
LPG cylinder price | కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై తగ్గింపు ఎంతగా అంటే..!
LPG cylinder price reduced today: నూతన సంవత్సరం సందర్భంగా.. జనవరి 1న ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCలు) గ్యాస్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గాయి.. ఈ క్రమంలో దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తారని అందరూ ఎదురుచూస్తుండగా గ్యాస్ కంపెనీలు ధరలను అతిస్వల్పంగా తగ్గించి అందరన్నీ ఫూల్స్ చేశాయి.
కొత్త సంవత్సరం మొదటి రోజున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ల ధరను ఎంత తగ్గించారో తెలిస్తే... నవ్వాలో, ఏడవాలో కూడా అర్ధం కాదు..
ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం(BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను కేవలం రూపాయిన్నర మాత్రమే తగ్గించాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల ధరను 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తాయి.
ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇవీ..
ధరల తగ్గింపు తర్వా...