Sunday, September 14Thank you for visiting

Tag: Education

DUSU Elections | విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్.. !

DUSU Elections | విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్.. !

Elections, National
DUSU Elections |  ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్‌యు) ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్‌లను అమలు చేయాలని కోరుతూ చేసిన ప్ర‌తిపాద‌న‌ను పరిష్కరించాల్సిందిగా ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) వైస్ ఛాన్సలర్, ఇతర సంబంధిత ప్రతివాదులను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది. విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూనియన్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం వారి హక్కులను ఉల్లంఘించడమేనని, నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారి సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తోందని పిటిషన్ వాదించింది.డియుఎస్‌యు ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ను మూడు వారాల్లోగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనివ‌ల్ల‌ విద్యార్థి సంఘంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతుందని, ...
NIRF Ranking 2024: నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ లో టాప్ 10 విద్యాసంస్థ‌లు ఇవే..

NIRF Ranking 2024: నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ లో టాప్ 10 విద్యాసంస్థ‌లు ఇవే..

Career
NIRF Ranking 2024 Top Englineering Institutes: విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2024. ప్రకారం విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్ (IIT MADRAS) భారతదేశంలో అత్యుత్తమ సంస్థగా ప్రకటించింది. IISc బెంగళూరు దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT MADRAS) గత ఏడాది కూడా వరుసగా ఐదవ సంవత్సరం అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఆసక్తికరంగా, IIT-మద్రాస్ గత 8 సంవత్సరాలుగా ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా కూడా ర్యాంక్ ను పొందింది.ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ తొమ్మిదో ఎడిషన్‌లో ఈసారి 'ఓపెన్ యూనివర్శిటీలు', 'స్కిల్ యూనివర్శిటీలు' 'స్టేట్ ఫండెడ్ గవర్నమెంట్ యూనివర్శిటీలు' వంటి మూడు కొత్త కేటగిరీలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏఐసీటీఈ...
Skill University | తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా..  త్వరలో బాధ్యతలు

Skill University | తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా.. త్వరలో బాధ్యతలు

Telangana
Telangana Skill University | తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ'కి చైర్మన్‌ (Telangana Skill University Chairman)గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఒక‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించిన‌ట్లు చెప్పారు ఆయ‌న మ‌రికొద్ది రోజుల్లోనే బాధ్యతలు స్వీకరిస్తారని వెల్ల‌డించారు.తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడిన...
Budget 2024 |  కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు

Budget 2024 | కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు

Business
Budget 2024 | ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి  అనేక కీలకమైన అంశాలనుఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.  మంగళవారం 2024-25 బడ్జెట్‌లో యువత విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 ట్రిలియన్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కేటాయించిన రూ.1.13 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ. కాగా తన ఏడవ బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ మాట్లాడుతూ, బడ్జెట్ ఉపాధి, నైపుణ్యం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME),  మధ్యతరగతి పరిశ్రమల ప్రగతిపై  దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఉత్పాదకత, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, సంస్కరణలు బడ్జెట్‌లోని తొమ్మిది ప్రాధాన్యతలను ఆమె పేర్కొన్నారు.సీతారామన్ ఉపాధి, నైపుణ్యం కోసం మొత్తం 2 ట్రిలియన్ రూపాయలతో ఐదు పథకాలను కూడా ప్రకటించారు. దేశంలో ఉద్యోగాలు, నైపుణ్యం ప్రధాన అంశాలని, వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ల మం...
Cosmetology Institute | ఫ్యాష‌న్ ప్రియుల‌కు పండగే.. హైదరాబాద్‌లో కాస్మోటాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం..

Cosmetology Institute | ఫ్యాష‌న్ ప్రియుల‌కు పండగే.. హైదరాబాద్‌లో కాస్మోటాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం..

Life Style
Indian Institute of Cosmetology | హైదరాబాద్: నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డిసి)కి అనుబంధంగా ఉన్న వెల్‌నెస్ అండ్ బ్యూటీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్మోటాలజీ, ఈస్తటిక్స్ అండ్ న్యూట్రిషన్ (I2CAN) హైదరాబాద్‌లో తన కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. డెర్మా ఆరా కాస్మెటిక్, లేజర్ క్లినిక్‌తో I2CAN వ్యూహాత్మక భాగస్వామ్యంతో హైదరాబాద్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు సోమవారం ఒక ప్రకటలో తెలిపింది.ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్మోటాలజీ (Indian Institute of Cosmetology ), ఈస్తటిక్స్ అండ్ న్యూట్రిషన్ అకడమిక్, సర్టిఫికేషన్ సేవలను అందించడంపై దృష్టి సారిస్తుందని, దక్షిణ భారతదేశంలోని విద్యార్థులకు ఈ రంగంలో ఉన్నత-నాణ్యత గల విద్యను మరింత చేరువ చేసేందుకు నిబ‌ద్ధ‌త‌తో కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు.ఈ ఇన్ స్టిట్యూట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ కాస్మోటాలజీ (PGDCC), అడ్వాన్స్‌డ్ డిప...
Telangana Inter Results | తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. టాప్ త్రీ జిల్లాలు ఇవే..

Telangana Inter Results | తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. టాప్ త్రీ జిల్లాలు ఇవే..

Telangana
Telangana Inter Results : తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) విడుద‌లయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, బోర్డు కార్యదర్శి శ్రుతి వోజా ఇంటర్‌ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రాల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేశారు. బాలికలదే హ‌వా ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రంలో 60.01 శాతం, రెండో సంవ‌త్స‌రంలో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. మొద‌టి సంవ‌త్స‌రం పరీక్షలకు మొత్తం 4.78 లక్షల విద్యార్థులు హాజరు కాగా, అందులో 2.87 లక్షల మంది పాస్ అయ్యారు. ఇంట‌ర్‌ సెకండియర్‌ పరీక్షలకు మొత్తం 5.02 లక్షల మంది హాజ‌రు కాగా, 3.22 లక్షల మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక ఈసారి కూడా బాలుర కంటే బాలికలే ముందున్నారు. బాలికలు ఫస్టియర్ లో 68.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాల...