Fixed Deposit Rates | ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తుందో తెలుసుకోండి
Fixed Deposit Rates | గత రెండు నెలల్లో అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌యులు) తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించాయి. ఆగస్టులో యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకులు తమ FD రేట్లను అప్‌డేట్ చేశాయి. ప్రస్తుతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 333 రోజుల కాలవ్యవధితో FDలపై సంవత్సరానికి 7.40 శాతం వరకు అత్యధికంగా వడ్డీ రేటును అందిస్తోంది. అదనంగా, సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు , అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) అదనపు 0.50 శాతం వడ్డీని అందుకుంటారు. అయితే సూపర్ సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు పైబడినవారు) వారి FDలపై అదనంగా 0.75 శాతం మంజూరు చేస్తారు.
SBI స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) "అమృత్ వృష్టి" అనే కొత్త లిమిటెడ్ పిరియడ్ ఫిక్స్ డ్ డిపాజిట్ (FD) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం 444 రోజుల కాలవ్యవధితో FDలపై సంవత్సరానికి 7.25 ...