TATA Motors | టాటా వాహనాలు ఎందుకు దృఢంగా ఉన్నాయి? కారణాలు ఇవే..!
TATA Motors | పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ సెగ్మెంట్లలో రతన్ టాటా కంపెనీ టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా మోటార్స్ కు చెందిన చాలా వాహనాలు ఫైవ్ స్టార్ రేటింగ్‌లను పొందాయి. అయితే టాటా తన వాహనాలన్నింటిని ఇంత పటిష్టంగా ఎలా తయారు చేసింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? టాటా మోటార్స్ వాహనాలు ఎందుకు చాలా సురక్షితమైనవి, వాటిపై నమ్మకాన్ని పెంచేందుకు టాటా కంపెనీ ఏమి చేస్తుందో మాకు తెలుసా?
అధిక నాణ్యత కలిగిన స్టీల్
టాటా మోటార్స్ వాహనాలను తయారు చేసేటప్పుడు నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు, ఈ కంపెనీ ఎల్లప్పుడూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుంటుంది. తక్కువ ధర కలిగిన వాహనాల్లో కూడా కంపెనీ అధిక దృఢమైన స్టీల్‌ను వాడడానికి ఇదే కారణం. ఇది కారు నిర్మాణాన్ని బలపరుస్తుంది. ఒక భవనానికి బలమైన పునాది ఎంత బలంగా చేకూరుస్తుందో.. అలాగే వాహనం కూడా దృఢంగ...