Saturday, August 30Thank you for visiting

Tag: bengaluru

New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

National
New Vande bharat Trains  | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 31న దిల్లీ నుంచి ఒకే సారి మూడు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు మీరట్ నుంచి లక్నో, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ అలాగే బెంగుళూరు నుంచి మధురై రూట్లలో నడుస్తాయి. ఫ్లాగ్ ఆఫ్ చేయబోయే కొత్త రైళ్లు:మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు-మధురై వందే భారత్ ఎక్స్‌ప్రెస్త్వరలో బికనీర్ నుంచి దిల్లీకి వందే భారత్ నవంబర్‌లో బికనీర్‌ నుంచి ఢిల్లీ మార్గంలో వందే భారత్‌ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాణీకులు ఉదయం బికనీర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వీలు క‌లుగుతుంది. అదే రాత్రి తిరిగి రావొచ్చు. ప్రయాణానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అక్టోబర్ నాటికి షెడ్యూల్, స్టేషన్ స్టాపేజ్‌లు, సమయాలను ఖరారు చేయడంతో నవంబర్ నుంచి రైళ్లు క్రమం తప్పకుండా నడపాలని రైల్వే అధికారులు ...
14-hour Workday Proposal : బెంగళూరులో ఆందోళననకు సిద్ధమవుతున్న ఐటీ ఉద్యోగులు

14-hour Workday Proposal : బెంగళూరులో ఆందోళననకు సిద్ధమవుతున్న ఐటీ ఉద్యోగులు

National
14-hour Workday Proposal (బెంగళూరు): ఐటి ఉద్యోగుల పని వేళలను పెంచాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించినందుకు నిరసనగా కర్ణాటక స్టేట్ ఐటి/ఐటిఇఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (KITU ) ఆగస్టు 3వ తేదీన‌ శనివారం ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసనను నిర్వహించనుంది.ఈ సంద‌ర్భంగా త‌మ డిమాండ్ల గురించి KITU ఆధ్వ‌ర్యంలో రెండు వారాల పాటు శాంతియుతంగా నిర‌స‌న తెలుప‌నున్నారు. ఇందులో భాగంగా IT పార్కుల వద్ద గేట్ సమావేశాలు, వీధి నిరసనలు (street protests) ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత కర్ణాటక దుకాణాలు, వాణిజ్య సంస్థల (సవరణ) బిల్లు ప్రమాణంగా 14 గంటల పనిదినాలను ఏర్పాటు చేయాలని కోరింది. మధ్యాహ్నం 2 గంటలకు 300 మందికి పైగా ఐటీ, ఐటీఈఎస్‌, బీపీఓ కార్మికులు నిరసనలో పాల్గొంటారని కేఐటీయూ ప్రధాన కార్యదర్శి సుహాస్‌ అడిగా ప్రకటించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను “అమానవీయం” అని ఖండిస్తూ, ఇది ఉద్యోగుల ప్రాథమిక హక్...
508 కిలోమీట‌ర్లు.. ఆరు వరుసలు.. హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే

508 కిలోమీట‌ర్లు.. ఆరు వరుసలు.. హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే

Andhrapradesh
Hyderabad Bengaluru Highway | తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక రాష్ట్రాలను క‌లుపుతూ కొత్త హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు మ‌ధ్య కొత్త‌ జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్‌ అవసరాలకు త‌గిన‌ట్లుగా కొత్త‌గా మ‌రొక‌ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ - బెంగళూరు మధ్య ప్రస్తుతం నాలుగు వరుసల జాతీయ ర‌హ‌దారి ఉంది. దీని తోడుగ మ‌రొక కొత్త నేషన‌ల్ హైవేను నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మాస్టర్‌ ప్లాన్‌ ఫర్‌ నేషనల్‌ హైవేస్‌ విజన్‌-2047 లో భాగంగా ఈ హైవేను నిర్మించ‌నున్నారు. ఈ ర‌హ‌దారితో నాగ్‌పుర్‌ - హైదరాబాద్‌ - బెంగళూరు నగరాల మధ్య ప్ర‌జ‌లు, స‌రుకు ర‌వాణా మెరుగుప‌ర‌చాల‌ని మోదీ ప్ర‌భుత్వం రంఎడు సంవ‌త్స‌రాల క్రిత‌మే నిర్ణయించింది. కొత్త హైవే నిర్మాణంతో ప్రయాణ సమయం ఆదా అవుతుదంఇ. నాగ్‌పుర్‌ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహద...
Bengaluru-Ernakulam | జూలై 31 నుంచి బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ప్రారంభం.. ఈ స్టేషన్లలో హాల్టింగ్

