Sunday, December 22Thank you for visiting
Shadow

Tag: Bangladesh Unrest

Bangladesh Crisis | బంగ్లాదేశ్ లో ధ్వంస‌మైపోతున్న హిందూ ఆల‌యాలు..

Bangladesh Crisis | బంగ్లాదేశ్ లో ధ్వంస‌మైపోతున్న హిందూ ఆల‌యాలు..

World
Bangladesh Crisis | బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఘ‌ర్ష‌ణ‌ల‌ మధ్య గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా అనేక హిందూ దేవాలయాలను దుండ‌గులు ధ్వంసం చేశారు. ఖుల్నా డివిజన్‌లోని మెహెర్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులబెట్టారు. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి అక్క‌డి నుంచి ప‌రారైన త‌ర్వాత‌ ఆందోళనలు మరింత‌ తీవ్రమయ్యాయి. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఇస్కాన్ ప్రతినిధి యుధిస్తిర్ గోవింద దాస్, ఇస్కాన్ దేవాలయాలలో ఒకదానిని ధ్వంసం చేసి, తగులబెట్టినట్లు తెలిపారు. “నాకు అందిన సమాచారం ప్రకారం, మెహర్‌పూర్‌లోని మా ఇస్కాన్ సెంటర్‌లలో ఒకటి (అద్దెకి తీసుకున్నది) జగన్నాథుడు, బలదేవ్, సుభద్రా దేవి దేవతల విగ్ర‌హాల‌ను ధ్వంసం చేసి త‌గులబెట్టారు అని తెలిపారు. ఆ ఆల‌యంలో త‌ల‌దాచుకున్న ముగ్గురు భక్తులు ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డారు " అని గోవింద చెప్పారు.ప్ర‌ధాని హసీనా అధికారం నుంచి వైదొలిగినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో...
Sheikh Hasina | ప్ర‌ధాని ప‌ద‌వికి షేక్ హ‌సీనా రాజీనామా.. భారత్ – బంగ్లా సరిహద్దులో హై అలర్ట్..

Sheikh Hasina | ప్ర‌ధాని ప‌ద‌వికి షేక్ హ‌సీనా రాజీనామా.. భారత్ – బంగ్లా సరిహద్దులో హై అలర్ట్..

World
Sheikh Hasina | రిజర్వేషన్ల కోటా విష‌యంలో అధికార పార్టీ శ్రేణులకు నిర‌స‌న కారుల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న‌ ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతున్న వేళ‌ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. మ‌రికొన్ని నివేదిక‌ల ప్ర‌కారం.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. షేక్ హసీనా భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలాకు వచ్చినట్టుగా BBC బంగ్లా పేర్కొంది. కాగా, షేక్ హసీనా ఢాకా నుంచి వెళ్లిపోవ‌డం, రాజీనామాపై ఇంకా అధికారిక ధృవీకరించ‌లేదు. ఈ మేరకు ప్రధానమంత్రి సీనియర్ సలహాదారు ఒకరు మీడియాకు సంకేతాలు ఇచ్చారు. తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆమె తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలిపారు. భారత్‌లో అడుగుపెట్టిన హసీనా! మరోవైపు ఢాకాలోని ప్ర‌ధాని అధికారి...