Special Trains | తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త – ఢిల్లీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లకు ప్రత్యేక రైళ్లు
SCR Special Trains | కార్తీక మాసం పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని దిల్లీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్ దిశగా ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం భారీ రద్దీ నెలకొన్న నేపథ్యంలో సికింద్రాబాద్–హజ్రత్ నిజాముద్దీన్, చర్లపల్లి–దానాపూర్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.సికింద్రాబాద్–నిజాముద్దీన్ స్పెషల్ రైలు (07081 / 07082)సికింద్రాబాద్–నిజాముద్దీన్ (07081): అక్టోబర్ 28, నవంబర్ 2 తేదీల్లో నడుస్తుంది.నిజాముద్దీన్–సికింద్రాబాద్ (07082): అక్టోబర్ 30, నవంబర్ 4 తేదీల్లో తిరుగు ప్రయాణం.హాల్టింగ్ స్టేషన్లు:మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, అకోలా, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా, మథుర మొదలైనవి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.చర్లపల్లి–దానాపూర్ స్పెష...

