Atul Subhash suicide case | అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య, తల్లి అరెస్టు
Atul Subhash suicide case | బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాడి భార్య, ఆమె తల్లితోపాటు అతడి బావమరిదిని పోలీసులు అరెస్టు చేశారు. నికితను గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి, సోదరుడిని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లో అరెస్టు చేశారు, ఆ తర్వాత వారిని బెంగళూరుకు తీసుకువచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.అంతకుముందు శుక్రవారం.. బెంగళూరు సిటీ పోలీసులు (Bengaluru Police) అతని భార్య నికితా సింఘానియాకు సమన్లు జారీ చేసి మూడు రోజుల్లోగా హాజరు కావాలని కోరారు. సబ్-ఇన్‌స్పెక్టర్ సంజీత్ కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బెంగళూరు సిటీ పోలీస్ బృందం ఈ ఉత్తరప్రదేశ్ జిల్లాలోని ఖోవా మండి ప్రాంతంలోని సింఘానియా నివాసానికి ఉదయం 11 గంటలకు చేరుకుంది. ఆమె సమన్ల కోసం నోటీసును అతికించారు.సర్కిల్ ఆఫీసర్ (సిటీ)...