Delhi Blast | ఢిల్లీలో భారీ పేలుడు: ఎర్రకోట మెట్రో సమీపంలో 8 మంది మృతి – రాజధానిలో రెడ్ అలర్ట్
Delhi Blast | న్యూదిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భయాందోళనకు గురైంది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో కారులో జరిగిన భారీ పేలుడు సంభవించి పది మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పేలుడు తర్వాత రాజధానిలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతా దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించారు. గాయపడిన వారిని లోక్ నాయక్ జయప్రకాశ్ (LNJP) ఆసుపత్రికి తరలించారు.దర్యాప్తు వేగవంతం – ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకిసాయంత్రం 6 గంటల సమయంలో ఢిల్లీ అగ్నిమాపక శాఖకు పేలుడు సమాచారం అందింది. వెంటనే ఏడు అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.ఒక అధికారి తెలిపిన ప్రకారం “ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు సంభవించడంతో మూడు నుంచి నాలుగు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి,” అని పేర్కొన్నారు.పేలుడు...