Bengaluru-Ernakulam | జూలై 31 నుంచి బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ప్రారంభం.. ఈ స్టేషన్లలో హాల్టింగ్

National
Bengaluru | ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బెంగుళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Bengaluru-Ernakulam Vande Bharat) ఎట్టకేలకు జూలై 31న ప్రారంభం కానుంది. ప‌లు నివేదికల ప్రకారం, ఈ కొత్త రైలు వారానికి మూడు సార్లు నడుస్తుంది. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని చాలా వ‌ర‌కు తగ్గిస్తుంది. కేరళలో ఇది మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్. టైమింగ్స్ ఇవీ.. ఎనిమిది కోచ్‌లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు బయలుదేరి, రాత్రి 10 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది, ఎర్నాకులం నుంచి - బుధ, శుక్ర, ఆదివారాల్లో మూడు వారాల్లో సేవ‌లు అందజేస్తుంది.మరోవైపు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు కంటోన్మెంట్ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది, గురు, శని, సోమవారాల్లో నడుస్తుంది. రైలు మార్గంలో త్రిస్సూర్, పాలక్కాడ్, పోడన్న...
Bengaluru Business Corridor | బెంగ‌ళూరులో బిజినెస్ కారిడార్ నిర్మాణానికి కసరత్తు.. వివరాలు ఇవే..

Bengaluru Business Corridor | బెంగ‌ళూరులో బిజినెస్ కారిడార్ నిర్మాణానికి కసరత్తు.. వివరాలు ఇవే..

National
Bengaluru Business Corridor | కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు బెంగళూరు బిజినెస్ కారిడార్ (BBC)గా రీబ్రాండ్ చేసిన ప్రతిపాదిత పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR) వెంట రియల్ ఎస్టేట్ వాణిజ్యపరమైన అభివృద్ధిని ప్రారంభించనుంది. 21,000 కోట్ల భారీ భూసేకరణ వ్యయానికి సబ్సిడీ ఇవ్వడం ఈ చర్య లక్ష్యం. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.27,000 కోట్లు. పెరిఫెర‌ల్ రింగ్ రోడ్డు నగర శివారు చూట్టూ ఒక వ‌ల‌యంగా నిర్మంచ‌నున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, శివారు ప్రాంతాల‌కు కనెక్టివిటీని మెరుగుపరిచేండం దీని లక్ష్యం. ఈ కారిడార్ 10 ప్రధాన జంక్షన్లు, 100 కి పైగా చిన్న కూడళ్ల మీదుగా సాగుతుంది. హేసరఘట్ట రోడ్, ఓల్డ్ మద్రాస్ రోడ్, వైట్‌ఫీల్డ్ రోడ్, చన్నసంద్ర రోడ్, హోసూర్ రోడ్ వంటి కీలక ప్రదేశాలలో వ్యూహాత్మకంగా 16 ఫ్లైఓవర్‌లను నిర్మించ‌నున్నారు.బెంగుళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) పదేపదే ప్రాజెక్ట్ కోసం బిడ్డర్లను ఆకర్షించడంలో విఫలమైంది....
Greater Bengaluru Authority | ఇక ఐదు జిల్లాలుగా బెంగళూరు మహా న‌గ‌రం.. కేబినెట్ ఆమోదం

