మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు
Mandamarri Incident: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. మేకలను చోరీ చేశారనే అనుమానంతో ఓ దళిత యువకుడితో పాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. వివరాల్లోకి వెళితే.. మందమర్రి కి చెందిన కొమురాజుల రాములు కు చెందిన మేకల మందలో నుంచి రెండు మేకలు కనిపించకుండా పోయాయి. దీంతో పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ పై అనుమానంతో ఇద్దరిని షెడ్డుకు పిలిపించారు. షెడ్డులో తాళ్లతో తలకిందులుగా వేలాడదీసి కింద పొగపెట్టి ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కొమురాజుల రాములుతోపాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఇదీ జరిగింది.
మంచిర్యాల(mancherial) జిల్లా మందమర్రి పట్టణంలో మేకలను చోరీ చేశారనే అనుమానంలో దళిత యువకుడితో పాటు పశువుల కాపరిని తాళ్లతో కట్టి వేలాడదీశారు. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగ...