ్లు ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉంటాయి. నారింజ, బ‌త్తాయి, నిమ్మకాయలు విటమిన్ సితో నిండి ఉంటాయి, అలాగే ఉసిరి, జామ పండ్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తు...
Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భార‌త్ అల‌ర్ట్‌.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..

Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భార‌త్ అల‌ర్ట్‌.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..

Life Style
Mpox Outbreak | ప్రపంచవ్యాప్తంగా MPOX కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, భార‌త్ అల‌ర్ట్ అయింది. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కలిసి స‌మీక్షిస్తోంది. . భారతదేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు ఏవీ న‌మోదైన‌ట్లు నివేదించలేదు. అయితే వ్యాధి వ్యాప్తిని నివారించడానికి, నియంత్రించడానికి ముంద‌స్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్ల‌డించింది. ఇదిలావుండ‌గా MPOX వ్యాప్తిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిని అత్యవసరంగా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పిలుపునిచ్చింది. భార‌త్ లో వైర‌స్ వ్యాప్తి త‌క్కువే.. శ‌నివారం జ‌రిగిన‌ సమీక్ష సమావేశంలో, రాబోయే వారాల్లో కేసులు న‌మోద‌య్యే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమ‌ని ప్రస్తుతం భారతదేశంలో మ‌హ‌మ్మారి భారీ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. డబ్ల్యూహ...
Drug Therapy  | డ్రగ్స్ థెరపీతో మధుమేహానికి చెక్.. ఆసక్తిరేపుతున్న కొత్త పరిశోధన

Drug Therapy | డ్రగ్స్ థెరపీతో మధుమేహానికి చెక్.. ఆసక్తిరేపుతున్న కొత్త పరిశోధన

National
Drug Therapy For Diabetes | ప్రపంచాన్ని పీడిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ప్రధానమైనది.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవడానికి  ప్రతిరోజు ఇన్సులిన్‌ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడుతుంటారు. అయితే వీరి కష్టాలను దూరం చేసేందుకు క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను పునరుత్తేజితం చేసే వినూత్నమైన డ్రగ్‌ థెరపీని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలుకల్లో చేసిన తాజా ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయని, ఇన్సులిన్‌ ఉత్పత్తి చేసే కణాలను ఈ డ్రగ్‌థెరపీతో 700 శాతం మేర యాక్టివేట్ చేశామని పరిశోధకులు వెల్లడించారు. సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, డ్రగ్ థెరపీ ఇన్సులిన్-ఉత్పత్తి చేసే కణాలను కేవలం మూడు నెలల్లో 700% పెంచుతుందని, వారి వ్యాధిని సమర్థవంతంగా తిప్పికొడుతుందని వెల్లడించింది.రక్తంలోని ...
Power Outage | ప్ర‌భుత్వ‌ ఆస్పత్రుల్లో కరెంట్ కోతలు.. అవ‌స్థ‌లు ప‌డుతున్న సిబ్బంది, రోగులు

Power Outage | ప్ర‌భుత్వ‌ ఆస్పత్రుల్లో కరెంట్ కోతలు.. అవ‌స్థ‌లు ప‌డుతున్న సిబ్బంది, రోగులు

Telangana
నివేదిక కోరిన తెలంగాణ ప్రభుత్వం Power Outage in telangana | గత రెండు రోజుల్లో సూపర్ స్పెషాలిటీతో సహా రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం, మే 22, రాత్రి, భువనగిరి ప్రభుత్వ ఆస్ప‌త్రిలో వైద్యులు రోగుల‌కు చికిత్స అందించేందుకు మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌లను ఉపయోగించడం కనిపించింది. అలాగే మంగళవారం రాత్రి వరంగల్‌లోని ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.IV ఫ్లూయిడ్స్‌పై ఉంచాల్సిన రోగులు ఇబ్బందులుప‌డ్డారు. సాయంత్రం 4.30 గంటల నుంచి ఐదు గంటలపాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో బెడ్‌లు సిద్ధం కాకపోవడంతో, వారు IV ఫ్లూయిడ్ బాటిళ్లను పట్టుకుని బయట వార్డుల్లో కనిపించారు.వేసవి ఉక్క‌పోత‌ను భ‌రించ‌లేక చాలా మంది రోగులు వార్డుల నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. రాత్రి 9.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్‌ఎస్ నేత‌లు నిప్పులు చెరిగా...
Health Benefits with Ragi | బరువు తగ్గాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఈ రుచికరమైన రాగి వంటకాలు