Greater Bengaluru Authority | ఇక ఐదు జిల్లాలుగా బెంగళూరు మహా న‌గ‌రం.. కేబినెట్ ఆమోదం

National
Bengaluru | బెంగళూరును ఐదు జిల్లాలుగా విభజించి గ్రేటర్ బెంగళూరు అథారిటీ (Greater Bengaluru Authority)గా రూపొందించే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త సంస్థ 5-10 కార్పొరేషన్లను కలుపుకొని 1400 చ.కి.మీ కంటే ఎక్కువ విస్తీర్ణం క‌లిగి ఉండ‌నుంది. GBAకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నారు. వివ‌రాల్లోకి వెళితే..గార్డెన్ సిటీగా పిలువబడే బెంగళూరును ఐదు జిల్లాలుగా విభజించే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జిబిఎ) ఏర్పాటు చేయాల‌నే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను బుధ‌వారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఏర్పాటుతో సుమారు 1400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో న‌గ‌ర ప్లాన్‌, ఆర్థికప‌ర‌మైన‌ నిర్వహణ బాధ్య‌త‌ల‌ను అధికారాలకు అప్ప‌గించ‌నున్నారు. GBA 950 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1 నుండి 10 కార్పొరేషన్లను...
Double Decker Flyover | దక్షిణ భారతదేశంలోని మొట్ట‌మొద‌టి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం

Double Decker Flyover | దక్షిణ భారతదేశంలోని మొట్ట‌మొద‌టి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం

National
బెంగళూరు వాసులకు శుభవార్త.. సిలికాన్ సిటీలో మొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ (Double Decker Flyover ) వాహనాల కోసం ఈరోజు జూలై 17న 'ట్రయల్ రన్' ప్రారంభమైంది. ఫ్లైఓవర్‌కు ఒకవైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ గత నెలలో పూర్తయింది. రాగిగడ్డ మెట్రో స్టేషన్ నుంచి సెంట్రల్ సిల్క్ బోర్డ్ వరకు 3.36 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బెంగళూరు మెట్రోలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రారంభించారు.బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఈ వినూత్న మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్, నగర ప్రయాణీకులకు జీవనాధారమైన సెంట్రల్ సిల్క్ బోర్డు మార్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీని తగ్గించనుంది. డబుల్ డెక్కర్ డిజైన్‌లో ఒక ప్రత్యేకమైన వెహికల్ ఫ్లైఓవర్ నేలకు 8 మీటర్ల ఎత్తులో ఉంది, మెట్రో ఎల్లో లైన్ 16 మీటర్ల ఎత్తులో ఉంది.డబ...
Indian Street Food | ఆటోమెటిక్ గా పానిపూరీ అందించే యంత్రం.. సోషల్ మీడియాలో వైరల్..

Indian Street Food | ఆటోమెటిక్ గా పానిపూరీ అందించే యంత్రం.. సోషల్ మీడియాలో వైరల్..

Trending News, Viral
Pani-Puri | భారతదేశంలో పానీ పూరీపై ఉన్న ప్రేమ అంద‌రికీ తెలిసిందే.. సాయంత్రం అయిందంటే చాలు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా పానీ పూరి బండి వ‌ద్దకు చేరుతారు.. ఈస్ట్రీట్ ఫుడ్ కరకరలాడే పూరీ, అద్భుత‌మైన రుచి ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఫిదా చేస్తుంది. అయితే ఇప్పుడు, బెంగుళూరులో ఆటోమేటిక్ పానీ పూరీ వెండింగ్ మెషీన్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.ఈ Pani-Puri వెండింగ్ మెషీన్ ఫొటో బెంగళూరులోని హోసూర్-సర్జాపూర్ రోడ్ లేఅవుట్‌లో తీశారు. దీనిని ప్రముఖంగా హెచ్‌ఎస్‌ఆర్ అని పిలుస్తారు. ఇది మొదట @benedictgershom అనే 'X' ఎకౌంట్ నుంచి షేర్ అయింది. చాలా మంది నెటిజ‌న్లు ఈ స్టాల్ ఉన్న ప్రదేశం గురించి ఆరా తీశారు. దానికి వినియోగదారుడు సెక్టార్ 6లోని హెచ్‌ఎస్‌ఆర్ హై స్ట్రీట్‌లో ఉందని బదులిచ్చారు. వినియోగదారు షేర్ చేసిన ఫొటోను ప‌రిశీలిస్తే.. ఈ యంత్రం 'WTF - వాట్ ది ఫ్లేవర్' అనే కంపెనీ రూపొందించిన‌ట్లు తెలుస్తోం...
Indian Railways | రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 29 రైళ్లకు 92 అదనపు జనరల్ కోచ్ లు..

