
ప్రైవేట్ టెలికాం సంస్థలకు BSNL షాక్: దేశవ్యాప్తంగా ‘వై-ఫై కాలింగ్’ ప్రారంభం..
97 వేల 4G సైట్లు పూర్తి!న్యూఢిల్లీ: కొత్త ఏడాది 2026 సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో వై-ఫై కాలింగ్ (VoWiFi - Wi-Fi Calling) సేవలను జనవరి 1 నుండి అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ దిగ్గజాలు జియో, ఎయిర్‌టెల్‌లకు ధీటుగా తన నెట్‌వర్క్‌ను ఆధునీకరించడంలో భాగంగా బిఎస్ఎన్ఎల్ ఈ అడుగు వేసింది.4G వేగవంతం బిఎస్ఎన్ఎల్ తన 4G నెట్‌వర్క్ విస్తరణలో కీలక మైలురాయిని చేరుకుంది. స్వదేశీ సాంకేతికత: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేతృత్వంలోని కన్సార్టియం అభివృద్ధి చేసిన స్వదేశీ టెక్నాలజీతో ఇప్పటికే 97,000 4G సైట్లు కమిషన్ చేయబడ్డాయి త్వరలోనే మరో 23,000 సైట్లను ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా 4G సాచురేషన్ సాధించాలని, ఆపై 5Gకి అప్‌గ్రేడ్ అవ్వాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.వై-ఫై కాలింగ...