Health Benefits with Ragi | బరువు తగ్గాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఈ రుచికరమైన రాగి వంటకాలు

Life Style
Health Benefits with Ragi | ఇటీవ‌ల కాలంలో ప్ర‌జ‌ల్లో ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న పెరుగుతోంది. అందుకే చాలా మంది మిల్లెట్స్ (Millets) తో చేసిన ఆహారంపై ఆస‌క్తి చూపుతున్నారు. అయితే అనేక హెల్త్ బెనిఫిట్స్ కార‌ణంగా ఇటీవలి కాలంలో ప్రజాదరణ పొందిన మిలెట్ల‌లో రాగులు ప్ర‌ధాన‌మైన‌వి. ఈ గ్లూటెన్ రహిత ధాన్యం కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలతో నిండి ఉంది. రాగులు శ‌రీర బ‌రువు త‌గ్గించ‌డం (Weight loss) లో స‌హాయ‌ప‌డ‌తాయి. ఇవి పోషకమైనదిగా ఉండటమే కాకుండా వీటితో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. వివిధ రకాల వంటలలో ఉపయోగించవచ్చు. కాబట్టి మీరు అధిక బ‌రువు తగ్గించుకోవాలని ఆలోచిస్తున్న‌ట్లైతే .. మీరు ఈ 5 రుచికరమైన రాగి వంటకాలు ఒక‌సారి ట్రై చేయండి.. రాగి ఇడ్లీ (Ragi Idli) అనేక భారతీయ వంట‌కాల్లో ఇడ్లీలు ప్రధానమైన అల్పాహారం, సాంప్రదాయ బియ్యంతో చేసే ఇడ్లీలకు బ‌దులు ఇప్పుడు రాగి ఇడ్లీలు ఎక్కువ‌గా ఆస్వాదిస్తున్నా...
వేరుశెనగలతో గుండె జబ్బులకు చెక్ : నివేదిక

వేరుశెనగలతో గుండె జబ్బులకు చెక్ : నివేదిక

Life Style
Peanuts For Heart Health: నిపుణులు గుండె ఆరోగ్యానికి  హాని కలిగించే ఆహారాలపై చాలా కాలంగా దృష్టి పెట్టారు. అయితే ప్రపంచ వ్యాప్త పరిశోధనలు, యూరోపియన్ హార్ట్ జర్నల్ జూలై 2023 సంచికలో ఓ నివేదిక వెలువడింది. హానికరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం కంటే పోషకాహార లోపాల కారణంగా వాస్తవానికి గుండె సమస్యలకు కారణమవుతుందని నిపుణులు కనుగొన్నారు.80 దేశాలలో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం. పోషకాహారాల తక్కువ  వినియోగానికి.. గుండెపోటు స్ట్రోక్‌లకు మధ్య లింక్ ను గుర్తించారు. ఇందులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు, పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు చేపలు ఉన్నాయి.ప్రాస్పెక్టివ్ అర్బన్ రూరల్ ఎపిడెమియాలజీ (PURE) అధ్యయనంలో అధిక కార్బోహైడ్రేట్ తీసుకోవడం, పండ్లు, కూరగాయలు, అసంతృప్త కొవ్వులు (మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు) తక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా...
ఉప్పులో ఇన్ని రకాలు ఉన్నాయా? ఏయే ఉప్పుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

ఉప్పులో ఇన్ని రకాలు ఉన్నాయా? ఏయే ఉప్పుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Life Style
Types-of-salt And Health benefits : మన తీసుకునే ఆహారానికి సరైన రుచిని ఇచ్చేది ఉప్పు. ఎంత కమ్మగా వండినా అందులో ఉప్పు తగిన పరిమాణంలో లేకపోతే మనకు ఏమాత్రం రుచించదు. అన్నింటికంటే ముఖ్యంగా మన శరీరానికి కావలసిన సోడియం ఉప్పు కారణంగానే ఆహారం ద్వారా మనకు అందుతుంది.శరీరంలో అనేక జీవ ప్రక్రియలకు సోడియం ఎంతో అవసరం.దీనితోనే శరీరంలోని కణాలు సవ్యంగా పనిచేస్తాయి. ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల మధ్య సమతుల్యం కుదురుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.మన శరీరానికి కావాలసిన సోడియంలో 90 శాతం ఉప్పు నుండే లభిస్తుంది. ఉప్పు సాంకేతిక నామం సోడియం క్లోరైడ్. అయితే ఈ ఉప్పులో వాటి రూపం, రుచి, కూర్పును బట్టి చాలా రకాలు ఉన్నాయి. ఇవి రుచిలోపాటు పోషక విలువల్లో కూడా భిన్నంగా ఉంటాయి. మార్కెట్ లో లభించే పలు ఉప్పు రకాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి పరిశీలిద్దాం..టేబుల్ ఉప్పు(Table Salt) అత్యంత సాధారణంగా అందరి ఇళ్లో ...
“ఇండియాలో బ్రెడ్ ఆరోగ్యకరం అనేది పెద్ద జోక్”!

“ఇండియాలో బ్రెడ్ ఆరోగ్యకరం అనేది పెద్ద జోక్”!

Life Style
బ్రౌన్, మల్టీగ్రెయిన్ రకాలు ఆరోగ్యకరమైనవి కావట విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రేవంత్ మనం గొప్పగా చెప్పుకునే ఆహార పదార్థాల గురించి లోతైన విశ్లేషనలు చేసి నిజానిజాలను వెల్లడిస్తుండారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన Revant Himatsingka. ఈయన గతంలో బోర్న్‌విటాలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో వీడియోలు పంచుకోగా అవి వైరల్ అయ్యాయి. దీనిపై క్యాడ్‌బరీ కంపెనీ అతనిపై లీగల్ నోటీసును కూడా పంపింది. ఇదిలా ఉండగా తాజాగా హిమత్‌సింకా వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రౌన్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ లసౌ సంచలన నిజాలు బయటపెట్టారు రేంవత్..దీనిపై ఆయన ట్విట్లర్ లో మాట్లాడుతూ.. "భారతదేశంలో బ్రెడ్ ఒక పెద్ద జోక్!" హిమత్‌సింకా అన్నారు. "భారతదేశంలో రెండు రకాల రొట్టెలు (బ్రెడ్లు) ఉన్నాయి. ఒకటి మైదాతో చేసిన వైడ్ బ్రెడ్ (తెల్ల రొట్టె), రెండవ రకం గోధుమ.. మల్టీగ్రెయిన...
ప్రెషర్ కుక్కర్‌ ను ఎక్కువగా వాడుతున్నారా? అందులో ఇవి మాత్రం వండకండి 

ప్రెషర్ కుక్కర్‌ ను ఎక్కువగా వాడుతున్నారా? అందులో ఇవి మాత్రం వండకండి 

Life Style
టైంను ఆదా చేసుకునేందుకు వంటలు త్వరగా తయారు చేసుకునేందుకు ప్రెషర్ కుక్కర్ వాడకం ఈ రోజుల్లో ప్రతీ ఇంటిలో అనివార్యమైపోయింది. ఇది విలువైన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, పదార్థాల రుచులు, పోషకాలను సంరక్షిస్తుంది. చిక్కుళ్ళు, ధాన్యాలకు సంబంధించిన వంటలను తొందరగా చేస్తుంది.  అయితే .. ఈ ప్రెషర్ కుక్కర్‌ లో వండకూడని ఆహార పదా ర్థాలు కూడా ఉన్నాయి. ఈ ఆహారాలను వండడం కొంత హానికరం కావొచ్చు.. అంతేకాకుండా జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ ఆహారపదర్థాలేంటో ఇప్పుడు చూద్దాం..Rice - అన్నం సమయాభావం వల్ల తరచుగా ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండుతారు. అన్నం వండడానికి కుక్కర్‌ని ఉపయోగించే వారిలో మీరు కూడా ఒకరైతే, మళ్లీ ఈ తప్పు చేయకండి. ఇది బియ్యంలో ఉండే స్టార్చ్ ఆరోగ్యానికి హానికరమైన యాక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. అందుకే ప్రెషర్ కుక్కర్‌లో చేసిన అన్నం మీకు హానికరం కావొచ్చు. బియ్యాన్ని ఉడ...