Indian Railways | రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 29 రైళ్లకు 92 అదనపు జనరల్ కోచ్ లు..

National
Indian Railways News | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా 46 సుదూర రైళ్లకు 92 జనరల్ కోచ్‌లను జోడించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవ‌ల కాలంలో రైళ్ల‌లో ప్ర‌యాణించేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో టికెట్లు, సీట్లు దొర‌క‌క ప్ర‌జ‌లు అనేక‌ ఇబ్బందులు ప‌డుతున్నారు. రైళ్ల‌న్నీ కిక్కిరిపోతున్నాయి. దీనిపై రైల్వే శాఖ‌కు ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయ రైల్వే తాజా నిర్ణ‌యం తీసుకుంది. అదనపు కోచ్‌లు జ‌త‌చేసిన రైళ్ల జాబితా.. 17421/17422 తిరుపతి కొల్లాం ఎక్స్‌ప్రెస్ 12703/12704 హౌరా సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 15634/15633 గౌహతి బికనీర్ ఎక్స్‌ప్రెస్ 15631/15632 గౌహతి బార్మర్ ఎక్స్‌ప్రెస్ 15630/15629 సిల్‌ఘాట్ టౌన్ తాంబరం నాగావ్ ఎక్స్‌ప్రెస్ 15647/15648 గౌహతి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ 15651/15652 గౌహతి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ 15653...
Bengaluru | వేడి దోస స‌ర్వ్ చేయని హోటల్ కు షాక్.. రూ.7000 జ‌రిమానా..

Bengaluru | వేడి దోస స‌ర్వ్ చేయని హోటల్ కు షాక్.. రూ.7000 జ‌రిమానా..

Trending News
Bengaluru Udupi Hotel | బెంగళూరు అర్బన్ జిల్లాలోని జాతీయ రహదారికి సమీపంలోని రెస్టారెంట్ కు వినియోగ‌దారుల క‌మిష‌న్ జ‌రిమానా విధించింది. కస్టమర్‌కు వేడివేడి.. శుభ్ర‌మైన‌ ఆహారాన్ని అందించనందుకు ఈ చ‌ర్య తీసుకుంది. జూన్ 19న మొదటి అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉడిపి గార్డెన్ రెస్టారెంట్‌కు రూ.7,000 చెల్లించాలని ఆదేశించింది.బెంగుళూరులోని కోరమంగళకు చెందిన 56 ఏళ్ల తహారా, 2022 జూలై 30న ఫ్యామిలీ ట్రిప్ కోసం హాసన్‌కు వెళ్తుండగా బ్రేక్‌ఫాస్ట్ కోసం రెస్టారెంట్‌లో ఆగిపోయానని పేర్కొంది. వడ్డించిన ఆహారం చల్లగా ఉందని, తాజాగా లేదని ఆమె పేర్కొంది. ఆమె వేడి భోజనం కోరగా, రెస్టారెంట్ సిబ్బంది ఆమె అభ్యర్థనను నిర్మొహమాటంగా తిరస్కరించారు. దీంతో అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్న స‌ద‌రు మ‌హిళ రెస్టారెంట్‌లో తినలేనందున తాను స‌మ‌యానికి మందులు తీసుకోలేకపోయిందని ఆరోపించారు.ఫిర్యాదును స్వీకరించి వి...