
bamboo chicken: వెదురు చికెన్ కోసం ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా.. ఇంట్లోనే టేస్టీగా తయారు చేయండి
bamboo chicken recipe : రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా.. చక్కని రెసిపీ కోసం వెతుకుతున్నారా? మీ వంటగదిలో ఈ వంట కోసం సిద్ధం చేయండి.. డిన్నర్ కోసం ఈ వెదురు చికెన్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి..
భారతదేశంతోపాటు ఆగ్నేయాసియాలోని గిరిజన ప్రాంతాల నుంచి ఈ వంటకం ఉద్భవించింది. వెదురు చికెన్ అనేది నూనె లేకుండా, పోషకాలు అధికంగా ఉండే రుచికరమైన వంటకం. ఇది చికెన్ ముక్కలను వెదురు కొమ్మలో నింపి వాటిని సుగంధ ద్రవ్యాలు, మూలికల మిశ్రమంతో ఉడికించి తయారు చేస్తారు. వెదురు ఒక సహజమైన వంట పాత్రగా పనిచేస్తుంది. చికెన్‌కు ప్రత్యేకమైన మట్టి సువాసనతో పాటు దాని సహజ రసాలను నిలుపుకుంటుంది. ఈ డిష్‌కు ప్రత్యేకమైన పొగ ద్వారా భిన్నమైన టేస్ట్ ను అందిస్తుంది.. చికెన్‌ను చాలా మృదువుగా, తేమగా ఉంచుతుంది.
bamboo chicken తయారీకి కావలసినవి:
350 గ్రాముల ఎముకలు లేని చికెన్
1 స్పూన్ పసుపు పొడి
1 స్పూన్ గరం మసాలా పొడి
1 ts...