Bihar Elections 2025 : చారిత్రాత్మక విజయం దిశగా ఎన్డీఏ..
Bihar Elections 2025 : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు)తో సహా బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ శుక్రవారం చరిత్ర సృష్టించింది, తాజా కౌంటింగ్ ట్రెండ్‌లతో ఈ కూటమి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. బీహార్ ఎన్నికల చరిత్రలో ఇది కూటమికి అత్యుత్తమ ప్రదర్శన, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటి 206 రికార్డును బద్దలుక కొట్టేలా కనిపించింది.రాష్ట్రంలో మహాఘట్బంధన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని కూటమి కేవలం 28 సీట్లకే పరిమితమైంది.2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశ నవంబర్ 6న, రెండో దశ నవంబర్ 11న జరిగింది. ఈ సంవత్సరం ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఎన్నికల సంఘం ప్రకారం, మొదటి దశలో 65.08 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు...

